భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యామిజాల చంద్రస్వామి, విజయవాడ (కృష్ణా)
ప్ర:అయ్యా! ప్రతివారూ శాస్త్రం శాస్త్రం అంటారు. ఏది శాస్త్రం? ఏది కాదు? ఇంతకూ శాస్త్రం అంటే ఏమిటి? దయచేసి వివరించండి.
సమా:‘శాసనాత్ త్రాయతి ఇతి శాస్త్రం’ అని నిర్వచించారు పండితులు. అంటే ఆజ్ఞాపూర్వకమైన వాక్యము ద్వారా (ఇంగ్లీషులో ‘ఇంపిరేటివ్ సెంటెన్స్’ అంటారు) ఈ పని చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేది శాస్త్రం. దానినే ‘సైన్స్ ఈజ్ ఏ సిస్టమీటైజ్డ్ నాలెడ్జ్’ అని ఇంగ్లీషు నిర్వచనం చెప్పారు. స్వార్థాన్ని త్యాగం చేసి మానవ సమాజ శ్రేయస్సు కోసం మహర్షులు శోధించి, సాధించి తపించి తెలిపిన నియమాలే శాస్త్రం. అయితే కొందరు వ్యక్తిగత మహత్వాకాంక్ష కోసం సత్యాన్ని తారుమారు చేసి విడంతవాదంతో ఇది కూడా శాస్తమ్రే అనేవారు ఉన్నారు. వారే కుహనా మేథావులు.
ఎస్.ఆంగీరస, ఇస్కపాలెం, నెల్లూరు
ప్ర:‘్ఫ్యమిలీ పెన్షన్’ ఎప్పుడు రాగలదు?
సమా:నవంబర్, డిసెంబర్లలో మంచి వార్త వింటారు.
ఆళ్ళ ప్రవీణా కాత్యాయని, కూకట్‌పల్లి (హై)
ప్ర:వివాహాలస్యానికి కారణాలేమిటి? ఎప్పుడు జరుగును. నివారణ మార్గాలేమిటి?
సమా:మీ జాతకాన్ని పరిశీలించినవారికి ప్రస్ఫుటంగా కొన్ని దోషాలు కనిపిస్తున్నాయి. అందువలన ముందుకు రావటం లేదు. ఆ దోషాలు పత్రికాముఖంగా చెప్పలేను. వీలయితే స్థానికులే కనుక వ్యక్తిగతంగా కలవండి.
ఆర్.శ్రీనివాసరావు, విజయనగరం (ఆం.ప్ర)
ప్ర:స్థలం అమ్మకం ఆలస్యం- ఆటంకాలు- కారణం తెలుపండి!
సమా:మీరు అమ్మాలనుకున్న స్థలంలో వాయవ్య దోషం సూచిస్తోంది. ఆ కారణంగా వ్యక్తులవలన ఆటంకాలు వస్తున్నాయి. స్థానిక వాస్తు పండితులను సంప్రదించండి. అక్టోబర్‌లో అమ్మకం అయ్యే అవకాశం వుంది కానీ వ్యవహారం సజావుగా జరగదు. జాగ్రత్త అవసరం.
ఎమ్.నాగ శ్రీలక్ష్మీభ్రమరాంబిక, కొమరగిరిపట్నం, తూ.గో.
ప్ర:వివాహాలస్యం- ఆటంకాలు- కారణం చెప్పండి. ఐదు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు.
సమా:మీ జాతకంలో శుక్రదోషం ఉంది. దానికి పరిహారంగా వివాహ సిద్ధితులసీవ్రతం ఒకటి ఉంది. అది ప్రతి శుక్రవారము చేయాలి. లేదా సంతోషీమాతా వ్రతమైనా చేయండి. నివారణ జరుగుతుంది.
బి.హన్మంతరావు, తణుకు (ప.గో)
ప్ర:నా గ్రహస్థితి బాగుండుటలేదు. వివరణ ఇవ్వండి.
