భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనమాలా గోపాలకృష్ణమాచార్యులు, కోదండరాంనగర్, హైదరాబాద్
ప్ర: మంత్రోపదేశం గురుముఖతః మాత్రమే పొందాలని బహిరంగంగా కాదని బహిరంగపరచరాదని చెప్పారు. మరి శ్రీమాన్ రామానుజాచార్యులవారు నారాయణాష్టాక్షరిని రంగనాథస్వామి గిరిశిఖరం మీద నుండి అశేష భక్తజనులకు ఉపదేశించారు కదా!
సమా: మీ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలున్నాయి. ఒకటి ఆత్మశక్తి సంపన్నులైన మహాత్ములు చేసే పనులను సామాన్య సందర్భాలకు అన్వయించి పోల్చకూడదు. రెండవ అంశం రంగనాథస్వామి గిరిశిఖరం పరమ పవిత్రమైన స్థానం. ఆ స్థానం నుండి భక్తులనుద్దేశించి ఉపదేశించాడా మహాత్ముడు. ఆ అసాధారణ సంఘటనను ప్రసార సాధనాల చెప్పేవారి మాటలతో పోల్చకూడదు. గమనించండి.
వై.రేణుక, (తూ.గో.)
ప్ర: మనసులోని కోరిక
సమా: మీరు కోరిన విధంగా జరిగే అవకాశాలు కనిపించటం లేదు. ఎక్కువగా ఆసక్తి పెంచుకోకపోతేనే మంచిది.
పేరూరు భీష్మాచారి, నల్లగొండ (తెలంగాణా)
ప్ర: కోరికలను పూర్తిచేయటం కోసం భగవంతుని పూజించటం ప్రార్థించటం తప్పు కాదా?
సమా: ఏ మాత్రం తప్పుకాదు. చతుర్విధైః భజంతేమాం యేజనాః సుకృతినోర్జున ఆర్తో, జిజ్ఞాసుః అర్థార్థి- జ్ఞానీచ భరతర్షభా- అని భగవద్గీతచార్యుడే ప్రబోధించాడు. ఆపత్తులోనున్నవాడు- కోరికలు కోరేవాడు- జిజ్ఞాసువు- జ్ఞాని వీరంతా నాలుగు విధాల భక్తులు అని చెప్పాడు, గమనించండి.
జి.వి.సాంబశివాచారి, నరసరావుపేట, గుంటూరు
ప్ర: ప్రస్తుతం నేను చేస్తున్న వ్యాపారం ఎలా వుంటుంది?
సమా: బాగానే వుంటుంది. ఆటంకాలకు అధైర్యపడకుండా శ్రద్ధతో ముందుకు సాగండి!
ఎం.ఎర్రన్న, బిచుకుంద, నిజామాబాద్
ప్ర: నా టెంపరరీ ఉద్యోగం పర్మినెంట్ ఎప్పుడు అవుతుంది?
సమా: ఆగస్టు-సెప్టెంబర్‌లలో కొన్ని శుభాలు జరిగే అవకాశం వుంది. మీ ప్రశ్న కేవలం మీకు మాత్రమే కాక సామూహికమైనది. కనుక మీ వరకు కొన్ని శుభాలు జరుగుతాయి.
భాస్కర్ల శర్మిష్ట, సైనికపురి, సికింద్రాబాద్
ప్ర: దంత వైద్య పట్టా పొందాను. ప్రభుత్వోద్యోగం వస్తుందా?
సమా: పూర్తి అవకాశాలున్నాయి. తప్పక ప్రయత్నించండి. త్వరలోనే జరగవచ్చు.
తన్నీరు కళ్యాణి, చీరాల (ప్రకాశం)
ప్ర: నా భవిష్యత్తు ఎలా ఉండగలదు. నిర్మొహమాటంగా వివరించండి.
సమా: నిర్మొహమాటంగా చెప్పాలంటే మీరు చేసే పనుల్లో క్రమపద్ధతి లోపిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఆ లోపాన్ని సరిదిద్దుకోండి. ‘నశ్రే్శయోనెయమం వినా’ అన్నది పెద్దలమాట- నియమబద్ధం కానిదేదీ శుభాలనివ్వదు.
బి.బాలకృష్ణ, సూర్యచంద్రరావుపేట (ప.గో.)
ప్ర: స్థలము లేదా పొలము కొనాలనే ఆలోచన వుంది. ఎలా వుంటుంది?
సమా: మీ నిర్ణయంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా కొన్నాళ్ళ తరువాత నెరవేరే అవకాశం వుంది.
బొడ్డేపల్లి జగన్నాధరావు, తణుకు (తూ.గో.)
ప్ర: 1989 నుండి గ్రహస్థితి అనుకూలంగా లేదు. చాలా కష్టాలు పడుతున్నాను.
సమా: గ్రహస్థితి అనుకూలించకపోవటం మీ జన్మ నక్షత్రమును బట్టి చెప్పవలసి ఉంటుంది. మీరు చెప్పిన సంఖ్యను బట్టి మాత్రం ప్రతి విషయంలోనూ మీరు డోలాయమాన స్థితిని కలిగి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇతరుల సలహాలే మీ మీద బాగా ప్రభావం చేస్తున్నవి. సమీప భవిష్యత్తులో కొంత మంచి జరిగే అవకాశం ఉంది.
