భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటరమణరావు (డి.డి) అమరావతి మెట్రోరైలు- విజయవాడ
ప్ర:గతంలో నా కుటుంబానికి సంబంధించి చాలా ప్రశ్నలు వేసాను. మీ భవిష్య సూచనలు వంద శాతం ఫలించాయి. ధన్యవాదాలు. ప్రస్తుతం మీరు తెలియజేసిన చేసిన ప్రకారం నాకు అమరావతి మెట్రో రైలులో డిప్యూటీ డైరెక్టర్ పదోన్నతితో పంపించారు. ప్రస్తుత డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతి కొనసాగుతుందా? ఆలస్యమునకు కారణం చెప్పగలరు?
సమా:నా సూచనలు మీకు ఉపకరించినందుకు నాకు సంతోషంగా ఉంది. మీది పూర్వాషాఢా నక్షత్రం, మూడవ పాదం- విజయాంశ- తప్పక జయమే లభిస్తుంది. అయితే ధనుర్రాశికి ఏలిననాటి శని ప్రభావం బలంగా వుంది. అందువలన ఆలస్యం- మానసిక సంఘర్షణ తప్పవు. అయితే వచ్చే సంవత్సరం ఈ రోజుల్లో అంటే అక్టోబర్ నవంబర్‌లలో మీకు పదోన్నతి లభించడమే కాక సంతాన సంబంధంగా శుభం కూడా కలుగుతుంది.
కె.రాజారావు, అంబాజీపేట (ప.గో)
ప్ర:పెళ్లిపీటల కొలతలు ఎలా ఉండాలి?
సమా:పెళ్లిపీటలకంటే వివాహ వేదిక ప్రధానం- సాగేటి కాడి పొడవు, వాటి వెడల్పు ప్రమాణంతో వేదిక ఉండవలెను. వరుని కాళ్ళు కడిగే పీట మాత్రం పొడవు, వెడల్పు సమానంగా ఉండాలి.
ఎమ్.హేమంత్‌కుమార్, విజయవాడ, కృష్ణాజిల్లా
ప్ర:ఉద్యోగమా? వ్యాపారమా?
సమా:ఐదేళ్ళవరకూ ప్రస్తుత ఉద్యోగంలోనే ఉంటారు.
పోలాకి సుభాషిణి, విజయనగరం (ఆం.ప్ర)
ప్ర:పోయిన బంగారు జందెం
సమా:పోలేదు. దానికి సంబంధించిన వారివద్దనే ఉండే అవకాశం వుంది. మీ యింట్లో ఉత్తర వాయువ్య బీరువాలలో కాని, సొరుగుల్లోకాని దొరికే అవకాశం ఉంది. బాగా వెతకండి.
మహమ్మద్ అమీ సోహెల్, గుడివాడ (ఆంధ్ర)
ప్ర:ప్రభుత్వోద్యోగం- అనుకున్న అమ్మాయితో వివాహం?
సమా:మొదటిది ఆలస్యం- రెండవది సందేహాస్పదమే. వివాదం రాకుంటే అదే గొప్ప. జాగ్రత్త అవసరం. ‘‘వహీ హోతాహై, జో మంజూరే ఖుదా హోతాహై’’ ఉర్దూ సామెత గుర్తుపెట్టుకోండి.
బి.జ్యోతి, కూచిపూడి (కృష్ణా)
ప్ర:ఆర్థిక బాధలూ, సంతానంలో అస్థిరత్వం- గోవుకు సేవ జేసే విధం చెప్పండి.
సమా:వీలయితే ఒక మంచి కపిల ధేనువును సాకండి! గోవులో ముక్కోటి దేవతలున్నారు. కేవలం గోవు యొక్క పాదధూళి సోకినంతనే దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవికి రఘు మహారాజు జన్మించాడు. గోసేవ సకల పాపహరం- సకల వరాల హారం.
ఐ.శంకరనారాయణ, ప్రొద్దుటూరు, కడప
ప్ర:శేషజీవితం ఎలా గడుస్తుంది? సోదరీ బంధువర్గంలో కోర్టు తగాదాలు ఎట్లా ఉంటాయి.
సమా:మీ జీవితం సంఘర్షణాత్మకం- స్వాతిశయం పాలు తగ్గించుకుంటే మనశ్శాంతి- బంధు ప్రీతి లభిస్తుంది. కోర్టు కంటే రాజీ మార్గం మంచిది.
పి.ప్రతిభ, తిరుపతి, చిత్తూరు
ప్ర:పెద్దమ్మ ఆస్తి లభిస్తుందా?
సమా: మీరు వ్రాసిన వివరాల ప్రకారం చట్టరీత్యా మీకే అధికారమూ- హక్కు లేదు. మీ మేనమామలు సానుభూతితో ఇస్తే తప్ప ఏమీ రాదు.
ఎన్.నాగేశ్వరరావు, నరసారావుపేట (గుంటూరు)
ప్ర:వ్యాపారం కలసిరావటంలేదు. భవిష్యత్తు ఎట్లా ఉంటుంది?
