మెయిన్ ఫీచర్

అందానికి ఖద్దరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఖద్దరు, కాటన్ వస్త్రాలకు గిరాకీ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, అందాల సమంత కాటన్ వ్రస్తా లకు అంబా సిడర్లుగా మారటంతో వీటి హవా,హంగు అందానికి మెరుగులుదిద్దుతుంది.స్వాతంత్రోద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం చేపట్టడం ద్వారా స్వదేశీ ఖాదీ వస్త్రాల విలువను చాటారు. అప్పట్లో మగ్గాలపై నేతనేసే ఈ వస్త్రాలు.. ఇప్పుడు యంత్రాలపైనా తయారవుతున్నాయి. వేసవి తాపంనుంచి శరీరానికి రక్షణ ఇచ్చే దుస్తు ల్లో ఖద్దరు వస్త్రాలకు మించింది లేదు. అందుకే వేసవిలో ఖద్దరు దుస్తులకు ఎనలేని గిరాకీ పెరుగుతోంది. గతంలో పెద్దలు మాత్రమే వినియోగించే ఖద్దరు దుస్తులు ప్రస్తుతం వివిధ రంగు ల్లో,ఆధునిక డిజైన్లలో వస్తుండడంతో పిల్లలు, యువత, మహిళలు ఖద్దరుకు ప్రాధాన్యమిస్తున్నా రు. వాటిని ఎంచుకుంటే ఆ అందమే వేరు అని అం టున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖద్దరు ధరించని వారుండరు. జబ్బల బనియన్లు, తెల్లని పంచెలు కట్టుకుని సంప్రదాయానికి ప్రతీకగా వుంటారు. ముఖ్యంగా వేడిని గ్రహించని తెలుపు రంగు ఖద్దరుకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. చెమటను పీల్చ డం, శరీరానికి చల్లదనం ఇవ్వడం వంటి గుణాలుండడంవల్ల ఖద్దరు వస్త్రాల అలవాటు వ్యసనంగా మారుతుందని పెద్దలు చెపుతుంటారు.
కాటన్ చీరలకూ డిమాండ్
వేసవిలో శరీర ఉష్ణోగ్రతలను అదుపులో వుంచే కాటన్ చీరలకూ డిమాండ్ పెరిగింది. తక్కువ ధరల్లో ఉండే కాటన్ చీరల కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కాటన్ చొక్కాలు, ప్యాంట్లు, చుడీదార్లకు డిమాండ్ పెరుగుతోంది. హాయనిచ్చే నూలు చీరలకే మనసు మళ్లుతుంది. ఆకట్టుకునే వర్ణా ల్లో..అద్భుతమైన అంచుల్లో ఈ చీరలు మగువల మనసు దోచుకుంటున్నాయ.
వేసవిలోనే కాదు ఏ కాలంలోనైనా ఖద్దరు దుస్తులకు వున్న ప్రత్యేకత ఇతరవాటికి ఉండదు. చలి కాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగాను వుండడంతో ఆయా కాలాల్లో శారీరక రుగ్మతలు రావు. ఖద్దరులో ఇప్పుడు ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. తెల్లని ఖద్దరు దుస్తులే బాగుంటాయి. శరీరానికి పట్టిన చెమటను పీల్చుకుని శరీర ఉష్ణోగ్రత పెరగకుండా ఖద్దరు సమతుల్యం చేస్తుంది.

- నీలిమ సబ్బిశెట్టి