భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటదారా ఫణి వాత్సల్య (సింగపూర్ దేశం), సింగపూర్
ప్ర: ఆర్థిక సమస్యలనుండి గట్టెక్కాం. కాని ఇంకా కొన్ని ఇతర సమస్యలు, దాంపత్యంలో అననుకూలత బాధిస్తున్నాయి. శ్రీమత్సుందరకాండ పారాయణం- శ్రీరామనామం చేస్తున్నాను. వేరే పరిష్కారం ఏదైనా చెప్పగలరా?
సమా: మనం చేసే దైవిక కర్మల్లో శాంతి కర్మలు, పౌష్టిక కర్మలు, సైతృక కర్మలు అని మూడు రకాలు. శ్రీమత్సుందరకాండ- శ్రీరామనామం శాంతి కర్మలుగా- మోక్ష కర్మలుగా చాలా ఉత్తమమైనవి- అయితే లౌకిక ప్రయోజనాలకోసం పౌష్టిక- కామ్యక కర్మలు చేయాలి. మీకు శ్రీరామ పరంగానే కావాలనుకుంటే సామ్రాజ్యరామం కాని- అయోధ్యారామం కాని ఉపదేశం తీసుకొని ఉపాసించండి. ఆర్థిక బాధలు మటుమాయమవుతాయి. కేవల రామతారకం మోక్షసిద్ధికి అనుష్ఠించాలి- గృహస్తు అయినవాడు. లౌకిక ప్రయోజనం ఆశించేవాడు కామ్యార్థ సిద్ధి మంత్రాలను జపించాలి.
సి.హెచ్.లక్ష్మీకుమారి, కొత్తపేట, హైదరాబాద్
ప్ర: ఆగిపోయిన పండ్ల వ్యాపారం ఎప్పుడు మొదలెట్టాలి.
సమా: శ్రావణమాసంలో ఆరంభించండి.
పి.రామకృష్ణ- రాజమండ్రి (తూ.గో.)
ప్ర: నేను నిష్కల్మషమైన వ్యక్తిని- అందుకే ఒక బిల్డర్ నన్ను మోసం చేశాడు. ఎందరికో వడ్డీ లేకుండా అప్పులిచ్చాను. మంచితనం మీద నమ్మకం పోతున్నది. ఉపాయం చెప్పండి.
సమా: నదిలో కొట్టుకుపోయేవాణ్ణి రక్షించటానికి బాగా ఈత వచ్చినవాడే ప్రయత్నించాలి. మంచితనం పేరుతో ఈత రాకపోయినా రక్షించటానికి ప్రయత్నిస్తే నీవు కూడా నదిలో కొట్టుకుపోతావు. లోకజ్ఞానంతో వ్యవహరించాలి కాని మంచితనం పేరుతో వంచకులను నమ్మి మోసపోకూడదు. అంత్యనిష్ఠూరం కంటే ఆదిలోనే నిక్కచ్చిగా ఉంటే బాగుండేది. మున్ముందైనా జాగ్రత్తపడండి. పంచతంత్రం కథలు చదవండి. దైవశక్తికోసం కార్తవీర్యార్జున నష్టద్రవ్యప్రాప్తి మంత్రం జపించండి.
ఆళ్ళ గాయత్రీ - కూకట్‌పల్లి (హై)
ప్ర:కూతురు - మా అమ్మాయి వివాహం కోసం ఏం చేయాలి?
సమా:కుంకుమార్చన- సువాసినీ పూజ ప్రతి శుక్రవారం యధాశక్తిగా లలితా సహస్రనామార్చనతో అమ్మవారికి పూజ చేయించండి. కేవలం లలితా సహస్రనామ పారాయణం మాత్రం చేయరాదు.
పి.శ్రీనివాసరావు, పాయకరావుపేట (వైజాగ్)
ప్ర:నా భార్య నుండి విడాకులు కావాలి. ఎన్నాళ్ళు పడుతుంది. అందుకు ఏం చేయాలి?
సమా:ఆ ప్రశ్న ధార్మికమైనది కాదు. జ్యోతిష శాస్త్రంలో దానికి సమాధానం దొరకదు. న్యాయశాస్త్రాన్ని, చట్టాన్ని సంప్రదించండి.
ఎం.శ్రీదేవి, బాగ్‌లింగంపల్లి (హై)
ప్ర: మనుమరాలికి విద్యాభివృద్ధి గురించి?
సమా: బాసర క్షేత్రంలో మూడు రోజులు నిద్రలు చేసి ఉదయంవేళ కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నాలుకపై (కొంచెం మాత్రమే) రాయండి.
కె.సుజాత, గుంతకల్, అనంతపురం
ప్ర: సంతాన ప్రాప్తికోసం ఏం చేయాలి.
