భక్తి కథలు

యాజ్ఞసేని-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్ధర్మరాజా! నన్ను, నీ తమ్ముళ్ళనూ చూచావా’’ అని ద్రోణుడు మరలా అడుగగా ‘‘పుణ్యాత్మా! చెట్టుమీదనున్న ఆ పక్షితోపాటు అన్నిటినీ చూస్తున్నాను’’ అని అంటాడు ధర్మరాజు.
ఆ మాటలు విన్న ద్రోణాచార్యుడు ‘‘నీ దృష్టి చెదిరింది. నీవు దానిని కొట్టలేవు ప్రక్కకు తప్పుకొమ్ము’’ అని నిందిస్తాడు.
అదేవిదంగా దుర్యోధనుడిని, అతడి తరువాత అతడి తమ్ములను, భీమసేన నకుల సహదేవులను, వివిధ దేశాలనుండి వచ్చిన రాకుమారులను అడుగగా వారంతా ధర్మరాజిచ్చిన సమాధానే్న ఇస్తారు. ద్రోణుడు అందరినీ నిందించి అర్జునుడిని పిలిచి వాళ్ళను అడిగినట్లే అడుగుతాడు. ఆ మాటలకు అర్జునుడు ‘‘పక్షితలను చక్కగా చూచాను, ఇంకేదీ నాకు కనిపించటంలేదు’’ అని అనగా ద్రోణుడు ‘‘దానిని గురిచూచి కొట్టుము’’ అని ఆజ్ఞాపిస్తాడు. గురువాజ్ఞతో బాణాన్ని గురిబెట్టి వదులుతాడు. వెంటనే ఆ పక్షి తల తెగి చెట్టుకొమ్మనుండి నేలమీద పడింది. అది చూచిన ద్రోణుడు అర్జునుడి నిశ్చల దృష్టికి, గురిచూచి కొట్టే సామర్థ్యానికి మెచ్చి అతడికి విలువిద్యా రహస్యాలన్నింటినీ ఉపదేశిస్తాడు.
మరొకనాడు ద్రోణుడు రాకుమారులందరితో కలిసి గంగాస్నానానికి వెళతాడు. ఎంతో నిష్ఠతో స్నానం చేస్తుండగా, నీళ్ళలోని ఒక మొసలి కంకటికి కనపడకుండా భయంకరంగా వచ్చి శిష్యులందరూ చెదిరేటట్లుగా ద్రోణుడి పిక్కను పట్టుకొంటుంది. ద్రోణుడు దానిబారినుండి తనను తాను రక్షించుకొనే శక్తి ఉన్నప్పటికీ, ధనుర్బాణాలను చేత ధరించియున్న రాకుమారులను ఆలస్యం లేకుండా దాని బారి నుండి తనను విడిపించమని అంటాడు. రాకుమారులందరూ మొసలిబారినుండి గురువురు విడిపించటం చేతగాక దిక్కుతెలియని స్థితిలో నుండగా వెంటనే అర్జునుడు నీటిలో కనిపించకుండా ఉన్న ఆ భయంకరమైన మొసలిని ఐదు బాణాలతో కొట్టి గురువుగారి పిక్కను విడిపిస్తాడు. ఆ మొసలి శరీరం చీలి మరణిస్తుంది. అందుకు మెచ్చిన ద్రోణుడు ద్రుపదుడిని ఓడించగల సమర్థుడని అర్జునుడికి దివ్యమైన బాణాలను ప్రసాదిస్తాడు.
5
కురు కుమారులందరూ ద్రోణుడి శిక్షణలో అస్తవ్రిద్యలు నేర్చుకుంటారు.
ఒకనాడు కౌరవ పాండవులంతా ద్రోణాచార్యుడి పిలుపుమేరకు అతడి ఎదుటికి వచ్చారు. గురువుగారి చరణాలను సృజించి వారి వారి స్థానాలలో నిలబడ్డారు. అప్పుడు ద్రోణాచార్యుడు శిష్యులతో...
‘శిష్యులారా! మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి’’ అని అనగా శిష్యులందరూ...
‘‘గురువర్యా! మీకేది యిష్టమో సెలవీయండి!’’ అని అన్నారు.
‘‘అత్యధిక సంపద చేత గర్వించి వివేకాన్ని కోల్పోయిన ద్రుపద మహారాజును ఓడించి పట్టి తీసుకొనిరండి. ఇది నాకు ఇష్టమైన గురుదక్షిణ’’ అని ఆజ్ఞాపించినట్లు అన్నాడు ద్రోణాచార్యుడు.
గురువుగారి ఆజ్ఞను శిరసావహించి కౌరవులందరూ పూనుకొని తమ తమ రథాలెక్కి దిక్కులు పిక్కటిల్లేటట్లుగా సింహనాదాలు చేస్తూ ధనుర్భాణాలను, ఖడ్గాలనూ చేతబూని..
‘‘ఈ పనికి ఆలస్యం చేయడమెందుకు? ఈ క్షణమే వెళ్లి ద్రుపదుడిని పట్టి తెద్దాము. ఇది మనందరికినీ అధిక శౌర్య విలాసాన్ని ప్రదర్శించదగిన సమయము’’ అని అసంఖ్యాక సైన్యంతో బయలుదేరి వెళ్లారు.
పాండవులు కూడా రథాలనెక్కి గురువైన ద్రోణాచార్యుడిని తమ మధ్య నిడుకొని తామందరూ గుమికూడి రక్షించుకుంటూ ఆ కౌరవుల వెనుక బయలుదేరి వెళ్ళారు. అలా వెళుతున్న సమయంలో అర్జునుడు గురువైన ద్రోణాచార్యుడితో...
‘‘కౌరవులందరూ వేగంగా ఒకరినొకరు మీరి వెళుచున్నారు. వారికి భుజబలంలో ద్రుపదరాజుతో యుద్ధం చేయడం సాధ్యమా? ఏమరుపాటున బలహీనులచేత పట్టువడటానికి ద్రుపదుడంత తక్కువవాడ? ఇతడు గొప్ప శౌర్యవంతుడనీ, ధనుర్విద్యా సంపన్నుడనీ, పైపెచ్చు మీ స్నేహితుడని వినలేదా? తెలియదా?’’ అని అంటాడు. ద్రోణాచార్యుడు మాత్రం సమాధానమివ్వకుండా వౌనం వహించి ఉంటాడు. శిష్యుల శక్తి సామర్థ్యాలు తెలియనివాడు కాదు. అందునా అర్జునుడి శక్తిమీద ఎనలేని నమ్మకమున్నవాడు. అంతేకాదు పరీక్షకు ముందే సమాధానాలు చెబితే ఎలా? ప్రియశిష్యుని యుద్ధ నైపుణ్యానికిది ప్రథమ పరీక్ష. ఆ శిష్యుడే అన్నీ ఆలోచించుకోవాలి. అంచనా వేసుకోవాలి. ఉయద్ధం చేయాలి. విజయం సాధించాలి. గురుదక్షిణ ఇవ్వాలి.
- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము