మెయిన్ ఫీచర్

శే్తసౌధంలో సౌందర్య నాయకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన బంధం ఆమెకు శాపంగా మారింది. మోడల్‌గా చేసిన వృత్తి ధర్మం ఒకింత ఒడిదుడుకులకు గురిచేసినా వెరవలేదు. సాధికారితకు హేతువుగా నిలవాల్సిన సాటి స్ర్తిలోకం తన వ్యక్తిగత విషయాలను బజారుకీడ్చటాన్ని సహించలేకపోయింది. అదను చూసి ఎదురుదాడి చేసి ప్రత్యర్థుల నోళ్లు మూయించి భర్త విజయానికి బాసటగా
నిలిచింది. ఆమే మెలెనియా ట్రంప్. భర్త ఎన్నికల పోటీలో నిలిచినప్పటి నుంచి మెలెనియా ఎలాంటి ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఇంటికే పరిమితమైంది. ఇంధ్రభవనాన్ని తలపించే ట్రంప్ టవర్‌లో ఆమె కొడుకే లోకంగా ఉన్నది తప్ప ట్రంప్ ప్రచారంలో ఏనాడూ పాల్గొనలేదు. దీంతో ట్రంప్ పోటీని సొంత భార్యనే వ్యతిరేకిస్తుందని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. ఆమె వృత్తి మోడలింగ్. ఈ వృత్తిలో భాగంగా నగ్నంగా వచ్చిన కవర్‌పేజీ ఫొటోలపై విమర్శలు గుప్పించటాన్ని సహించలేకపోయింది. వౌనాన్ని వీడి..‘‘నాకు ఇద్దరు పిల్లలు. ఒకరు యువ ప్రాయంలో ఉన్న కుమారుడైతే, మరొకరు 70 ఏళ్లు దాటిన ట్రంప్ మరొకరు. వారిద్దరి ఆలనాపాలనా చూసుకోవటం తప్పా అని సూటిగా ప్రశ్నించి ప్రత్యర్థుల నోళ్లు మూయించింది. అమెరికా ప్రజలకు ఏం కావాలో తన భర్తకు తెలుసు. ప్రజల అభివృద్ధికి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోగలడు. అతని సామర్థ్యంపై విశ్వాసం ఉంది. ఇందుకోసం అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తాను అని భరోసా ఇచ్చింది. భర్త వ్యక్తిత్వంపై మహిళలు ముప్పేటా చేసిన దాడిని తిప్పికొడుతూ.. అదేమీ నాకు ఇబ్బంది కలిగించలేదంటూ -ఎంతోమంది ఇంటికి వస్తూంటారు. ట్రంప్ మగవాళ్లతోనైనా, ఆడవాళ్లతోనైనా ఒకేలా వ్యవహరిస్తాడు, ప్రత్యర్థుల మాటలు జాత్యంహకారాన్ని, అసహ్యాన్ని కలిగించాయని నిరసించింది. స్ర్తి స్వేచ్ఛకు సంబంధించి స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగిన మెలెనియా అమెరికా ప్రథమ పౌరురాలిగా పట్టంగడితే దేశ సంప్రదాయాలకు అనుగుణంగా శే్వతసౌధంలో అడుగుపెడతానటం ఆమె ఆత్మవిశ్వాసానికి, ఆదర్శ భావాలకు ప్రతీక.
యుగస్లేవియాలో జన్మించిన నాలుగు పదుల మెలెనియా సౌందర్యరాశి. అందుకే అందంతో ఐదేళ్ల ప్రాయంలోనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. తల్లి అమాలిజా సైతం ఫ్యాషన్ డిజైనర్. తండ్రి వ్యాపారవేత్త. ఆర్ట్, ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన మెలెనియా క్యాట్‌వాక్, ఫోటోషూట్స్‌కే పరిమితమవ్వకుండా న్యూయార్క్‌ను కేంద్రంగా చేసుకుని గొప్ప మోడల్‌గా పేరు గడించింది.
మ్యాగ్‌జైన్‌కు నగ్నంగా ఫొటో ఫోజులిచ్చిన తొలి అమెరికా ప్రథమ పౌరురాలిగా మెలెనియానే అవుతుంది. ఇప్పటివరకు ఏ ప్రథమ పౌరురాలి ఫొటోలు ఈ విధంగా రాలేదు.
