భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లకనం సంధ్య, నాగాయలంక (కృష్ణా)
ప్ర: వివాహం యోగం?
సమా: సింహాచలంలోని శ్రీవరాహ నారసింహ స్వామికి ప్రతి మంగళవారం వడపప్పు బెల్లపు పానకం నివేదన చేసి దీపారాధన చేసి మొక్కు మొక్కండి. జాతకంలోని కుజ-శని దోషాలు నివారణమవుతాయి.
పెద్దలంక అనంతలక్ష్మి, వెంకటగిరి, నెల్లూరు
ప్ర: ఉద్యోగ విషయం చెప్పండి
సమా: మీ ఉద్యోగం విషయంలో మీరే సందిగ్ధంలో వున్నట్టున్నారు. వ్యాపారమా? ఉద్యోగమా అని. ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నిస్తే నైరుతి దిశలో మీకు ఉద్యోగ యోగం వుంది.
ఏ.కోమలకుమారి, పాయకరావుపేట (విశాఖ)
ప్ర: అనారోగ్యం? ఎప్పుడు కోలుకుంటాను?
సమా: మీ అనారోగ్యానికి కారణం కేవలం శారీరకమైనదిగా గోచరించటం లేదు. మానసికం, ఘర్షణలు కారణంగా కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యం బాగుపడుతుంది.
కె.రాజారావు, అంబాజీపేట, తూ.గో.
ప్ర: మా అబ్బాయి గృహానికి శంకుస్థాపన చేశాను. పితృతర్పణాలు అర్పించవచ్చా?
సమా: ‘అవశ్యం పితృకార్యం’ పైతృకకార్యాలు నిర్లక్ష్యం చేయరాదు. పౌరోహిత బ్రాహ్మణ గృహంలో కాని నదీ తీరంలో కాని, పుణ్యక్షేత్రంలో కాని పితృకార్యం నిర్వహించండి.
టి.ఎ సత్యనారాయణరావు, గుంతకల్, అనంతపురం
ప్ర: వివాహం? ఉద్యోగం?
సమా: వివాహానికి మీ జన్మ జాతకంలో కుజదోషమూ- దాంపత్య కారకుడైన శుక్రుడు అనుకూలంగా లేకపోవటంవలన ఆటంకాలు తప్పవు. ‘స్వయం వరకళా’ రక్షా డాలర్ ధరించి మంగళ, శుక్రవారాలు ఉపవాసం (నక్త్భోజనం) పాటించండి.
ఎల్ల రమేశ్, కరీంనగరం (తెలంగాణ)
ప్ర: నేను సాహిత్య రంగంలో స్థిరపడగలనా? ఉద్యోగంలోనా?
సమా: సాహిత్యం అనేది ప్రవృత్తి. ఉద్యోగం వృత్తి, ప్రవృత్తిరీత్యా సాహిత్య సాధన సారస్వతోపాసన చేయండి. ఉద్యోగరీత్యా విద్యుక్త ధర్మంతో లక్ష్మిని సంపాదించండి. ‘ఉద్యోగినం పురుషము సైతి లక్ష్మీ’ అన్న మాట గుర్తుంచుకోండి.
భుజంగరావు, వెంకటాపురం (ప.గో.)
ప్ర: పొలాలు, ఆస్తి కొనవచ్చునా నా పేరున?
సమా: భూములు, వ్యవసాయం యోగిస్తుంది.
కె.పిచ్చయ్య, ఖమ్మం (తెలంగాణ)
ప్ర: మా మనుమని పెళ్లి గురించి చెప్పండి?
సమా: సంఖ్య మీ మనుమడే చెప్పాలి. మీరు చెప్పిన సంఖ్య ప్రకారం మీకు సంతాన మూలకంగా మనుమల మూలకంగా శుభమే జరుగుతుంది.
పి.బదరీనారాయణ, విజయవాడ, కృష్ణా
ప్ర: వినాయకునికి సంఖ్య ఏది?
సమా: ప్రదక్షిణ సంఖ్య ఒకటి- దక్షిణ సంఖ్య నాలుగు- తమలపాకుల మాల వేయాలనుకుంటే 27 కాని 54 కాని, 108 కాని వేయండి. ఒక సందర్భంలో అన్ని దిశలూ ఆయనవేనని తల్లి పార్వతి వరప్రదానం చేసింది. అటుకులూ బెల్లం, మాదీఫలం- గరికపోచలు ఆయనకు పూజా ప్రాధాన్యం.
బి.ప్రతాప్, బరంపురం (ఒడిసా)
ప్ర: ఊరు మారితే అదృష్టం కలసి వస్తుందా?
సమా: కొన్ని యోగకారక సంఖ్యలవలెనే యోగ కారక అక్షరాలూ ఉంటాయి. మీకు ‘ర, త, క, హ’ అనే అక్షరాలు యోగకారకాలు. ‘ప, బ’ లు కొంతవరకు అనుకూలిస్తాయి.
టి.రవికుమారి, నెల్లూరు, ఆం.ప్ర.
ప్ర: నా ఉదోయగ విషయం
సమా: మీ ఉథ్యోగం విషయంలో ఏదో కలహం కారణంగా కనిపిస్తోంది. మీ అబ్బాయికి దూర దేశంలో ఉద్యోగ యోగం ఉంది. మీ అబ్బాయివలన మీకు కూడా మనశ్శాంతి కలుగుతుంది.
---

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