భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.బి.రంగరాజు, బల్కంపేట, హైదరాబాద్
ప్ర: శర్మగారూ! ఇటీవలి రవీంద్రభారతిలో జ్యోతిష మహాసభలో మీ ఉపన్యాసం విన్నాను. చాలా ఇంట్రస్టింగ్ జ్యోతిష శాస్త్రాన్ని వివరించారు. నాదొక సందేహం- గ్రహస్థితుల కారణంగానే మన జీవితాలు నడుస్తూ ఉన్నప్పుడు- ఈ శాంతి కార్యాలవలన నివారణ జరుగుతుందా?
సమా: మంచి ప్రశే్న వేశారు. ఒక్క విషయం ఆలోచించండి. మనం దురదృష్టవశాత్తు ఎక్కడో ఒక లోయలో జారిపడుతున్నామనుకోండి.. ఏ గడ్డిపోచనైనా పట్టుకోవటానికి ప్రయత్నిస్తామా? లేక ఇంత పెద్ద లోయలో ఈ గడ్డిపోచ మనల్ని ఏం రక్షిస్తుంది అని ఊరుకుంటామా? గ్రహస్థితుల్లో కూడా ఎక్కడో ఒకచోట చిన్న వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటు మనం చేసే శాంతి కర్మల ద్వారా ‘ఆంప్లిపై’ అయి మనల్ని కాపాడుతుంది. అందుకే శాంతి కర్మలు తప్పక చేయాలి.

జి.యాదగిరి, సిద్ధిపేట, తెలంగాణ
ప్ర: నాకు రైల్వేలో ఉద్యోగం దొరుకుతుందా?
సమా: క్లరికల్ సంబంధంగా అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక రంగంగా లేవు.
ఎల్.గోవిందరాజులు, సోమందేపల్లి, అనంతపురం
ప్ర: సొంతంగా వ్యాపారం, ఏ రంగం అనుకూలం?
సమా: ధాన్యం వ్యాపారంలో బియ్యం కాకుండా మిగతా అన్నీ యోగిస్తాయి. చేపల చెరువు- పౌల్ట్రీ- గిఫ్ట్స్ అండ్ నావెల్టీస్ కూడా బాగుంటాయి.

ఎమ్.వి.ఎస్.నాగేంద్ర ప్రసాద్, కూచిమంచి అగ్రహారం (తూ.గో.)
ప్ర: వ్యాపార నష్టం, ఋణబాధలు, కోర్టు సమస్యలకు పరిష్కారం?
సమా: సహజంగా వచ్చిన సమస్యలు కావు. చల్లగా సాగిపోయే మీ జీవితంలో ఎవరో అత్యాశ రగిలించి తప్పుదోవ పట్టించినట్టు ఉన్నారు. లేదా మీరే చాంచల్యానికి లోనయి సమస్యల్లో చిక్కుకున్నారు. నివారణగా ప్రతి మంగళవారం ‘ఋణవిమోచన పాశుపత రుద్రాభిషేకం’ నిర్వహించండి. కనీసం నాలుగు వారాలు అమలాపురం ప్రాంతం కూచి వీరభద్ర శర్మగారి సశాస్ర్తియ రుద్రాభిషేకం అనే గ్రంథంలో ఆ విధానం ఉంది.

దామర్ల శివనాగేశ్వరరావు, మంగళగిరి (గుంటూరు)
ప్ర: నేను సాంఘిక నాటక కళాకారుణ్ణి- డైరెక్టర్‌గా అప్లై చేశాను. సెలెక్ట్ కాగలనా?
సమా: రెండు మూడు ప్రయత్నాల తరువాత ఫలించే అవకాశం ఉంది. అయితే మీరు దాంట్లోనే ఉండరు. మరో జీవనోపాధిలో స్థిరపడతారు.

ఎ.గిరిధర్, కోరుట్ల, జగిత్యాల (తెలంగాణ)
ప్ర: ప్రభుత్వోద్యోగం ఎప్పుడు వస్తుంది?
సమా: మీ విద్యార్హతలు సరిపోతే డిసెంబర్ తరువాత ప్రభుత్వ మూలకంగా కొన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.

