మెయిన్ ఫీచర్

ఓడినా..ఆశా‘దీపా’..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడారంగంలో జయాపజయాలు దైవాదీనం అంటారు. ఇది వాస్తవమో కాదో తెలియదుకానీ రియో ఒలింపిక్ సమరంలో పోరాడి ఓడినా దీపా కర్మాకర్ మాత్రం యావత్ దేశ ప్రజల మనసును గెలుచుకుంది. అర్ధశతాబ్దానికి పైగా ఒలింపిక్ జిమ్నాస్టిక్ చరిత్ర పుటల్లో పేరే నమోదు చేయించుకోలేకపోయిన భారత్‌కు ఏకంగా చిరునామానే లిఖింపజేసే ఘనత రెండు పదులు దాటిన దీప సాధించిపెట్టింది. రియోకు అర్హత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్టిక్‌గా రికార్డులకెక్కి ఆదివారం రాత్రి యావత్ దేశం బుల్లితెరకు కళ్లప్పగించి చూసేలా చేసింది. దీప అద్భుతమైన విన్యాసాలకు యావత్ భారతదేశం పులకించిపోంది. అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్ జిమ్నాస్టులకు గట్టిపోటీనిచ్చి, నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఆమెకు పతకం లభించకపోయినా, కోట్లాది మంది అభిమానుల నీరాజనాలు దక్కాయి. ఈ ఓటమితో కృంగిపోకుండా ఐదు, ఆరు స్థానాలకు పడిపోయి దేశ ప్రజల మనస్సును గాయపరచనందుకు ఆనందంగా ఉందంటూ సవినయంగా తన ఓటమిని ప్రజల ముందు ఉంచటం దేశం పట్ల ఆమెకున్న గౌరవాన్ని ఇనుమడింపజేస్తోంది.
ప్రాణాలతో చెలగాటం ప్రొడునోవా విన్యాసం
జిమ్నాస్టిక్‌లో ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా. ఈ విన్యాసాన్ని ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా వంటి దేశాల జిమ్నాస్టులు మాత్రమే చేయగలిగారు. ప్రాణాలకు తెగించాల్సి వచ్చే ఆ విన్యాసాన్ని ఎంచుకుని ఈసారి క్వాలిఫయింగ్ రౌండ్‌లో 14.850 పాయింట్లు సాధించి, తొలి ప్రయత్నంలోనే అర్హత సంపాదించిన దీప ల్యాండింగ్ సమయంలో చేసిన చిన్నపొరపాటు ఆమెకు పతకాన్ని దూరం చేసింది. కానీ, ఆమె అందుకున్న నాలుగో స్థానం తక్కువదేమీ కాదు. అందుకే యావత్ భారత దేశం ఆమెకు నీరాజనాలు పలికింది.

చిన్న వయసులోనే ప్రశంసలు
రియో ఒలింపిక్‌లో ఓడిపోయినప్పటికీ ఆమెపై సామాజిక మాధ్యమాలలో ప్రశంసల జల్లు కురిసింది. ఆదివారం అర్థరాత్రి నుంచి ఆమెకు 1,0421,042 ట్వీట్లు, 2,8992,899 లైక్స్ వచ్చాయంటే ఇంత చిన్న వయసులోనే రియోలో గెలవకపోయినా దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్న విషయం స్పష్టమవుతోంది.
మూడేళ్ల నుంచి జిమ్నాస్టిక్‌కే అంకితం
రియో ఒలింపిక్ కోసం గత మూడేళ్ల నుంచి తన జీవితానే్న త్యాగం చేసిందని ఆమె తండ్రి దులాల్ అంటున్నారు. జిమ్నాస్టిక్‌కు అంకితమై ప్రాక్టీస్ చేస్తుందని చెబుతున్నారు. తుదివరకు అసమాన పోరాట పటిమ కనబర్చిన ఆమె పతకాన్ని సాధించకున్నా భవిష్యత్తులో ప్రపంచ ఉత్తమ జమ్నాస్ట్‌గా ఎదుగుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రొడునోవా విన్యాసం చేసిన ప్రపంచ మహిళా జిమ్మాస్టిక్‌లో దీపా మూడవ క్రీడాకారిణి.
సాధించిన విజయాలు
త్రిపురకు చెందిన ఓ మధ్యతరగతి బాలిక దీపా కర్మాకర్. ఆరేళ్ల ప్రాయంలో జిమ్నాస్టిక్‌లోకి అడుగుపెట్టింది.
కోచ్ విశే్వశ్వర్ చదునైన ఆ చిన్నారి చదునైన పాదాలు చూసి జిమ్మాస్టిక్స్ విన్యాసాలు చేయగలదా అని అనుమానం వ్యక్తంచేశాడు.
- 2007 నుంచి జిమ్నాస్టిక్‌లో ఆమె ప్రారంభించిన జైత్రయాత్ర నేటి రియో ఒలింపిక్ పోటీల వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో 67 బంగారు పతకాలతో సహా మొత్తం 77 పతకాలు గెలుచుకుంది.
- నిరుడు నిర్వహించిన కామనె్వల్త్ క్రీడలలో జిమ్నాస్టిక్స్‌లో తొలి పతకం సాధించిన క్రీడాకారిణిగా తన పేరును లిఖించుకుంది.

