బిజినెస్

గ్రామీణ ప్రాంతాల్లో నగదు లభ్యతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన చర్యలు చేపడుతున్నామని, బ్యాంకుల్లో తగినంత నగదు నిల్వలను అందుబాటులో ఉంచుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. గ్రామాల్లో ఎటిఎమ్‌ల సేవలు లేకపోవడంతో ప్రజలు అన్ని అవసరాలకు బ్యాంకులనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకుల్లో నగదు నిల్వలు ఎప్పుడూ ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ‘గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు శాఖలు, 1.55 లక్షల తపాలా శాఖ కార్యాలయాల్లో డిమాండ్‌కు తగ్గ నగదును ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’ అని జైట్లీ స్పష్టం చేశారు. అలాగే 1.2 లక్షల బ్యాంకింగ్ కరస్పాండెంట్ల నెట్‌వర్క్‌ను అధిక నగదు మొత్తాలతో బలపరిచినట్లు పేర్కొన్నారు. కాగా, ఓ గొప్ప ఆశయంతో పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగిందని, ఈ నిర్ణయ ఫలాలు అందనున్న క్రమంలో ప్రజలకు ఎదురవుతున్న కష్టాలను తీర్చేందుకు రాష్ట్రాలు కూడా కేంద్రానికి సహకరించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రజల ఇబ్బందులను తొలగించడానికి బ్యాంకులు, పోస్ట్ఫాసులకు అవసరమైన మద్దతునివ్వాలని జైట్లీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఇదిలావుంటే ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన దీర్ఘకాలిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ ద్వారా 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించేందుకు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐకి దాని బోర్డు ఆమోదం తెలిపినట్లు మరో సమాధానంలో జైట్లీ చెప్పారు. చౌక విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య 20,468 కోట్ల రూపాయల విలువైన గృహ రుణాలను ఎస్‌బిఐ మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో 22.63 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) భారత్‌లోకి వచ్చాయని జైట్లీ తెలిపారు. అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 42.45 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ వచ్చిందన్నారు.
85 శాతం ఎటిఎమ్‌లలో కొత్త నోట్లు!
నవంబర్ 30 వరకు దేశంలోని ఎటిఎమ్‌లలో దాదాపు 85 శాతం ఎటిఎమ్‌లు కొత్త నోట్ల పంపిణీకి అనువుగా మారాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ శుక్రవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చెలామణిలోకి తెచ్చినది తెలిసిందే. అయితే ఇవి పాత నోట్ల సైజుతో పోల్చితే భిన్నంగా ఉండటంతో వాటి పంపిణీ ఎటిఎమ్‌ల ద్వారా కష్టసాధ్యమైంది. ఈ క్రమంలో కొత్త నోట్ల పంపిణీకి వీలుగా దేశంలోని సుమారు 85 శాతం ఎటిఎమ్‌లను మార్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. అంతేగాక గ్రామీణ ప్రజల అవసరాల నిమిత్తం గ్రామాల్లో మైక్రో ఎటిఎమ్‌లను ఏర్పాటు చేయాలని బ్యాంకులకు సూచించినట్లూ చెప్పారు. ఇకపోతే ఈ ఏప్రిల్-అక్టోబర్ మధ్య 854 కిలోల బంగారాన్ని కస్టమ్స్ శాఖ సీజ్ చేసినట్లు మంత్రి వివరించారు. విదేశాల నుంచి అక్రమంగా దేశంలోకి బంగారం తెస్తున్నారన్న ఆయన పట్టుబడినదానిలో మయన్మార్, యుఎఇ, థాయిలాం డ్ దేశాల నుంచి వచ్చినది అధికమన్నారు.