భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం 89

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబా వౌనంగా కోపంగా ఆ శ్యామా స్నేహితుని వంకే చూస్తున్నాడు.
‘నా మాట వినకుండా ఒక్క అడుగు వేసినా నేను నిన్ను నాశనం చేస్తాను’’అనిమరింత గట్టిగా అరిచారు బాబా.
శ్యామా మ్రాన్పడిపోయారు. బాబా ఏమి చేస్తున్నారో అక్కడివారికి కూడా అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాక ‘‘బాబా మాకు నీవే దిక్కు. అతడు చాలా బాధల్లో ఉన్నాడు. పాము విషం అతనికి లోపల వ్యాపిస్తుందని డాక్టర్లు చెప్పారట. ఆయనకు ఏం చేయాలో అర్థం కాక ఎంతో బాధపడుతుంటే నేనే మీ పేరు చెప్పి ఇక్కడకు తీసుకొని వచ్చాను మీరు కాపాడకపోతే ఏమైపోతాడు. కాస్త ఆలోచించండి ’’ అన్నాడు బాబా.
బాబా మరింత ఉగ్రులై ‘‘నేను చెప్పేది నీకే ఇంకా పైకి ఎక్కావో’’ అన్నారు. అంతలో ఆ శ్యామా స్నేహితుడు వెనుతిరిగాడు.
‘‘ఓ కృష్ణా! రావయ్య అక్కడి దాకా వచ్చి వెళ్లిపోతావేం. నా దగ్గరకు కదా నీ స్నేహితుడు తీసుకొచ్చాడు. మరి దగ్గరగా రాకుండా వెళ్లిపోతున్నావే. రావయ్యరారా... ఓ శ్యామా అతడు భయపడినట్లు ఉన్నాడు. నేను వెళ్లమంది నీ స్నేహితుడు కృష్ణుడిని కాదయ్యా అతని రక్తంలో ఎక్కుతున్న విషాన్ని బయటకు పొమ్మని చెబుతున్నాను. అంతే ఆయన్ను పాము ఏమీ చేయదు. ఏం ఫర్వాలేదు ఆయన శరీరికారోగ్యానికి కాని భగవంతునిపైన నమ్మకాన్ని పెంచుకోమను. భగవంతునిపై ఉన్న అతని భక్తే అతడిని కాపడుతుంది. ఆయన శరీరంలోని విషం దూరమైంది. ఇక నా దగ్గరకు ఆయనే వస్తాడే. ఎవరైనా సరే నన్ను నమ్ముకున్నవాళ్లను నేను రక్షిస్తాడు.’’అన్నాడు బాబా
మరొక సారి శిరిడీ నివాసికి క్షయరోగం వచ్చింది. పైగా ఆమె పెద్దవయస్సులో ఉంది. ఎందరినో డాక్టర్లను కలిసి మందులు తీసుకొంది. కాని క్షయరోగం తగ్గలేదు. చివరకు ‘‘బాబా నాకు నీవే దిక్కు ’’అని బాబా దగ్గరకు వచ్చింది. బాబా ఆమెను చూసి ఈ పాతచొక్కా వదిలేస్తే ఇంకొక కొత్త చొక్కా వస్తుందిగదా. దీనికి బాధపడడం ఎందుకు చేసుకొన్నాం కనుక అనుభవించాల్సిందే అన్నాడు బాబా .
ఆమె ఏమీ మాట్లాడలేదు. ‘‘నేను నిన్ను శరణు వేడాను. ఇక నేను ఏ డాక్టరు దగ్గరకు వెళ్లను అంతా నీ దేభారం ’’అంది.
‘‘అయితే నేల మీద దుప్పటి పరిచి దానిమీద పడుకో. ప్రతిరోజు చల్లని నీరు తాగు. ఆహారపదార్థాలను వదిలేయి. అంతా భగవంతుడు చూసుకొంటాడు’’అని చెప్పారు బాబా.
ఆమె ఇంటికి వచ్చి బాబా చెప్పినట్లే చేసింది. కాని వారం రోజుల తరువాత ఒకరోజు పొద్దునే్న ఆమె చనిపోయిందని వారి ఇంటివారు ఆమెను బయట పెట్టారు. ఆ వూరి వారంతా బాబా ను నమ్ముకొంది. వారం నుంచి ఆహారమేమీ తీసుకోలేదు. నీరసంతో చనిపోయి ఉంటుంది అని గుసగుసలాడడం మొదలు పెట్టారు. ఆ రోజు ఎందుకో కాని బాబా అసలు బయటకే రాలేదు. ఎవరితోను మాట్లాడలేదు. అసలు కూర్చున్న చోటు నుంచి కదలలేదు. బాగా ఎండ వచ్చేసింది. ఇక ఆమె బంధువులు ఆమెను ఖననం చేయాలనుకొన్నారు. దానికోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అంతలో ఆమె ఉన్నట్టు ఉండి లేచి కూర్చుంది. అందరూ ఆశ్చర్యపోయారు.
ఆమె ఇలా చెప్పింది. ‘‘నన్ను ఎవరో నల్లని మనుష్యులు రమ్మని పిలిచారు. నేను వారి వెంట బయలుదేరి వెళ్తున్నాను. అంతలో తెల్లటి దుస్తులతో బాబా వచ్చారు. ఆ నల్లని మనుష్యులు వెంటనే భయపడిపోయారు. చేతులెత్తి బాబాకు నమస్కరించారు. వెంటనే నన్ను తీసుకొని వెనక్కు వచ్చేశారు ’’అంతే మీరేమిటి ఏం చేస్తున్నారు అని ఆమె కోసం చేయబోయే ఏర్పాట్లు ను చూసి ఆమె నవ్వుకొంది. ‘‘బాబాను నమ్ముకుంటే చాలు ’’అని అనుకొంటూ బాబా దర్శనం చేసుకోవాలని మసీదుకు వచ్చింది. బాబా ఆమెను చూస్తూనే ‘‘అంతా బాగే కదా. ’’అన్నారు.
‘బాబా మీరు ఉండగా బాగలేనిది ఏముంటుంది. అంతా మీదయనే’అని దణ్ణం పెట్టింది. అప్పటిదాకా ఆమెను పీడించిన క్షయరోగం దూరమైంది. ఆమె ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంది. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743