భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లపాటి సురేంద్ర - విశాఖపట్టణం
ప్ర:సినీ రంగంలో రచయితగా కావాలనుకున్నాను. ఫలించలేదు. ఎం.ఏ తెలుగు చేసి పి.జి చేద్దామనుకుంటున్నాను. ఫలిస్తుందా?
సమా: ‘్ఫలిస్తేనే ప్రయత్నం చేస్తాను..’ అనే దృక్పథం మంచిది కాదు. జీవితంలో ఏ రంగమైనా వడ్డించిన విస్తరి కాదు. ప్రతిభతోపాటు చొరవ - లక్ష్యం పట్ల ఏకాగ్రత- ఎదురుదెబ్బలను సహించగలిగే ఓర్పు ఉండాలి. గట్టిగా ప్రయత్నిస్తే లక్ష్యం సిద్ధిస్తుంది.

ఆదిత్య, నల్లకుంట (హైదరాబాద్)
ప్ర:మా మనుమని విద్యాభివృద్ధి కావాలి- మొండితనం పోవాలి- ప్రస్తుతం కర్నాటకలో ఉన్నాడు. ఏం చేయమంటారు?
సమా: కర్నాటకలో మూకాంబికా క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఆ దేవిని పూజించి మూడు రోజులు మీ మనుమని చేత ఆ క్షేత్రంలో నిద్రలు చేయించండి. మంచి మార్పు వస్తుంది.

జి.గిరిధర్, గడ్డి అన్నారం (హైదరాబాద్)
ప్ర:కొత్త బిల్డింగ్ రెండు సంవత్సరాలైనా ఎవ్వరూ అద్దెకు రావడంలేదు. పరిష్కారం చెప్పండి.
సమా: వాస్తును పరిశీలించనిదే ఏమీ చెప్పలేను.

బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం
ప్ర: మాది భక్తి కుటుంబం- శ్రీ వేంకటేశ్వరస్వామి, తిరుపతి తిరుమలలో భక్తి సంగీత కార్యక్రమం ఆహ్వానంపైన సంగీత కార్యక్రమం నిర్వహించాను. మా భార్యాభర్తల ఏకైక లక్ష్యం మా స్వగ్రామం చిలకలపూడిలోనే పరమపదం చేరుకోవాలని కోరిక- లక్ష్యం నెరవేరుతుందా?
సమా: మీ కోరిక పవిత్రమైనది ధర్మసమ్మతమైనదే. అయితే కొడుకులవద్ద, కూతుళ్ల వద్ద ఉంటూ వస్తున్నారు. అందరూ ప్రేమగా చూసుకుంటున్నారు అంటున్నారు. మరి భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలతోబాటు జ్ఞాన వైరాగ్యాలు కూడా కలగాలి. అవి కలిగాయా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. కలియుగ దైవం వేంకటేశ్వరుడు తప్పక మీ కోరిక తీరుస్తాడు.

భాస్కరరావు, కొమ్మర (ప.గో)
ప్ర: మీరు చెప్పినట్లుగా ఇల్లు నిర్మాణం మొదలైంది. బాగానే సాగుంతోంది. అయితే పొలం అమ్మకం కావటం లేదు. ఋణబాధలు తీరాలి.
సమా: ఒక పెద్ద పనికి పూనుకున్నపుడు ఋణ భారం సహజం. ఋణాన్ని బాధగా కాకుండా బాధ్యతగా భావించండి. అదే తీరుతుంది. పొలం విషయంలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం కనబడుతోంది. ఆలస్యంగా అమ్మకం అవుతుంది.

జి.విజయలక్ష్మి, కర్నూలు
ప్ర:స్వంత ఇంటి కల నెరవేరేనా?
సమా: 2017లో మీరున్న దిశ నుండి ఉత్తర దిశలో కాని పశ్చిమ దిశలో కాని మంచి నీటి వసతి గల గృహం లభిస్తుంది.

దూళ్ళ నాగమణి, పలివెల (తూ.గో)
ప్ర:కుమారుని ప్రవర్తన, ఇంటి పట్టున ఉండడం, ఆగ్నేయంలో బావి, వాస్తు దోషమా?
సమా: ఆగ్నేయంలో బావి స్ర్తిలకు మంచిది కాదు. సంతానం ఇంటిపట్టున ఉండటం లేదంటే ఈశాన్యంలోనో వాయవ్యంలోనో వాస్తు దోషం ఉండాలి. స్థానిక పండితులను సంప్రదించండి.

నైషధం అమరనాధ్, పూనె (ముంబాయి)
ప్ర: ఇద్దరు కుమార్తెల వివాహం చింత-
సమా: ‘బంగారంతో’ సౌభాగ్య లలితా యంత్ర రక్షా డాలర్ ధరింపజేయండి. వివాహం జరగటమే కాకుండా మాంగల్యానికి కూడా రక్షగా వుంటుంది.
కాళ్ళకూరు విశాలాక్షి - రాజమండ్రి (తూ.గో)
ప్ర:ఆర్థిక సమస్యలు, భర్త తాగుడుకు బానిస, సంసారంలో గొడవలు.
సమా: సశాస్ర్తియంగా, సరియైన సంకల్పంలో శ్రీ వేంకటేశ్వర శనివార వ్రతం చేయండి. శుభం కలుగుతుంది.

బుచ్చిరాజు, దెందులూరు (ప.గో)
ప్ర:నాది లాడ్జి వ్యాపారం. ఆదాయం బాగానే ఉంటుంది కాని వచ్చిన లాభాన్ని స్థిరాస్తులు కొనుగోలు చేసి బాధపడుతూ ఉంటాను. ఏం చేయాలి.
సమా: స్థిరాస్తులు కొనటం మంచిదే కాని స్వయం నియంత్రణ- వ్యయం నియంత్రణ ఉండాలి. ఒకదాని లాభాన్ని మరొకదానికి ఖర్చుపెట్టటం మిస్ అప్రాప్రియేషన్ అంటారు. అది తగ్గించుకోండి.

ఎస్.బాలసుబ్రహ్మణ్యం, కోడికొండ, అనంతపురం
ప్ర: వివాహ ప్రశ్న
సమా: శని దోషం ఉంది. నివారణ చేసుకోండి. 2016 చివరి భాగంలో పడమటి దిశ నుండి సంబంధం రాగలదు. అయితే ఒకటి రెండు కుదిరి తప్పిపోయే అవకాశం వుంది.

పేరు :
చిరునామా : ...................................................... ......................................................
.....................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
..............................................................
ప్రశ్న : .............................................................
........................................................
సంతకం :

కూపన్ల ద్వారా మాత్రమే ప్రశ్నలు పంపాలి.
పోస్ట్‌కార్డ్‌లపై, కవర్ల ద్వారా పంపిన
ప్రశ్నలు పరిశీలించబడవు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు,
శ్రద్ధాబాద్ (సైదాబాద్), హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