భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్యనాధ్‌చౌదరి, బందరు, కృష్ణా
ప్ర: గతంలో నేను ఒక ప్రశ్న పంపించాను కొరియర్ ద్వారా షిర్డీసారుూబాబా గురించి- మీరు సమాధానం చెప్పలేదు సరే! దానికి కారణం నేనూహించగలను- అయితే ఇప్పుడొక విషయం చెప్పండి- మీ మాటల్లో చాలాసార్లు సోపపత్తికంగా అంటుంటారు దాని అర్థం వివరించండి ప్లీజ్-
సమా: సోపపత్తికము అనేది రెండు పదాల కలయిక స+ఉపపత్తి- ఒక విషయాన్ని సహేతుకంగా నిరూపిస్తూ దానికి మరొక బలమైన హేతువును కూడా జోడించి బలపరిస్తే దాన్ని సోపపత్తికంగా చెప్పటం అంటారు- ఇంగ్లీషులో ‘‘కొరాబరేటివ్ ఎవిడెన్స్’’ అని చెప్పొచ్చు!
డా.ఎమ్.గోపీకృష్ణ, అద్దంకి (ప్రకాశం)
ప్ర: కష్టానికి తగిన ప్రతిఫలం లభించటం లేదు- పరిష్కరం చెప్పండి! - స్వగృహయోగం ఉన్నదా?-
సమా: జన్మ జాతకంలో రవి- గురువులు- బాగుంటే గుర్తింపు ప్రయత్న సాఫల్యమూ సిద్ధిస్తాయి- ఒకసారి మీ జాతకాన్ని మంచి పండితులకు చూపించండి! - మీరిచ్చిన సంఖ్య ప్రకారం గుణిస్తే మీరు ఒకేసారి అనేక ప్రయత్నాలూ ఫలితాలూ ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది- ఒకదానిపైన ఏకాగ్రత చూపండి-
కె.పద్మావతి, అత్తపురం హుడాకాలనీ, హైదరాబాద్
ప్ర: నా మనుమరాలు వయస్సు ఎనిమిది సంవత్సరాలు. మొండితనం జాస్తిగా ఉంది. ఏం చేయమంటారు?
సమా: మీ అమ్మాయిది పూర్వాభాద్ర - మూడవ పాదం- నక్షత్ర పాదాంశ చాలా మంచిది- బుద్ధిమంతురాలే- గురుమహాదశ కనుక బలవంతంగా ఆమెచేత ఏ పనీ చేయించలేరు- సామ- దానాలే ఆమెమీద పనిచేస్తాయి- గొప్పవారైనా చాలామంది మొండివారే- బాగానే ఉంటుంది. కంగారుపడకండి!
వి.కె.తిలక్, విజయవాడ, (కృష్ణా)
ప్ర: మా అబ్బాయి వివాహం ఎప్పుడు- అన్యోన్య దాంపత్యమేనా?-
సమా: మీ ప్రశ్నకు సంఖ్య మీ అబ్బాయి చెప్పాలి. మీరు చెప్పిన సంఖ్య ప్రకారమైతే ఫలితం కొంచెం జటిలమే.
కె.సుబ్రమణ్యం, కావలి (నెల్లూరు)
ప్ర: డబ్బు విషయం ప్రశ్నలో స్పష్టత లేదు. చర్మవ్యాధికి పరిష్కారం?
సమా: డబ్బు విషయ ప్రశ్నలో మీ వాక్యాలలో స్పష్టత లేదు- చర్మవ్యాధి నివారణకుగాను ఆంజనేయస్వామికి, సింధూరం తెల్లజిల్లేడు పూలతో అర్చించి అరటిపళ్ళు ఆరు నివేదన చేయండి. సామాన్య వైద్యంగాపై పూతగా వేపనూనె శరీరానికి పట్టించి గంటసేపటి తరువాత శనగపిండి నలుగు పిండితో స్నానంచేయండి. అంతర్గత దోషమైతే నిపుణులైన వైద్యులను సంప్రదించండి!.