28 ఏళ్ల వయసులో 52 ఏళ్ల ట్రంప్‌తో కిట్‌క్యాట్ క్లబ్‌లో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. ట్రంపే తొలిసారి ఆమెకు ఫోన్ నెంబర్ ఇచ్చి డేటింగ్‌కి ఆహ్వానించాడు. ఎనిమిదేళ్ల సహజీవనం తరువాత 2005లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం సందర్భంగా మెలెనియా ధరించిన వెడ్డింగ్ డ్రెస్స్ ఆనాడు పత్రికలలో పతాక శీర్షికలకు ఎక్కింది. ఆ డ్రెస్స్ ఖరీదు రెండు లక్షల డాలర్లు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలలో మూడు వేల గులాబీ పూలతో అలంకరించిన 50 పౌండ్ల నారింజ కలర్ కేకును ఈ దంపతులు కట్ చేశారు. 2006లో వారికి కుమారుడు పుట్టాడు
ట్రంప్ ఎంత బిజీగా ఉన్న కుమారుడితో కొంత సమయం గడుపుతాడు. ఇంధ్రభవనం వంటి ఆ ఇంట్లో కుమారుడు బ్యారన్‌ను జూనియర్ ట్రంప్ అని పిలుచుకుంటుంది.
ట్రంప్ కుటుంబం
ట్రంప్ మూడు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య ల్వానాకు డోనాల్డ్ జూనియర్ ఎరిక్, కుమార్తె లవంకా ఉన్నారు. రెండవ భార్య మరియ మాప్ల్సెకు ఒక కుమార్తె కలిగారు. అంతేకాదు ట్రంప్‌కు ఎనిమిది మంది మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. అందరూ కూడా ఉన్నత స్థానాల్లో నిలిచారు. ట్రంప్ బిజినెస్ వ్యవహారాలను పిల్లలే చూసుకుంటారు.
మా నాన్న వెన్న..
ట్రంప్ ముఖంలోని హావభావాలు చూస్తే ఇతను బహు కోపిష్టి అని అనిపిస్తాడు. కాని మా నాన్న మాతో చాలా హాస్యంగా..సరదాగా ఉంటాడని కుమార్తె టిఫ్పెన్ ట్రంప్ అంటారు. నా జుట్టును చూసి తన తండ్రి ఎంతో ముచ్చటపడతాడు. నీకు నా జుట్టు రాలేదు. మీ అమ్మ జుట్టు వచ్చిందని ముద్దు చేస్తాడని మురిపెంగా చెబుతోంది. మా తండ్రి చాలా ప్రాక్టికల్ మనిషి అని కూడా కితాబునిస్తుంది. టిఫ్పెన్ ట్రంప్ గాయకురాలు, మోడల్, ఇంటర్నెట్ సెలిబ్రిటీ.
.......................
యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అమెరికా అధ్యక్ష ఎన్నిక పోరులో విజేతగా ఎవరు నిలిచినా అందరి కళ్లు ఆ విజయం వెనుక నిలిచే శక్తి తొలి మహిళపైనే. ఈ సారి అధ్యక్ష ఎన్నికల బరిలో తొలి మహిళా అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ నిలబడి చరిత్ర సృష్టిస్తే..మరో అభ్యర్థి ట్రంప్‌ను 70 ఏళ్ల వయసులో విజేతగా చరిత్రపుటల్లో నిలిపేందుకు అతని భార్య మెలెనియా అందించిన తోడ్పాటు తక్కువేమీ కాదు. భర్త వ్యక్తిత్వంపై ముప్పేట దాడి జరుగుతున్న సమయంలో ఆఖరి క్షణాల్లో అండగా నిలిచి భర్తను ఓటర్లకు చేరువ చేస్తూ రాజనీతిని ప్రదర్శించిన ఈ మగువ తెగువపై ప్రశంసల జల్లే కురిసింది. ఏదిఏమైనప్పటికీ ఈ చారిత్రిక విజయాన్ని సొంతం చేసుకోవటానికి ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించి శే్వతసౌధంలోకి అడుగుపెట్టేందుకు అంతిమ పరీక్ష నెగ్గటంలో ఈ ఇద్దరు మహిళల వ్యక్తిత్వాలు విభిన్నం. ఈ వ్యక్తిత్వానికి మూలాలు వారి జీవితానుభవంలో నుంచి వచ్చినవే.
..............................