మెయిన్ ఫీచర్

హ్యాండ్ బ్యాగ్ వొయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు కాలేజ్ గాళ్స్ సబ్జెక్టుకో నోట్‌బుక్, జామెట్రీ బాక్స్, టిపిన్ బాక్స్, వాటర్ బాటిల్.. ఇలా స్టేషనరీని వెంటేసుకుని కాలేజీకి వెళ్ళేవారు. వీటన్నింటినీ మోసే బ్యాగ్‌ను భుజాలకు తగిలించుకుని భారంగా నడిచేవాళ్ళు. ప్రెజెంట్ ట్రెండ్ మారింది. ఇంటర్ స్టూడెంట్ నుంచి రిటైర్డ్ ఎంప్లారుూ వరకూ అందరూ హ్యాండ్ బ్యాగ్ లేనిదే గడప దాటడంలేదు. వారి వారి అవసరాలకు తగ్గట్టుగా రకరకాల హ్యాండ్ బ్యాగులు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తు న్నాయి. అమ్మాయిలకి అత్య వసరమైన వస్తువుల్లో నేడు హ్యాండ్ బ్యాగ్ ముఖ్యమైనది. ఒకప్పుడు అవసరమైన వస్తువుల్ని మోసిన ఈ బ్యాగులు ఇప్పుడు ఫ్యాషన్‌లో భాగమైపోయాయి. అందుకే ఆడవారిని అంటిపెట్టుకుని ఉంటున్నాయి. ఈ మధ్యన మార్కెట్లో వచ్చిన పోటీతో మహిళల అభిరుచికి అనుగుణంగా వ్యాపారులు స్టయిలిష్ బ్యాగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. చూడటానికి ఆకర్షణీయంగా కనపడుతుండటంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్‌డేట్ అవుతుతున్న డిజైన్లు సైతం రకరకాల మెటీరియల్స్‌తో హ్యాండ్ బ్యాగులు తయారుచేస్తున్నారు. డ్రెస్‌లు డిజైన్ చేసినట్టే హ్యాండ్ బ్యాగులను కూడా కస్టమైజ్డ్‌గా తీసుకొస్తున్నారు. లెదర్ క్లాత్, జ్యూట్ ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల మెటీరియల్స్ వాడు తున్నారు. డబుల్ జిప్, మల్టీ జిప్, క్లచ్‌మోడల్ ఇలా వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ వేటికవే స్పెషల్ లుక్స్‌తో అదర గొడు తున్నాయి. భుజాన్ని అంటి పెట్టుకొని ఉంటూ వారి అవ సరాలన్నీ తీర్చే నేస్తం హ్యాండ్ బ్యాగ్. మనీ, మొబైల్ ఫోన్, కాస్మొటిక్స్, జ్యువెలరీ, హెయిర్ బ్రెష్- ఇలా అనేక రకాల వస్తువుల్ని బ్యాగు అపురూపంగా మోస్తుంది. అందుకే మార్కెట్‌లోకి కొత్త మోడల్ రాగానే మహిళలు సొంతం చేసుకుంటారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్త కొత్త మోడల్స్‌ను ఫ్యాషన్ డిజైనర్లు విడుదల చేస్తున్నారు. జిపిఎస్ టెక్నాలజీని కూడా హ్యాండ్ బ్యాగులకు అడాప్ట్ చేస్తున్నారు. ఇలా లేటెస్ట్ టెక్నాలజీతో ముస్తాబైన హ్యాండ్ బ్యాగులు మార్కెట్‌లో అదరగొడుతున్నాయి.

-టి.వి.మూర్తి