మెయిన్ ఫీచర్

అస్సాం రైఫిల్స్‌లో సరికొత్త ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మయన్మార్‌కు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతం కావటం వల్ల ఇక్కడ కాపలా కాయటం సైనికులకు కత్తిమీద సాములాంటిది. అలాంటి ఈ సైనిక విభాగంలోకి 2014లో మహిళలు నియమించబడ్డారు. వీరు శిక్షణ తీసుకుని తమ సత్తా చాటుతున్నారు.

జాతీయ భద్రతా సైనిక దళాల విభాగంలో రిపబ్లిక్‌డే నాడు సరికొత్త ఆవిష్కరణకు నాంది పలుకుతున్నారు ఈ మహిళా సైనిక దళాలు. దేశంలోనే తొలిసారి జాతీయ భద్రతా విభాగంలోని మహిళా సైనికులు నాగాలాండ్‌లో జరిగే రిపబ్లిక్ వేడుకలలో కవాతు చేసేందుకు శిక్షణ తీసుకున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోమ్మంటూ వారు నిరూపిస్తూ చరిత్ర లిఖిస్తున్నారు. అస్సాం రైఫిల్స్ విభాగం నుంచి 38 మంది ఎంపికయ్యారు. అస్సాం రైఫిల్స్ విభాగంలోకి మహిళలను అసలు ఎంపికచేసేవారు కాదు. 180 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వివక్ష సంకెళ్లను తెంచుకుని వంద మంది మహిళలు 2014లో ఎంపికచేశారు. వీరంతా పురుషులతో సమానంగా ఎలాంటి బెరుకు భయం లేకుండా కఠోర శిక్షణ తీసుకున్నారు.
బ్రిటిష్ కాలం నుంచే ఉండేది..
అస్సాం టీ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడకు బ్రిటిషు అధికారులు విడిది కోసం వస్తుండేవారు. అహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించటానికి వచ్చే బ్రిటిషు అధికారులపై స్థానిక గిరిజనుల ఆధ్వర్యంలో దాడులు జరిగేవి. దీంతో తమ రక్షణార్థం వారు సైనిక బలగాలను 1835లో ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఆనాడు బలవంతంగా పన్ను వసూళ్లకు పాల్పడేవారు. తదనంతరం ఈ సైనిక బలగాలనే అస్సాం మిలటరీ పోలీసులుగా 1891లో పిలిచేవారు. చివరగా ఇక్కడ జరుగుతున్న సంఘ విద్రోహా శక్తులను అణిచివేసేందుకు 1913లో అస్సాం రైఫిల్స్ సైనిక విభాగాన్ని ఏర్పాటుచేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఇక్కడ 46 బెటాలియన్స్ పనిచేస్తున్నాయి. ఈ బెటాలియన్‌లలో పురుషులే ఉండేవారు. మయన్మార్‌కు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతం కావటం వల్ల ఇక్కడ కాపలా కాయటం సైనికులకు కత్తిమీద సాములాంటిది. అలాంటి ఈ సైనిక విభాగంలోకి 2014లో మహిళలు నియమించబడ్డారు. వీరు శిక్షణ తీసుకుని తమ సత్తా చాటుతున్నారు. ఇపుడు వీరికి నాగాలాండ్ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొని కవాతు చేసే అవకాశం దక్కింది. ఇందులో కూడా తమ శక్తిసామర్థ్యాలను చూపుతామంటున్నారు.