ఎల్.ప్రవీణ్, నగరపాలెం, గుంటూరు
ప్ర: ఉద్యోగం - వివాహం-
సమా: ముందుగా వివాహ ప్రస్తావనే వచ్చేట్టు కనిపిస్తున్నది.
శివశ్యామల, రామవరప్పాడు, విజయవాడ
ప్ర: ఆర్థిక- ఆరోగ్య- గృహ సమస్యలు
సమా: గృహసాధన- ఆరోగ్యము కొంచెం ఆలస్యంగానే ఆటంకాలే- జూలై నుండి సంతాన సంబంధంగా శుభం జరిగే అవకాశం వుంది.
బి.శ్రీనివాస్, గోదావరిఖని, కరీంనగర్
ప్ర: గత 25 సంవత్సరాలు ప్రైవేటు ఉపాధ్యాయునిగానే జీవిస్తున్నాను. మరో రంగమేదైనా యోగించే అవకాశం వుందా?
సమా: వీలయితే స్టేషనరీ సంబంధంగా ప్రభుత్వ కంట్రాక్టులకు ప్రయత్నించండి. కొంత అభివృద్ధి కనిపిస్తుంది.
కె.ఎన్.వి.శ్రీకాంత్, తెనాలి (గుంటూరు)
ప్ర: వివాహం?
సమా: 2017లో తప్పక జరుగుతుంది. తూర్పు దిశనుండి ర - ల - వ - చ అనే అక్షరాలు ప్రముఖంగా ఉంటాయి.
కోరుమూరి వాసుదేవమూర్తి, నిడదవోలు (ప.గో)
ప్ర: నేను భూగర్భ శాస్త్రం సంబంధంగా ఇంజనీర్‌ని. ప్రసుతం కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వానికి పని చేస్తున్నాను. స్థిరత్వం ఎప్పుడు వస్తుంది.
సమా: బహుశా కాంట్రాక్టు పొడిగిస్తారేమో- లేదా మరో విధంగా మీకు ఉన్నతి కలిగే అవకాశం జూలై- ఆగస్టుల్లో జరిగే అవకాశంవుంది.
ఎ.వెంకటేశ్వర్లు, వెంకటగిరి (నెల్లూరు)
ప్ర: నేను ఎస్.జి.బి.టి టీచర్‌గా పనిచేస్తున్నాను. ప్రమోషన్ ఎప్పుడు?
సమా: ఇతరులవల్ల ఆటంకాలున్నాయి. బహుశా పోటీదారులున్నారేమో - ఇంకా చాలా ఆలస్యం.
చిట్టి వెంకటప్పయ్య శాస్ర్తీ, సిద్ధాంతం (కృష్ణా)
ప్ర: రిటైర్మెంట్ తరువాత ప్రశాంతంగా ఉండటానికి ఏదైనా దైవకార్యం చెప్పండి.
సమా: ‘యాజ్ఞానాం జప యజ్ఞోస్మి’ అంటుంది భగవద్గీత. శివ పంచాక్షరీ సహస్ర సంఖ్యగా నియమం పెట్టుకోండి. ఆ తరువాత శ్రీమత్సుందరకాండ పారాయణం ప్రతిరోజూ ఒక సర్గగా పారాయణం చేయండి. వైదిక విద్యలో ప్రవేశం ఉంటే ‘నమశ్శంభవేచ’ అనే మంత్రోపాసనతో అభిషేకం చేయండి. జీవితం అద్భుతంగా వుంటుంది.
బి.ఉమారాణి, చిత్తూరు (ఆం.ప్ర.)
ప్ర: బంధువులనుండి గృహప్రాప్తి ఉందా?
సమా: వివాదం చాలాకాలం కొనసాగుతుంది. ఫలితం తక్కువే.
ఎ.దామోదరసాయి సుబ్రహ్మణ్యం, రావులపాలెం (తూ.గో.)
ప్ర: వైద్య విద్యలో సీటు వస్తుందా?
సమా: కొంత వ్యయంతో వచ్చే అవకాశం వుంది.
ఎస్.రామానుజన్ - రాజమండ్రి, (తూ.గో.)
ప్ర: ఎదుగుదల - పెరుగుదల లేని జీవితం- స్వంత ఇల్లు కాని వుందా?
సమా: ప్రస్తుతం ఉన్న సంస్థ నుండే కొంత పెరుగుదల- ఆర్థిక లాభం జరిగే అవకాశం వుంది. గృహయోగం ప్రభుత్వ సహాయంతో ఆలస్యంగా లభిస్తుంది.
ఎస్.రేవంత్, ఆర్మూర్, నిజామాబాద్
ప్ర: జీవితంలో నేను ఏ రంగంలో స్థిరపడగలను?
సమా: వ్యాపార రంగంలో కాస్మొటిక్స్‌కు సంబంధించిన ఏదైనా డీలర్‌షిప్ ప్రయత్నించండి. లేదా ప్రభుత్వ సం స్టాంపులు, స్టేషనరీ సప్లై వంటి వ్యాపారమైనా బాగానే వుంది. ఏదైనా మార్కెటింగ్ చేసేది అయివుండాలి. *

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