సమా:‘స్వాతీ’ నక్షత్ర జాతకులుగా మీలో చొరవ, పట్టుదల- మహత్వాకాంక్షలూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏలిననాటి శని ప్రభావం వలన ఇబ్బందులు తప్పవు. శనివారం వెంకటేశ్వరస్వామి వ్రతం చేయండి.
ఎమ్.స్నిగ్థ, ఉల్లంపర్రు గ్రామం (ప.గో.)
ప్ర::కుజ దోష నివారణకు సులభమైన ఉపాయం చెప్పండి.
సమా:ప్రతి మంగళవారం ఏకభుక్తం (రాత్రి భోజనం)- కుజ గౌరీవ్రత నిర్వహణ- యథాశక్తి రాగిపాత్రలూ - కందులూ దానం - సుబ్రహ్మణ్య స్తోత్రం - వడలూ- పాయసం నివేదన.
కె.సుబ్రహ్మణ్యం, విజయవాడ (కృష్ణా)
ప్ర:ఉద్యోగానికి రాజీనామా- తిరిగి అదే ఉద్యోగానికి ప్రయత్నం-
సమా:అదృష్టదేవత ప్రతి మనిషికీ ఒకసారి తలుపు తట్టుతుంది. ఆ సమయంలో తలుపు తీస్తే జీవితం పచ్చతోరణమే. తప్పితే జీవితం సమస్యలతో రణమే.
పోడూరి బదరీ నారాయణ, విజయవాడ (కృష్ణా)
ప్ర:బాంక్ ఉద్యోగం కోసం ఏంచేయమంటారు?
సమా:నిర్దిష్టమైన కోర్స్ పూర్తిచేయటం- ఆ తరువాతనే దైవానుగ్రహ ప్రయత్నం.
భార్గవి, కందుకూరు (ప్రకాశం)
ప్ర:పూర్వ వివాహ ప్రభావం పునర్వివాహంమీద అని మీరు చెప్పిన విషయం నిజమే. దానికి పరిహారమేమిటి చెప్పండి!
సమా:వివాహసిద్ధి తులసీవ్రతం చేయండి. వివరాలకు పురోహితులను సంప్రదించండి.
డి.వెంకటరావు, బరంపురం (ఒడిస్సా)
ప్ర:నాకు ఏ వ్యాపారం యోగిస్తుంది?
సమా:స్టేషనరీ- పుస్తకములు- చిట్‌ఫండ్, పిల్లల ఆట వస్తువులు- గిఫ్ట్స్ అండ్ నావల్టీస్.
ఎస్.ఎస్.కర్రీ, విజయనగరం (ఆం.ప్ర)
ప్ర:రైల్వే నుంచి రావలసిన సొమ్ము కోసం కోర్టుకు వెళ్ళక తప్పదా?
సమా:కోర్టుకు వెళ్ళవలసిన అవసరం లేకుండానే వచ్చే అవకాశం ఉంది.
ఎల్లూరి రవికుమార్, రాజానగరం (తూ.గో)
ప్ర:గొలుసు అప్పుల బాధ
సమా:అప్పు తీర్చటం కోసం అప్పు చేస్తూ తప్పు చేసారు. కొంచెంగా ఉన్నప్పుడే తీర్చాల్సింది. ఇప్పటికైనా ఋణవిమోచన అంగారక వ్రతం చేయండి.
ఎన్.శివశంకరరావు, విశాఖపట్టణం (ఆం.ప్ర.)
ప్ర:ప్రస్తుతం నేను చేస్తున్న హోటల్ వ్యాపారం మున్ముందు కూడా చేయమంటారా. ప్రస్తుతం బాగానే వుంది కాని పనివాళ్ళతో ఇబ్బంది వస్తోంది.
సమా:బాగున్నప్పుడు అదే కొనసాగించండి. వాస్తవిక సమస్యలనేవి ప్రతి వ్యాపారంలోనూ ఉంటాయి. తక్కువగా ఉండాలంటే ‘స్వగృహ ఫుడ్స్’ వ్యాపారం పెట్టండటి.
కర్రి రవికుమార్, ఆకీవీడు, ప.గో.
ప్ర:నాది మిఠాయి వ్యాపారం- వ్యాపారాభివృద్ధికీ- ధన సమృద్ధికీ ఏం చేయాలి?
సమా:ప్రతి సోమవారం అటుకులూ బెల్లం గణేశుడికీ, ప్రతి మంగళవారం జిలేబీలు దుర్గాదేవికి, ప్రతి శుక్రవారం కోవా పేడాలు సంతోషీ మాతకు ప్రతి శనివారం బూందీ లడ్డూలు వెంకటేశ్వరస్వామికి యధాశక్తి సమర్పించి పిల్లలకు పెద్దలకు పంచిపెట్టండి.
ఎ.కాశీశ్వరాచారి, కాకినాడ (తూ.గో.)
ప్ర:కాకినాడ- హైదరాబాద్- ఏది అనుకూలం?
సమా:కాకినాడే మీకు అనుకూలం. అక్కడే మరో వ్యాపారం మొదలెట్టండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................

సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