ఆలంపురం యజ్ఞనారాయణ శర్మ, కర్నూలు (ఆంధ్ర)
ప్ర: ఉంగరంలో పెట్టుకునే రత్నం నామ నక్షత్రం ప్రధానమా? జన్మనక్షత్రం ప్రధానమా?
సమా: ఒకే ఒక రత్నం ధరించటం ప్రయోజనకరం కాదు. సామ నక్షత్రం- జన్మ నక్షత్రాధిపతి- జన్మ రాశ్యాధిపతి రత్నాలు ధరించాలి. మరొక పద్ధతిగా పురుషులు తప్పకుండా కెంపును - స్ర్తిలు తప్పకుండా కనక పుష్యరాగాన్ని ధరించాలి. జతగా పురుషులు వైఢూర్యాన్ని, స్ర్తిలు పగడాన్ని ధరించాలి. అంటే త్రిరత్నాంగుళీయకం- తరువాత దానికి తగిన విధమైన సంస్కార పూజ జరిపించి పెట్టుకోవాలి.

టి.రాధాకృష్ణ, నాంపల్లి, హైదరాబాద్
ప్ర: స్వగృహయోగం
సమా: మీ జాతక రీత్యా స్వగృహ నివాస యోగ్యం లేదు. మీ భార్య పేరున కాని సంతానం పేరున కాని యోగం కలుగవచ్చు!

వి.పాండురంగారావు, విజయవాడ (కృష్ణా)
ప్ర: గురువుగారూ! మా దాంపత్య సమస్య పరిష్కారం కాదా?
సమా: మీ సమస్యలో మరొక వయస్సు మళ్లిన స్ర్తి ప్రభావం కనిపిస్తోంది. కొంత ధన ప్రమేయం- స్థిరాస్తి ప్రమేయమూ కనిపిస్తోంది. ఇరువురూ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే డిసెంబర్ తరువాత కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతరుల ప్రభావంలో పడకండి.

ఆర్.పి.ఎన్.ఆరాధ్య, విజయవాడ (కృష్ణా)
ప్ర: కెరీర్, సి.ఏగా, ఆరోగ్యం?
సమా: మీరు మీ ప్రశ్న ఇంగ్లీషులో అడిగారు. మరి మీకు తెలుగు వచ్చునో రాదో తెలియదు. మీకు కెరీర్ పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగానే ఉదరం అంటే స్టమక్- లివర్ వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. తగు చికిత్స పొందండి.

పి.బదరీ నారాయణ, సత్యనారాయణపురం, విజయవాడ
ప్ర: నా జాతకం ప్రకారం నాకు ఉద్యోగ విషయంలో రాజకీయ నాయకుల సహాయం లభించగలదా?
సమా: ఆర్-జె-ఎమ్-పి-బి అక్షరాలుగలవారు సహాయపడతారు.

వి.వి.ఆర్.మూర్తి, ఒంగోలు (ప్రకాశం)
ప్ర: వృత్తి వ్యాపారాలలో ఏది లాభిస్తుంది?
సమా: ఫీల్డ్‌వర్క్ చేసే వ్యాపారం. ముఖ్యంగా మెడికల్- కెమికల్- పెస్టిసైడ్స్ వంటివి- స్టేషనరీ- బుక్స్ వంటివి కూడా బాగానే ఉంటాయి.

కె.వి.సత్యశ్రీరామా మణి, బీరంగూడ, హైదరాబాద్
ప్ర: గురువుగారూ! నమస్కారం. మీరు చెప్పిన విధంగా మా బాబుకు ఆగస్ట్‌లో ఒక కంపెనీ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆన్‌లైన్ టెస్ట్ పెడితే అందులో పాసయ్యాడు కూడాను. మళ్లీ కబురు వస్తే ప్రయత్నించవచ్చా. బాబుకు సంతాన భాగ్యం ఎప్పుడు?
సమా: తప్పకుండా ప్రయత్నించండి. అక్టోబర్‌లో కబురు వచ్చే అవకాశం ఉంది. సంతాన విషయంలో భార్యాభర్తల జాతకాలు పరిశీలించాలి.