సమా:మీ జాతకం ప్రకారం మీకు స్వార్జిత భాగ్యమే ఉంటుంది. జన్మ స్థలానికి దక్షిణంగా కాని ఆగ్నేయంగా కాని మీకు లాభదాయకం. గురుబలం గల జాతకులు అయితే జాతకంలోని స్ర్తి విరోధయోగం ఉంది. రవి, కుజ, కేతు దోషాలున్నాయి. నివారణకు పండితులను సంప్రదించండి. వీలయితే వ్యక్తిగతంగా కలవండి.
టి.సామీకుమార్, అంబర్‌పేట, హైదరాబాద్
ప్ర:ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవటం లేదు. ఆర్థికంగా ఎప్పుడు బాగుపడగలను.
సమా:డబ్బు నిలవాలంటే ఖచ్చితమైన పొదుపు పాటించాలి. మీ జాతకం పరిశీలిస్తే కొంచెం ‘పటాటోపం’ ప్రదర్శించే లక్షణాలు కనబడుతున్నాయి. ధనలాభం కోసం కుబేర పాశుపతం పద్ధతిలో ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయండి.
జె.సురేశ్ మాలి, హిందూపురం, ఆం.ప్ర.
ప్ర:చేజారిపోయిన భూమి మళ్లీ రాగలదా? భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది?
సమా:పోయిన భూమి మళ్లీ లభించే అవకాశం లేదు. గట్టిగా ప్రయత్నిస్తే కలహాలు జరిగే అవకాశం ఉంది. 2017 జూన్ నుండి కొంత మంచి జరుగగలదు.
వి.తులసీదాస్, చిక్కడపల్లి, హైదరాబాద్
ప్ర:ఆర్థిక పరిస్థితి, చిన్నమ్మాయి వివాహం?
సమా:ఆర్థిక పరిస్థితి బాగుపడటానికి ఇంకా ఆలస్యం ఉంది. మీ చిన్నమ్మాయి వివాహం గురించి ఆమె జాతకం తెలియనిది చెప్పలేను.
తిరునగరి నవీన్, పెద్దపల్లి, కరీంనగర్
ప్ర:వివాహ ప్రశ్న?
సమా:ఒకటి రెండు సంబంధాలు చివరిదాకా వచ్చి తప్పిపోయే ప్రమాదం ఉంది. 2017లో వాయవ్య దిశ నుండి వచ్చే సంబంధం నిర్ణయమవుతుంది.
మహావీర్ గోయల్, బొగ్గులకుంట, హైదరాబాద్
ప్ర:నాకు తెలుగు రాదు. మా మిత్రుని సలహామీద మా కుమారునికి వాహనం కొనివ్వవచ్చా? అని అడిగాను. మీరు వద్దన్నారు. కాని ఏవౌతుందిలే అని కొని యిచ్చాను. ఘోరమైన ఆక్సిడెంట్ జరిగి కాలు పోగొట్టుకున్నాడు. దైవం దయవలన ప్రాణాపాయం జరగలేదు. ఇప్పుడు నా కుమారుడు భవిష్యత్తుకోసం ఏం చేయాలి?
సమా:శ్రీమత్సుందరకాండ పారాయణం నలభై రోజులు మంచి పండితునిచేత చేయించండి. ప్రతి మంగళవారం తేనె, అరటిపండ్లు నివేదన చేయండి. ఒక బ్రాహ్మణుల బ్రహ్మచారికి యధాశక్తి సన్మానించండి.
ఎస్.వాసుదేవరెడ్డి, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం
ప్ర:కుమారుని విదేశీ ప్రయాణం?
సమా:తాత్కాలిక ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ కాలం ఉండే అవకాశాలు కన్పించడంలేదు.
త్రిష్య అనూహ్య, పాలకొల్లు, ప.గో.
ప్ర:తీవ్రమైన అనారోగ్యం - పేదరికం - పరిష్కారం చెప్పండి.
