మెయిన్ ఫీచర్

పల్లె సేవకు ‘కొంగు’బిగించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకుదెరువు కోసం పట్టా చేతికి అందగానే డాలర్లు సంపాదించాలని ఆరాటపడేవారు ఎందరో ఉన్నారు. నా పల్లె కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు కొందరే. ఇప్పటి వరకు వ్యాపారం, క్రీడలు, రాజకీయాల్లోని ఉన్నత పదవుల్లో రాణించిన మహిళలు, సర్పంచ్ వంటి చిన్న పదవుల్లో కూడా ఒదిగిపోయి పల్లె సేవకు కొంగు బిగించారు. సర్పంచ్‌లుగా పదవులు చేపట్టిన రీతూ పంద్రామ్, గంగుబాయి, రాజ్‌వాత్ అనే ముగ్గురు మహిళలు ప్రభుత్వాల సాయంతో తమ గ్రామసీమలను ప్రగతిపథాన నడిపిస్తున్నారు.
పీజీ పట్టాపొంది ప్రజాసేవలోకి...
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు 225 కి.మీ. దూరంలో సార్‌బహ్రా అనే గిరిజన గ్రామమది. తొమ్మిది వేల జనాభా కలిగిన ఆ గ్రామానికి అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు. వర్షా కాలంలో వ్యాధులు విజృభించేవి. ‘అక్షర’ జ్ఞానం లేదు. పంచాయతీ పాలకులు, జిల్లా అధికారులు ఉన్నా ఆ గ్రామ పురోగతి అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలో ఓ మహిళ గ్రామాభివృద్ధి కోసం నడుంకట్టింది. పిన్న వయస్సులోనే పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైంది.. ఆమే.. 24 ఏళ్ళ రీతూ పంద్రామ్. బిలాస్‌పూర్‌లో బయోటెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె నిజానికి పేదింటి పిల్ల. తండ్రి ఉదయ్ సింగ్, రైతు. ఇంటి ఆదాయం అంతంతమాత్రమే. అయినా, కుమార్తె ఆశయానికి భుజం తట్టి ప్రోత్సహించాడు. తాను సర్పంచ్‌గా ఎన్నికవుతానని కలలో కూడా ఊహించుకోలేదు. సర్పంచ్ పదవికి నువ్వే సరైన దానివి అని ఇప్పుడంతా అంటున్నారన్నారామె’.
గతంలో ఏర్పడ్డ దుర్భిక్ష పరిస్థితుల వల్ల చాలా మంది రైతులు అప్పులపాలయ్యారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకున్న రీతూ పంటపొలాలు సస్యశ్యామలం అయ్యేలా వర్షపునీటిని నిల్వచేసే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఐఎఎస్ కావాలన్న బలమైన కోరిక కలిగిన ఆమె సర్పంచ్‌గా బాధ్యతను నిర్వర్తిస్తునే ఆ దిశ అడుగులు ముందుకు వేస్తూ శభాష్ అనిపించుకుంటోంది.
ఉద్యోగం వీడి..
ఎంబిఎ చదివిన మొట్టమొదటి మహిళా సర్పంచ్ చివ్వి రాజ్‌వాత్. తన ప్రొఫెషన్‌కు అనుగుణంగా వ్యాపారాలు చేసుకోవడం లేదామె. పల్లెసీమల ప్రగతికి పూనుకున్నారు. చివ్వి రాజ్‌వాత్ మెయో బాలికల పాఠశాల(అజ్మీర్), మన రాష్ట్రంలో రిషి వ్యాలీ స్కూల్‌లో, శ్రీరామ్ మహిళా కళాశాల(్ఢల్లీ యూనివర్శిటీ)ల్లో విద్యనభ్యసించారు. ఎంబిఎ డిగ్రీ తర్వాత ఎయిర్‌టెల్ గ్రూపు భారతి-టెలి వెంచర్స్ వద్ద ఆమె సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా కొద్ది రోజులు పనిచేశారు. ఇప్పుడామె జైపూర్‌లోని మాల్‌పుర తాలుకా టాంక్ జిల్లా పరిధిలోని సోడా గ్రామ సర్పంచ్‌గా రాజ్‌వాత్ ఉన్నారు. తన తాత రఘువీర్‌సింగ్ సర్పంచ్‌గా చేశారు. సర్పంచ్ పదవి స్వీకరించిన రాజ్‌వాత్ పదవి చేపట్టిన తర్వాత చీకట్లో మగ్గుతున్న ఆయా గ్రామా ల్లో సౌర విద్యుత్‌ను ఏర్పాటు చేసి, వారి ఇళ్ళల్లో వెలుగులు నింపారు. అ లాగే, ప్రభుత్వ సాయంతో జలాశయం నిర్మించి, వ్యసాయానికి దన్నుగా నిలిచారు.
వడ్డీ బాధితులను ఒడ్డుకు చేర్చారు...
అవినీతి వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకుని విలవిలలాడుతున్న రైతన్నల దీనస్థితిని చూసి చలించిపోయిన ఆమె, భారతీయ స్టేట్‌బ్యాంకు శాఖను ఏర్పా టు చేసి, రైతులను వడ్డీల ఊబి నుంచి రక్షించారు. విద్యాసుగంధాలు వెదజల్లే క్రమంలో సాప్ అనే జర్మన్ సంస్థను సంప్రదించి, సోడా గ్రామం లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పా టు చేసి, పిల్లలను ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఎన్నో పురస్కారాలు వరించాయి. 2011లో ఐక్యరాజ్యసమితి నుంచి 11వ ఇన్‌ఫో ప్రావర్టీ ప్రపంచస్థాయి సమావేశం కోసం ఆహ్వానం అందింది. నాకు డబ్బు వద్దు, నా పంచాయతీ పరిధిలో పలు ప్రాజెక్టులు ఏర్పాటు, తద్వారా అభివృద్ధి ఫలాలను మా ప్రజలకు అందించేందుకు వ్యక్తుల, సంస్థల సాయం అవసరమని అన్నారామె. ఇల్లు చక్కదిద్దే మహిళలు ఇప్పుడు తమ పంచాయతీలను కూడా ఆదర్శంగా తీర్చిదిద్దితూ నలుగురిచే శెభాష్ అనిపించుకుంటున్నారు.
వృద్ధాప్యంలోనూ సేవే లక్ష్యంగా..
పూణే జిల్లా, ఖేద్ తాలు కా, బంబుర్‌వది గ్రామంలో 94 ఏళ్ళ గంగుబాయి నివృత్తిబాంబురే అక్కడ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజానికి దేశంలో ఈమెది ఒక రికార్డుగా అధికారులు చెప్పుకుంటారు. ఆ పంచాయతీ ప్రజలు ఆమె ఎన్నికయ్యాక పూలతో సత్కరించారు. ఆమె కూడా నవయువతిలా చురుగ్గా సమావేశాలకు హాజరవుతూ, గ్రామ పంచాయతీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అక్కడి ప్రజానీకానికి భరోసా కల్పిస్తున్నారు