ఎల్.వరలక్ష్మి, చిత్తూరు (ఆం.ప్ర.)
ప్ర: నా కుమారుడు కోడలు మధ్య సఖ్యత లేదు- ఏంచేయాలి- నాకు రావలసిన భూమి- ఆస్తులు ఎప్పుడు రాగలవు?
సమా: మీ కొడుకు- కోడలు జాతకం పరిశీలించనిదే చెప్పలేను. మీ ఆస్తిపాస్తుల పూర్తి పరిష్కారానికి ఇంకా చాలా సమయమున్నది- సెప్టెంబర్‌లో కొంత డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది.
కె.సుగురప్ప, ఎమ్మిగనూరు, కర్నూలు
ప్ర: ఫైనాన్స్ బిజినెస్‌లో ఒడుదుడుకులు- భార్యాపిల్లలకు అనారోగ్యాలు- పరిష్కారం చెప్పండి?
సమా: మీకు ఫైనాన్స్‌కంటే బుక్స్- స్టేషనరీ- వస్తువ్యాపారాలు అనుకూలిస్తాయి- భార్యాపిల్లలకు సాధారణ అనారోగ్యమైతే వైద్య చికిత్స చేయించండి. అసాధారణం అనిపిస్తే గృహవాస్తు- పిల్లల జాతకాలు పండితులకు చూపించండి.
ఎమ్.ప్రియ, పాలకొల్లు, (ప.గో.)
ప్ర: నాకు నలభై ఏళ్ళు దాటాయి. వివాహంకాలేదు. పెద్దగా ఖర్చుపెట్టే స్తోమత లేదు- నా జీవితం బాగుపడటానికి సులభమైన ఉపాయం చెప్పండి?
సమా: ప్రతి మంగళ- శనివారాలు- తొమ్మిది నిమ్మపండ్లు లేదా కాయలు ఎఱ్ఱదారంతో దండగాకూర్చి గ్రామదేవత మెడలోవేసి ప్రార్థించండి!- కొంచెం గోధుమపిండి శర్కర చీమలకు వేయండి. పరిష్కారం దొరుకుతుంది.
వంగల సత్యనారాయణ, కాకినాడ, (తూ.గో.)
ప్ర: జీవితం అంతా అస్తవ్యస్తం- బ్రతుకే వ్యర్థం అనిపిస్తోంది- పరిష్కార మార్గం చెప్పండి!-
సమా:- ‘‘కారణం వినా కార్యం నభవతి’’ ప్రతిదానికీ కారణం ఉంటుంది- మనం చేసిన కర్మలే మనకు ఫలితాన్నిస్తాయి- చెడుకర్మలను మంచి కర్మతో నివారించాలి. ‘‘కర్మణాకర్మణఃశే్ఛత్’’- ప్రతిరోజూ భగవద్గీతాపారాయణం చేయండి. అమూల్యమైన మానవ జన్మ సద్వినియోగం చేసుకుంటే వరం- విచారిస్తూ కూర్చుంటే దుర్భరం-
పి.బదరీనారాయణ, విజయవాడ (కృష్ణా)
ప్ర:- నాది భరణీ నక్షత్రం. ప్రతిరోజూ శివునికి అభిషేకంచేస్తే లాభమేనా?-
సమా: లాభం అనే మాట వ్యాపార ధర్మానికి సంబంధించినది ఈశ్వరారాధన విద్యుక్త కర్తవ్య ధర్మానికి సంబంధించినది- భరణికీ శైవారాధన చాలా మంచిది.
ఆర్.నారాయణ, శ్రీకాకుళం (ఆం.ప్ర.)
ప్ర: నా జీవితం ఎలా ఉండబోతోంది- నిర్మొహమాటంగా చెప్పండి!-
సమా: పూర్తి జీవితాన్ని ఈ చిన్న కాలంలో తెలుపటం సాధ్యంకాదు- తెలుసుకోవటం మంచిది కాదు కూడాను- విధ్యుక్త్ధర్మాన్ని నిర్వర్తించటమే మన బాధ్యత- ‘‘యావత్ కర్మాతావత్ ఫలితం, ఏ విత్తనాన్ని నాటితే ఆ చెట్టే మొలకెత్తుతుంది-
పి.జగన్నాధరావు, ఆదోని, కర్నూలు
ప్ర: వివాహం?