సమా: సంతాన నాగేశ్వర ప్రతిష్ఠ చేయండి.
ఎన్.సి.ఎస్.రామానుజం, రాజమండ్రి (తూ.గో)
ప్ర: ఆర్థికంగా అభివృద్ధి కోసం ఏం చేయాలి.
సమా: ప్రతి బుధవారం వేంకటేశ్వరస్వామిని తేనెతో అద్దిన మారేడు దళాలతో అర్చించండి.
బాజిరావు, కావలి (నెల్లూరు)
ప్ర: స్వగృహయోగం వుందా?
సమా: తప్పకుండా వుంది. ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం వుంది. ప్రస్తుతం మీరున్న దిశనుండి వాయవ్య భాగం కాని ఉత్తర భాగంలో కాని.
కె.వి.ప్రసాదరావు, కందుకూరు, ప్రకాశం
ప్ర: కుటుంబ పరిస్థితులు- భూవివాద సమస్యలు పరిష్కారం కాగలవా?
సమా: భూ వివాద సమస్యలు ఆలస్యంగా కొంత నష్టంతో పరిష్కరించబడతాయి. కుటుంబ పరిస్థితులు విషయంలో స్వభావ వైరుధ్యాలు కనబడుతున్నాయి.
పి.మస్తానయ్య, వెలుగోడు (కర్నూలు)
ప్ర: ఉద్యోగ ప్రశ్న
సమా: రక్షణ శాఖలో తప్పకుండా మీకు ఉద్యోగం దొరుకుతుంది.
కె.శ్రీనివాసులు, బాగ్ అంబర్‌పేట (హై)
ప్ర:తిరిగి నేను మా స్వగ్రామంలో స్థిరపడగలనా?
సమా: హైదరాబాదే మీకు యోగం వుంది.
పి.ఉమాదేవి, అనంతపురం (ఆం.ప్ర.)
ప్ర: దాంపత్య సమస్యలు
సమా: జీవితంలో మూడు భాగాలు గడిచిన ఈ మలి వయస్సులో మార్పును ఆశించి ఆవేదన పడకండి. ‘స్వభావోమృత క్రియః’ అన్నది పెద్దల వాక్యం. ఈ వయస్సులో ఎవరి స్వభావంలోనూ మార్పు రాదు. సాధ్యమయితే దైవసేవగా గౌరీ పంచాక్షరీ మంత్రం ఉపదేశం పొందండి. ఉపాసించండి. తరించండి.
ఎమ్.మల్లికార్జునరావు, కావలి, నెల్లూరు
ప్ర:నగల షాపులో భాగస్వామ్యం యోగిస్తుందా?
సమా: ప్రారంభంలో సరిగా వున్నా మధ్య చివరి భాగాల్లో తలకుమించిన సమస్యలు వస్తాయి. బంగారానికున్న స్వభావ లక్షణమది.
జి.రామలక్ష్మి, అనంతపురం (ఆం.ప్ర.)
ప్ర: నాకు రాత్రివేళ నిద్ర రాదు. ఏం చేయాలి.
సమా: ఒక మంచి పుస్తకాన్ని చదవటం అలవాటు చేసుకోండి. నిద్ర దానంతటదే వస్తుంది.
ఏమ్.ఎల్.ఎన్.శర్మ, జమ్మలమగుడు (కడప)
ప్ర: అనారోగ్యం , పరిష్కారం చెప్పండి.
సమా: ప్రతిరోజూ ఏడు మారేడు దళాలు తేనెలో ముంచి శివలింగంపైన ఉంచండి. భస్మోదకంతో అభిషేకం చేయండి.
బి.బుచ్చిరాజు, భీమడోలు (ప.గో.)
ప్ర: మా పొలంలో నిమ్మచెట్లు పెంచాలని వుంది. నాకు యోగిస్తుందా?
సమా: పెంచండి. నష్టం కలిగించవు.
జి.అనంతయ్య, ఎన్.ఆర్.పేట (కర్నూలు)
ప్ర: నాపైన దైవానుగ్రహం ఉన్నదా?
సమా: చిత్తశుద్ధితో ఏకాగ్రతతో కులదైవాన్ని అర్చించండి. ద్యానించండి. దైవానుగ్రహం మీకే అనుభవమవుతుంది.
టి.సాయికుమార్, అంబర్‌పేట (హైదరాబాద్)
ప్ర:నాకు ఉద్యోగమా? వ్యాపారమా? ఏది అనుకూలం?
సమా: వ్యాపారమే అనుకూలం.
కె.శివకుమార్, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: దాంపత్య సమస్య
సమా: పరిష్కారానికి ఇతరుల ప్రభావం లేకుండా ఉండాలి.
**

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