సమా:‘పూర్వ జన్మకృతం పాపం వ్యాధి రూపేణా బాధతి’ అని పెద్దల మాట. నరసింహ స్వామి సేవ మాత్రమే మీకు మార్గం చూపగలదు. ఎంతోమంది భక్తుల అనుభవంలో స్వప్నంలోనే స్వామి ఆపరేషన్ చేసి రోగ విముక్తులను చేసారట. ఆది-మంగళ వారాలు శ్రీ నృసింహ స్వామికి నెయ్యి దీపం వెలిగించి వడపప్పు పానకం నివేదన చేయండి. నృసింహ స్తోత్రం చదుకోండి. మార్పు వస్తుంది.
బి.సునీత, పెబ్బేరు, మెహబూబ్‌నగర్
ప్ర:ప్రభుత్వోద్యోగం?
సమా:అక్టోబర్-నవంబర్‌లలో ఒక శుభయోగం జరిగే అవకాశం ఉంది.
ఎమ్.నాగజ్యోతి, వరిధనం గ్రామం, ప.గో.
ప్ర:నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలి? అష్టముఖ గండభేరుండ నృసింహ దేవాలయాలు ఎక్కడ ఉన్నవి?
సమా:నాకు తెలిసినంతవరకు ఆ పేరుతో నృసింహ దేవాలయాలు లేవు. మంత్రరూపం- యంత్రరూపంలోనే అర్చించటం సంప్రదాయం. మీ వరకు మామూలుగా ప్రతి మంగళవారం నృసింహస్తోత్రం చదువుకోండి. బెల్లం పానకం, వడపప్పు నివేదించండి.
జి.లింగయ్య, చైతన్యపురి, హైదరాబాద్
ప్ర:ఋణబాధలు, అవమానాలు, స్థలం విషయంలో వివాదం. భరణీ నక్షత్ర పరిస్థితి ఏమిటి?
సమా:్భరణీ నక్షత్రానికి గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఋణపీడకు- ఋణవిమోచన అంగారక వ్రతం చేయండి. స్థలం వివాదం పెరిగే అవకాశం వుంది.
కందికట్ల రజని, ఆత్మకూరు, వరంగల్
ప్ర:అనారోగ్యాలు- రకరకాలు- కారణం గృహమా?
సమా:గృహంలో వాయవ్య - ఉత్తర భాగాలు- ఆగ్నేయం దోషం కనిపిస్తోంది. వాస్తు పండితుని సంప్రదించండి.
అచ్చుకల శ్రీనివాసరావు, ఒంగోలు (ప్రకాశం)
ప్ర:ఆర్మీలోకి పోయిన అన్నయ్య జాడ తెలియని పరిస్థితి. తిరిగి రాగలడా?
సమా:తిరిగి వచ్చే సూచనలు కనిపించటంలేదు. గట్టి ప్రయత్నం చేస్తే ఏదైనా సమాచారం దొరికే అవకాశం వుంది.
చింతా మోహనకృష్ణ, యాదికి, అనంతపురం
ప్ర:ఉద్యోగం ఎప్పుడు?
సమా:మీరు కొన్ని రిజర్వేషన్లు సడలించుకుంటే నవంబర్‌లో అవకాశం ఉంది.
ఎమ్.రమణమూర్తి, నర్సారావుపేట, గుంటూరు
ప్ర:మందుల వ్యాపారంలో ఎదురుదెబ్బలు- పరిష్కారం ఏమిటి? ఏవైనా రక్షా యంత్రాలు- ఉంగరాలు ధరించాలా?
సమా:ప్రథమంగా మీ స్వభావంలో ఇతరులను వెంటనే నమ్మే లక్షణం ఉంది. ఆ కారణంగా నష్టపోయారు. మందుల వ్యాపారంవల్ల కాదు. మణి - మంత్ర - ఔషధ - యంత్ర - తంత్రములు ఉన్నాయి కాని సరిగా శాస్ర్తియంగా చేయించుకోవాలి. మీకు మంచి సలహాదారుల అవసరం ఉంది.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