మొదటి లక్ష్యం సాగునీటి సౌకర్యం కల్పన
తన పంచాయతీలో ఉన్న ఏడు గ్రామాల్లో 250 రైతులు ఉన్నారు. మొత్తం పంటభూమి విస్తీర్ణం వెయ్యి హెక్టార్లు ఉంది. ఏడాదిలో ఎనిమిది మాసాలు ఆ భూములకు సాగునీరు అందదు. దీంతో ఆ సమయంలో కరవు పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ భూములకు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ కెనాల్ ఉందని గంగుబాయి మనవుడు రాహుల్ బాంబురే ఆమెకు చెప్పాడు.
దీంతో ఆమె ఆ కెనాల్ నుంచి లేదా దగ్గర్లో ఉన్న చస్కామాన్ డ్యాం నుంచి పైపులు లైన్లు వేస్తే రైతులకు మేలు కలుగుతుందని భావించింది. అయితే, ఇందుకు భారీగా వ్యయం అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గంగుబాయి ప్రధాన మంత్రి మోదీకి ఒక లేక రాస్తారు అన్నారు. నా అభ్యర్థనను ఆయన ఆలకిస్తారు. ఆయన నాకు కొడుకులాంటివాడు’ అంటుందామె. ఆమెకు పేదల కష్టాలు తెలిశాయి. వారికి కోసం ప్రభుత్వ పథకాలను వారిందరికి చేరుస్తున్నారు. ‘నేను రోజుకు రెండుసార్లు భోజనం చేస్తా.. అది కూడా మితంగా తీసుకుంటా.. అందుకు ఇనే్నళ్ళు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటున్నా’ అన్నారామె.

- కృష్ణమూర్తి