తండ్రి దులా ల్ కూడా క్రీడారంగానికి చెందిన వ్యక్తి కావటంతో ఆయన అందించిన ప్రోత్సాహాంతో అతికొద్ది కాలంలోనే తన ప్రతిభాపాటవాలు ప్రదర్శించగలిగింది.
14 ఏళ్ల వయసులో ఆమె జల్బైగురిలో జరిగిన జూనియర్ నేషనల్ గేమ్స్‌లో పతకాన్ని సాధించింది.
2007 నుంచి జిమ్నాస్టిక్‌లో ఆమె ప్రారంభించిన జైత్రయాత్ర నేటి రియో ఒలింపిక్ పోటీల వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో 67 బంగారు పతకాలతో సహా మొత్తం 77 పతకాలు గెలుచుకుంది.
నిరుడు నిర్వహించిన కామనె్వల్త్ క్రీడలలో జిమ్నాస్టిక్స్‌లో తొలి పతకం సాధించిన క్రీడాకారిణిగా తన పేరును లిఖించుకుంది.
ఆసియన్ గేమ్స్‌లో గాయపడి పతకాన్ని చేజార్చుకోవటం ఆమెను బాధించింది. అయినప్పటికీ నిరుత్సాహానికి గురకాకుండా పడిలేచిన కెరటం వలే తన సత్తా చాటుకుంది.
ఆమె క్రీడా కెరీర్‌కు బాసటగా ఆశిష్ కుమార్ నిలిచాడు. ఆశిష్ కుమార్ కూడా జిమ్నాస్టే. 2010లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో జిమ్నాస్టిక్‌లో తొలి పతకాన్ని సాధించిన క్రీడాకారుడు.
‘్భరత మువ్వనె్నల పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై తలఎత్తుకుని ఎగురవేయించలేకపోయాను. ఆ పని నువ్వ చేస్తావా?’ అని తండ్రి అడిగితే తప్పకుండా చేస్తానని వాగ్దానం చేయటమేకాదు అందుకు తగ్గట్టుగా తనను తాను పట్టుదలతో మలచుకుంది దీప.

జిమ్నాస్టిక్స్ శ్వాసగా..
జిమ్నాస్టిక్స్‌ను ప్రేమించింది. అదే శ్వాసగా బతికింది.
చెరగని చిరునవ్వే ఆమె వ్యక్తిగత జీవితానందానికి చిరునామా.
ఆమె సాధించిన విజయాలన్నీ నేలమీద నుంచే ప్రారంభమయ్యాయని ఆమెకు తెలుసు. అక్కడ నుంచే తమ పయనాన్ని ప్రారంభించి సార్థకం చేసుకుంది.
వినయాన్ని మూలస్తంభంగా చేసుకుని తన పేరును, కీర్తిని సాధించింది.
ఆమె సాధించిన విజయాలు వాస్తవాలే కాని కలలు కాదు. విజయశిఖిరాలు అధిరోహించాలంటే ఎక్కడున్నా కష్టపడాలని గ్రహించి అలాగే కృషి చేసింది.
కోచ్‌తో ఉన్న అనుబంధం ఆమెను మరింత రాటుదేల్చిందని చెప్పవచ్చు.
తన శరీరాన్ని జిమ్నాస్టిక్స్‌కు అనుగుణంగా మలుచుకుంది.
క్రీడా చరిత్రలో చదునైన పాదాలు కలిగిన ఓ చిన్నారి చరిత్ర సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించ ఉండరు.
ఆశావాదంతో పోటీలలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతోనే కోచ్ ఆమెను గృహనిర్భందంలో ఉంచాడు.
ఆమె జీవితంలో కదిలిన ప్రతి నల్లని మేఘం కూడా ఆమెకు వెండి గీతనే గీచింది.
ఏది ఏమైనా ఆమె సాధారణ బాలికను కాదు అని నిరూపించుకుంది. భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధిస్తూ నిరూపించుకుంటుంది.
కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాన్ని సాధించినపుడు క్రికెట్ లెజెండర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చిన ప్రశంస తన జీవితంలో మరిచిపోలేని ప్రశంసంగా చెబుతుంది.
***

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

టి.ఆశాలత