సమా: 2017 మధ్య భాగంలో పూర్తి అవకాశాలున్నాయి.
భీమేశ్వరరావు, కొమ్మర (ప.గో.)
ప్ర: మా గృహానికి విద్యుత్ సరఫరా ఇవ్వకుండా అధికారులు ఇబ్బందిపెడుతున్నారు. సమస్య ఎప్పుడు తీరును?
సమా:- ఇద్దరు అధికారులు మీకు వ్యతిరేకంగా చేస్తున్నట్టున్నారు. ఏవైనా డ్యూస్ మీనుండి ఉన్నాయేమో సరిచూసుకోండి. ఏమైనా ఆగస్ట్ చివరివారంలో మీకు అనుకూలమైన అధికారి వచ్చే అవకాశముంది- సులభంగా పరిష్కారమవుతుంది.
పుల్లాభట్ల సంతోష్‌కుమార్, తాడేపల్లిగూడెం (ప.గో.)
ప్ర:- వివాహం- మనశ్శాంతి- ఉద్యోగం-
సమా:- మూడు వేరువేరు ప్రశ్నలైనా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి- 2017లో పరిష్కారం దొరుకుతుంది-
పుట్ట శివరామకృష్ణ, ఏలూరు (ప.గో.)
ప్ర: భార్యతో విడాకులు- త్వరగా కావాలి-
సమా:- ఇంకా చాలా ఆలస్యముంది- అర్ధాష్టమ శని కారణంగా-
బి.్భజంగం, తిమ్మాపురం (ప.గో.)
ప్ర: నాకు కోళ్ళఫారం పెట్టాలని ఉంది- బాగుంటుందా?
సమా:- బాగానే ఉంటుంది- అయితే పేరుమాత్రం మీ కుటుంబంలోని మహిళా సభ్యుల పేరుతో నిర్వహించు-
జి.వి.ఎల్.నరసింహారావు, మచిలీపట్నం (కృష్ణా)
ప్ర: భవిష్యత్తులో ఆరోగ్యం- ఆర్థిక స్థితి-
సమా:- ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, నరాల బలహీనత- నడుము భాగంలో ఏదో రుగ్మత కనిపిస్తోంది- యూరినరీ సంబంధంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా స్థిరాస్తి మూలకంగా కాని ప్రభుత్వ మూలకంగాకాని కొంత శుభం జరిగే అవకాశం ఉంది-
బి.సుబ్రహ్మణ్యశర్మ, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర: వివాదాలతో వెళ్ళిపోయిన మా కోడలు మళ్ళీ ఎప్పుడు రాగలదు?
సమా: ఈ ప్రశ్నకు మీ అబ్బాయి చేత సంఖ్య చెప్పిస్తే బాగుండేది- మీ సంఖ్యగా గుణిస్తే మీ అబ్బాయికి ఇంకా మంచి సమయం రాలేదు- 2017 మధ్యభాగంవరకు కొన్ని కొత్త పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది-
ఎమ్.రమేశ్, పీచర గ్రామం (వరంగల్)
ప్ర: నేను ఎక్కడ స్థిరపడాలి- వరంగల్లా? హైదరాబాద్‌లోనా? బిజినెస్సా ఉద్యోగమా?-
సమా: హైదరాబాదే యోగిస్తుంది- ప్రారంభంలో కొన్నాళ్ళు ఉద్యోగమే చేస్తారు-
ఈ.స్వాతి, వలివేరు గ్రామం, గుంటూరు
ప్ర: వివాహం- భవిష్యత్తు-
సమా:- సంవత్సరంవరకూ వివాహయోగం కనిపించటం లేదు- భవిష్యత్తు వివాహానంతరం బాగానే ఉండగలదు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