భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం 87

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏం చేయాలా అని ఎవరికి తోచినట్టు వారు ఆలోచిస్తున్నారు.
‘ఓ గాలి వానా! కాస్త ఆగు. కురిసింది చాలు. బిడ్డలు అల్లాడి పోతారు. ఇక ఆగు చాలు చాలు ’అన్నారు.
అందరూ విస్తుబోయి చూస్తున్నారు.
అంతే వెంటనే అంత పెద్ద వర్షమూ మెల్ల మెల్లగా తగ్గిపోయింది. గాలి కూడా తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
బాబా శక్తిని తలుచుకుంటూ ఎవరికి వారు మనసులో బాబాకు జోహార్లు అందించారు. బాబా భజనను ఎల్లవేళలా మరవకూడదని అందరూ నిశ్చయించుకున్నారు.
***
దాసుగణు మారుతి ఆలయంలో రామాయణ ప్రవచనం చేస్తున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు.
యుద్ధం ముగిసింది. శ్రీరాముడు రావణాసురుని సంహరించివేశాడు. సీతమ్మ తల్లిని విభీషణుడు రాముల వారి దగ్గరకు తీసుకొని వచ్చాడు. రాముడు ఆ తల్లి తన కిష్టమున్నచోటికి యథేచ్చగా వెళ్లవచ్చునని చెప్పాడు. ఆ రాముని మాటలకు తల్లి ఎంతగానో బాధపడింది. కాని ఆమె లక్ష్మణుని పిలిచి తనకు చితిని పేర్చమని చెప్పింది. ఆ లక్ష్మణుడు ఆ మాటలు విని ఎంతో కుంగిపోయాడు. కన్నీళ్లు కారుస్తూనే లక్ష్మణుడు చితిని పేర్చాడు. ఆ తల్లి ఆ చితికి ముమ్మారు ప్రదక్షణలు చేసింది. ‘‘ నా మనస్సు ఒక్కక్షణమైన శ్రీరామ ధ్యానాన్ని మరవకున్నట్లయితే ఆ అగ్ని దేవుడు నన్ను రక్షించుగాక’’అంటూ ఆ సీతమ్మతల్లి అగ్ని ప్రవేశం చేసింది. అందరూ ఉత్కంఠతో చూస్తున్నారు. మరునిముషంలో అగ్ని దేవుడు సీతమ్మతల్లితో ఆ చితినుంచి బయటకు వచ్చాడు. ఆ తల్లి కాస్తయినా కసి కందలేదు. ఆ తల్లిని పవిత్రత గురించి అగ్నిదేవుడు శ్రీరామునికి వివరించాడు. ఆ తల్లి అనుక్షణమూ శ్రీరామధ్యానం తప్ప మరేది ఎరుగని పరమ పతివ్రత అని చెప్పాడు. బ్రహ్మాది దేవతలంతా దివి నుంచి దిగి వచ్చారు. అందరూ శ్రీరామునికి సీతమ్మ తల్లి పాతివ్రత్యాన్ని గురించి తెల్పారు. ఆ తల్లిని దరిచేర్చుకోమని శ్రీరాముడు సాక్షాత్తు మహావిష్ణువని కీర్తించారు. ఆ తల్లిని మహాలక్ష్మీగా చెప్పారు. వారందరి మాటలు విని రాముడు‘‘ నేను కేవలం మానవ మాత్రుడిని దశరథుని కుమారుడిని . మీరంతా దేవతలు కనుక మీ మాటను నేను సర్వదా శిరసావహిస్తాను ’’అన్నాడు. ఆకాశం నుంచి సీతారాములపైన పుష్పవృష్టి కురిసింది. అందరూ ఆనందించారు. తల్లి సీతమ్మ శ్రీరాముని చెంతకు చేరింది. శ్రీరాముడు చిరునవ్వుతో సీతమ్మ తల్లిని తన దరి చేర్చుకున్నాడు. అందరూ కలసి జై శ్రీరామ జై శ్రీరామ అంటూ నినాదాలు చేశారు. అని దాసుగణు రామాయణ ప్రవచనం పూర్తి చేశారు. ‘‘దాసుగణూ ఈ రోజు పొద్దు న నుంచి బాబా వంట చేస్తున్నారు. మనలందరినీ భోజనానికి రమ్మని బాబా పిలుస్తున్నారు ’అని నానా చెప్పాడు. అందరూ జై శ్రీరామ్ అంటూ లేచారు. వారంతా కలసి బాబా దగ్గరకు వెళ్లారు.
అప్పటికే అందరూ బారులు తీరి కూర్చుని ఉన్నారు. బాబా అందరికీ వడ్డిస్తున్నారు. అందరూ అమృతంలాగా తింటున్నారు.
‘‘ఇంతమందికి బాబా ఎక్కడ వంట చేయించారు ’’అని దాసుగణు అక్కడున్న స్ర్తిలను అడిగాడు.
వారు ‘‘లేదులేదు బాబా ఎవరి చేత వంట చేయించలేదు. అందరికీ ఆయనే వంట చేసారు. ఇదిగో ఈ పొయ్యిమీద ’’అంటూ వారంతా పొద్దున నుంచి జరిగిన విశేషాలను దాసుగణుకు చెప్పారు.

బాబా పొద్దున గాడి పొయ్యి తవ్వించారు. అందులో కట్టెలు వేసి నిప్పు చేశారు. దానిపైన పెద్ద పాత్రను పెట్టారు. అందులో రకరకాల కూరగాయలు వేశారు. పప్పును, బియ్యాన్ని వేసి కట్టెల మంటను పెద్దగా చేశారు.
అపుడే మేమంతా బాబా ఏం చేస్తున్నారా అని చూడడానికి వచ్చాము. బాబా ఇలా చేస్తున్నారని లక్ష్మీబాయి చెప్పింది. వెంటనే మేమంతా ఇక్కడకు చేరుకున్నాం. అప్పట్నుంచి ఇక్కడే ఉన్నాం అని వారంతా చెప్పారు.అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743