మెయిన్ ఫీచర్

విశాఖ గిరిజన పల్లెల్లో వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా ఇప్పటికీ బల్బు ఎలా వుంటుందో తెలియని అడవిబిడ్డలు ఎందరో ఉన్నారు. పొద్దుగూకగానే చిమ్మచీకటిలో ముడుచుకుంటారు. ఇలాంటి పల్లెలు విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఎన్నో ఉన్నాయి. ఒడిశాకు ఆనుకుని ఉండే ఈ మండలంలో గ్రామాలన్నీ చాలా చిన్నవి. అక్కడో ఊరు..ఇక్కడో ఊరు అనట్లు విసరేసినట్లు ఉంటాయి. అక్కడో ఊరు...అక్కడో ఊరు.. మధ్యలో అడవి. బండలమీద కమ్మగా పారే సెలయేళ్లు. పోడు వ్యవసాయం. వారాంతపు సంత. అంతకు మించి బాహ్య ప్రపంచంతో వారికుండే అనుబంధం చాలా తక్కువ. కరెంటు లేకపోవడంవల్ల వాళ్ల జీవితంలో సగం రోజులు చీకట్లోనే మగ్గుతున్నాయి. వాళ్ల జీవితంలో సగం రోజులు చీకట్లోనే మగ్గుతుంటాయి. సూర్యుడే వారికి వెలుతురు. కరెంటు లేని కారణంగా పిల్లల చదువులు సైతం ఇక్కడ పడకేస్తాయి. ఒక్కొక్క పల్లెలో 25 నుంచి 75 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఇలాంటి పల్లెల సమస్యకు ఫుయల్ ఏ డ్రీమ్ పరిష్కారం చూపింది. క్రౌడ్ పండింగ్ ద్వారా 3 లక్షల రూపాయలు సేకరించింది. మండలంలోని ఎనిమిది గ్రామాల్లోని 367 కుటుంబాల్లో వెలుగులు నింపాలనే కార్యాన్ని భుజానికెత్తుకుంది. ఢిల్లీకి చెందిన డిలైట్ సోలార్ అనే కంపెనీ సహకారంతోఈ పల్లెల్లో వెలుగులు పంచారు. ప్రజల జీవితాల్లో చేతనైంత వరకు మార్పు తీసుకువస్తున్న ఫుయల్ ఏ డ్రీమ్ వంటి సంస్థను నెలకొల్పిన రంగనాథ్ నిజంగానే అభినందనీయుడు.
chitram...
ఈ గిరిజనులకు నెలకు వచ్చే ఆదాయం రూ.500 నుంచి రూ.1500లు మాత్రమే. ఇందులోనే నెలకు 100 నుంచి 250 రూపాయలు కిరోసిన్ కోసం ఖర్చుచేస్తారు.