బి.జ్యోతి, దోమల్‌గూడా, హైదరాబాద్
ప్ర: ప్లాటు కొనుగోలు- బిల్డర్‌తో సమస్యలు
సమా: అమ్మా! మీది చట్ట సంబంధమైన సమస్య- ముందుగా బిల్డర్ అసోసియేషన్ పెద్దలతో కలవండి. అట్లా వీలుకాకపోతే వినియోగదారుల ఫోరంలో వేయండి.

బి.కౌసల్యాదేవి, నర్సారావుపేట (గుంటూరు)
ప్ర: ఋణబాధ- ఆస్తులు అమ్మకం కావటంలేదు. కుమారులు ఉద్యోగస్థులై ఉండి కూడా ఏమీ సహాయం లేదు. భర్తగారు కూడా అంతంతమాత్రమే- నాకు మనశ్శాంతి కలిగే యోగం ఉందా?
సమా: ఎదిగిన కుమారులు- భర్తగారు ఆఫీసర్- అయినా కూడా మీకు ఋణాలు ఉన్నాయంటే మీరు చాలా విషయలలో స్వతంత్రంగా వ్యవహరించి ఉంటారు. అందుకే ఎవరూ మిమ్మల్ని పట్టించుకోవటంలేదు. అంత స్వతంత్రంగా మీరు మాత్రమే తీర్చవలసిన ఋణాలు చేయటం సాహసం కాదా? ఏదో ధరకు ఆస్తులు అమ్మి ఋణవిముక్తులు కావటం ఉత్తమం- ఋణశేషమూ, శతృశేషమూ ఉండకూడదన్నారు పెద్దలు.

జి.్భనుమతి, విజయవాడ (కృష్ణా)
ప్ర: ఆరోగ్య సమస్య- విపరీతమైన తుమ్ములు- పరిష్కారం చెప్పండి.
సమా: ‘క్షుతం శిరోగం వాతం’ అంటుంది ఆయుర్వేదం. క్షుతము అంటే తుమ్ము- వాతం అంటే గాలి- శిరస్సులో చేరిన దుష్టమైన గాలి తుమ్ముల రూపంలో బయటకు వస్తుంది. ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. ఆయుర్వేదంలో మంచి మందులున్నాయి.

గోదాసు బాలయ్య, రామన్నపేట (యాదాద్రి, భువనగిరి)
ప్ర: భార్య ఆరోగ్య పరిస్థితి?
సమా: సంఖ్య ఆమెచేత చెప్పిస్తే బాగుండేది. ఆమె జన్మ నక్షత్రం కాని- జన్మ మాసమైనా తెలిపి ఉండాల్సింది. మీ నుండి ఆలోచిస్తే 2018 మధ్యభాగంలో మీ భార్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. ఆంజనేయస్వామికి ప్రతి ఆదివారం తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయించండి.

శేషాద్రి రెడ్డి, హిందూపూర్, అనంతపురం
ప్ర: నేను రాజకీయాలలో రాణించగలనా?
సమా: మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయరు. రాణించటమనే ప్రశ్న ఉత్పన్నం కాదు.

కె.గోపాలరావు, బరంపురం (ఒడిస్సా)
ప్ర: మా అబ్బాయికి మీరు భాగస్వామ్య వ్యాపారం బాగుంటుందని చెప్పినారు. ఏ రంగం?
సమా: మరో భాగస్వామి ఎవరో తెలిస్తే స్పష్టంగా చెప్పగలను.

పి.హరిప్రసాద్, మల్కాజిగిరి, హైదరాబాద్
ప్ర: కేంద్ర ప్రభుత్వంలో సెలక్షన్
సమా: మీరు చెప్పిన సర్వీసుకు సంబంధించి ప్రాసెసింగ్ ఆలస్యంగా గోచరిస్తున్నది. ఈలోగానే మీరు మరో దాంట్లో ప్రవేశిస్తారు.

పేరు :

చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