భక్తి కథలు

శ్రీ సాయ లీలామృతం 91

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తూనే ‘బాబా నాపై నన్ను గిట్టనివారు మంత్రప్రయోగం చేశారు ఇపుడు బాగుంటాను. మరికొద్ది సేపటికీ పిచ్చివానిగా మారిపోతుంటాను. అందరూ నన్ను అసహ్యించుకొంటున్నారు. నేను ఎంతో మంది వైద్యుల దగ్గరకు వెళ్లాను. ఎంతో భూతవైద్యుల దగ్గరకు కూడా వెళ్లాను. కాని ఎవరూ నన్ను బాగచేయలేదు’’అన్నాడు.
బాబా నెమ్మది గా ఇటు రా చే సైగ చేశారు. అతడు వచ్చి బాబా దగ్గరగా కూర్చున్నాడు.
‘‘చూడు అనుమానం అనేది పెద్ద జబ్బు. ఇది అందరిలోను కొద్దిగానో గొప్పగానో ఉంటుంది. కాని పరిస్థితులను విశే్లషణగా చూసినపుడు మనం ఎవరికీ చెడు చేయకుండా ఉన్నప్పుడు, అంతా భగవంతుని దే భారం అనుకొన్నప్పుడు ఈ భయాలు, అనుమానాలు కలగడం మానేవేస్తాయి. నీవు పిచ్చి వాడివి కాదు. నీలో మంచి ఆలోచనా జ్ఞానముంది. నీవు ఇతరులకు ఎంతో సాయం చేస్తావు. అట్లా సాయం చేసే నీకు ఎవరూ మంత్రప్రయోగం చేయరు. అట్లా చేస్తే నేను చూస్తూ ఊరుకొంటానా చెప్పు. నిన్ను నేను అనుక్షణమూ కాపాడుతుంటాను’’ ఇక్కడే నాలుగు రోజులు ఉండు. ఈ మహిల్సాపతి ఇంట్లో నాలుగు రోజులు ఉండు. ఇతనితో పాటు తిరుగు అపుడు చూడు నీ ఆరోగ్యం గురించి ఆ తరువాత మనం మాట్లాడుకుందాం ఏమి సరేనా?’’ అని అడిగారు బాబా.
‘సరే బాబా మీరు చెప్పినట్లే నాలుగు రోజులు ఉంటాను. మీరు వెళ్లు అనేదాక వెళ్లను ’అని చెప్పాడు.
అతడు రెండురోజులకే నాకు అంతా బాగుంది బాబా అనుగ్రహం దొరికింది అందుకే అంతా బాగుంది అని చెప్పేవాడు. నలుగురి సాయం చేస్తూ తాను కూడా బాబా భజనలు చేస్తూ ఉండిపోయాడు.
అట్లానే చాలామంది కి బాబా అనారోగ్యాలను దూరం చేసేవాడు. కొందరికీ ఊది ప్రసాదం ఇచ్చేవారు. మరికొందరికి చేతిలో ఉన్న పండునో, ఫలమో ఇచ్చేవారు. ఫలానా మందు అని మాత్రం ఎపుడూ ఇవ్వలేదు. కాని బాబా దగ్గరకు ఏ సమస్యతో వచ్చినా అది దూరమయ్యేది. వచ్చినవారు ఎంతో సంతోషంతో ఉండేవారు.
మరోసారి భీమాజీ పాటిల్ అనే ఆయనకు క్షయరోగం వచ్చింది. అతనికి బాగా రక్తపు వాంతులు అయ్యేవి. వైద్యులు ఆయన్ను పరీక్షించి ఇక ఈ జబ్బు తగ్గదు ఆశ వదిలేసుకోమని చెప్పారు. ఎన్నాళ్ళు బతికే అదే ఎక్కువ అనుకోమని చెప్పేశారు. పాపం భీమాజీపాటిల్ భార్య సీతమ్మకు ఎంతో బాధ వేసింది. అందరి దేవుళ్లకు మొక్కుకుంది. రోజు ఖణ్ణిల్లున దగ్గుతున్న భర్తను చూసి మరింత ఆవేదన చెందేది. ఒకరోజు ఆమె స్నేహితురాలు శిరిడీ గురించి బాబా గురించి చెప్పింది. వెంటనే బాబా కోసం ముడుపు కట్టి బాబా నీవుమమ్ములను రక్షించాలి అని మొక్కుకుంది. ఆ రోజు రాత్రి ఆమెకు కలలో బాబా కనిపించారు. అతడిని ఆమె కలలోనే మొక్కుకుంది. బాబా మరేంఫర్లేదు. మీ రు నా దర్శనానికి రండి అని కల వచ్చింది. వెంటనే ఆమె మధ్యరాత్రిలో మేల్కొని తన కల గురంచి చెప్పింది.
వెంటనే భర్త సహకారంతో శిరీడి ప్రయాణం ఆ దంపతులిద్దరూ చేశారు. శిరిడీలో దిగిన వెంటనే భీమాజీపాటిల్ దగ్గు తగ్గినట్టుగా అనిపింది. ఆమెకూడా దాన్ని గ్రహించింది. మనసులోనే బాబాకు నమస్కరించి బాబా దర్శనం చేసుకొంది. తన బాధలను బాబాతో చెప్పింది.ఆయన వారికి అభయం ఇచ్చారు.
ఆ తరువాత ప్రతిరోజు స్నానం చేసి బాబాదగ్గరకువచ్చేది . అక్కడి వారితో కలసిమెలసి తిరుగుతూ ఉండేది. వారిద్దరూ అక్కడే స్థిర నివాసం మేర్పర్చుకొన్నారు. కొద్దిరోజుల్లో నే బాబా ఏమీ మందులు,మాకులు చెప్పకముందే క్రమంగా భీమాజీపాటిల్‌కు రక్తపు వాంతులు తగ్గపోయాయి. ఒకరోజు ఆ దంపతులిద్దరూ వచ్చి
‘బాబా మీరే మమ్మల్ని కరుణించారు’అని నమస్కారం చేశారు.
‘బాబా ఎన్నో ఏళ్లనుంచి నేను ఈ వాంతులతో సతమతమవుతున్నాను. ఎన్నో మందులు మింగాను నా పూర్వజన్మ పాపంవల్ల ఈ జబ్బు వచ్చిందేమో అని అనుకొన్నాను.కాని మీ దర్శనంతోనే ఈ జబ్బు తగ్గుముఖం పట్టింది. నా పూర్వజన్మ పాపాన్ని కూడా మీరే దూరం చేశారు. మీ వల్లనే నా ఆరోగ్యం బాగయ్యింది ’ అని పదేపదే నమస్కరించాడు భీమాజీపాటిల్.

-ఇంకా ఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743