మెయిన్ ఫీచర్

ఉద్యానవనాల్లో ఉల్లాసంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిప్పులు చెరిగే వేసవి ఎండలు, సెలవులు.. ఇక చెప్పేదేముంది.. పిల్లలకు కాలక్షేపానికైనా, ఉపశమనానికైనా పార్క్‌లే శరణ్యం. అసలే పిల్లలు, ఆపై ఉద్యావనంలో ఆట వస్తువులు, ఆహ్లాదపరిచే వాటర్ ఫౌంటెన్‌లు, మ్యూజిక్ థీమ్స్, తినుబండారాలు.. వారి ఆటపాటలకి, అల్లరికి అంతేముంటుంది. పిల్లలతో కలిసి పార్క్‌లకు వెళ్ళటం అందరికీ సరదాయే. వారిని అదుపులో పెట్టకపోతే అనార్థలు అనేకం జరుగుతాయ. పిల్లల ఆటవస్తువులు, పరికరాలు.. ఇప్పుడు పార్కులు, సెంటర్లు, స్కూళ్ళతోపాటు సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, హోటల్స్‌లో సైతం ఏర్పాటు చేస్తున్నారు.
ఆటస్థలాలు, పార్కుల్లో పిల్లలను ఒక కంట కనిపెడుతూ వుండాలి. వారు ఊగుతున్న, ఎక్కుతున్న, ఎగిరి దూకుతున్న, జారుతున్న.. ఉయ్యాల, క్లైంబర్, ల్యాడర్, మంకీ బార్స్, జారుడుబండ... లాంటి పరికరాలను సరిగ్గా ఉన్నాయా ముందుగా చూడాలి. మనం జాగ్రత్తపడడంతోపాటూ, ఇలాంటి లోపాలను సంబంధిత అధికారులకు వెంటనే తెలియచేయడం మరవద్దు. విసరడం, తోయడం, లాగడం.. లాంటి ఆటలకు ప్రావీణ్యత అవసరం. ఇలాంటివి పిల్లలకు అపాయం కాబట్టి అక్కడే వున్న నిపుణుల సహాయం కోరడం మంచిది. దుస్తుల విషయంలోనూ తగు జాగ్రత్తలవసరం. పిల్లలు ఆడుకోవడానికి అనువుగా దుస్తుల ఎంపిక వుండాలి. విపరీతమైన వదులు దుస్తులు లేదా వాటికి వేళ్లాడే తాడ్లు ప్రమాదకరం. కాళ్లకు సరియైన షూ లు తప్పనిసరి. ఇక చంటిపిల్లల ఆటలు, పెద్ద పిల్లల ఆటలతో వేరుగా ఉంటాయి. అందుకనే ఐదేళ్ల లోపు పిల్లలను వేరే స్థలంలో ఆడించటమే సరైన పద్ధతి. ఇందుకోసం పిల్లల వయసుని బట్టి ముందుగానే ఏ పార్క్‌కి తీసుకెళ్లాలో నిర్ణయించుకోవాలి. అక్కడ సౌకర్యలు, భద్రత వంటి అంశా లు పరిగణనలోకి తీసుకోవాలి.
పిల్లలకు కావలసిన రీతిలో వారిని ఆడుకోనిస్తే తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటుంది. పార్క్‌లో చిన్నపిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. వీరికోసమని ప్రత్యేకంగా ఆట పరికరాలు ఉంటాయి. అక్కడి మొక్కల, చెట్ల ఆకులు, పూలు, కాయలు.. నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలి. మట్టి, ఇసుకలో ఆడుకునే చిన్నారులను రోగకారకాలైన బ్యాక్టీరియా బారిన పడకుండా తగు జాగ్రత్తలవసరం. వీరు ఆడుకునే స్థలంలో నిశితంగా పరీక్షించి చీమలు, దోమలు, పురుగులు లేవని నిర్థారించుకోవాలి.
పిల్లలకు ఆకలి, దప్పికలను తీర్చగలం. సాయంత్రాలు కూ డా వేడిగా ఉండడంతో పార్క్ లో కూర్చునే బల్లలు, ఆడుకునే వస్తువులు ఇంకా కాలుతూనే వుంటాయి. అందుకని కూర్చోవడానికి ఏదైనా క్లాత్ తీసుకెళ్లాలి. అలాగే పిల్లలు ఆయా వస్తువులను ముట్టుకునే ముందే వాటిని గమనించాలి. గార్డెన్‌లో వాటర్ స్ప్రింక్లింగ్ సిస్టమ్, విద్యుత్ వైర్లు, పరికరాల జోలికి పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి.
అపరిచితులు ఇచ్చిన ఆహారం తీసుకోవడం, మోసపూరితంగా దగ్గరవ్వాలనుకునేవారితో జాగ్రత్తగా వ్యవహరించడం పిల్లలకు నేర్పించాలి. ఒక కాగితంపై పిల్లలు వారికి అందుబాటులో వున్న పెద్దవారి పేర్లు, మొబైల్ నంబరుతో కూడిన చిరునామాను రాసి వారి జేబుల్లో ఉంచాలి. పార్క్‌లో ఆడుకుంటూ ఎంత జాగ్రత్తపడినా తప్పిపోతే మళ్లీ ఎలా కలుసుకోవాలో చెప్పాలి. కొన్ని పార్క్‌ల ఎంట్రీతోపాటూ లోపల ప్రతీదానికి టికెట్లని క్యూలు కట్టక తప్పదు. ఈ సమయంలో పిల్లలు అసహనానికి లోనుకాకుం డా చూసుకోవాలి. అలాగే వారికి ఇష్టం లేని ఆటలు అని, ఫుడ్ అని బలవంతంగా రుద్దకూడదు.
చిన్న చిన్న విందుల ను ముందస్తు అనుమతులతో పార్క్‌లో ఏర్పాటుచేయడంవల్ల పిల్లల ఆనందాలు రెట్టింపవుతాయి. అలాగే పార్క్‌లో ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయకుండా పిల్లలకు పరిసరాల పరిశుభ్రతని పాటించడం అలవాటు చేయాలి.

పిల్లల పట్ల
తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పిల్లల్లో సహజసిద్ధంగా 50శాతం నీరు వుంటుంది. మిగిలిన నీటి శాతాన్ని అందించటానికి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాలంలో లభించే నీటిలో ఎక్కువగా బాక్టీరియా వృద్ధిచెందుతుంది. దీని వల్ల కామెర్లు, టైఫాయిడ్, కలరా తదితరమైనవి రావచ్చని పిల్లల వైద్యులు అంటున్నారు. పిల్లలు సమ్మర్ క్యాంప్‌ల్లోగానీ, ఇతర ఔట్‌డోర్ గేమ్స్‌లో పాల్గొనేటపుడు తప్పనిసరిగా ఇంటి నుంచే నీటిని తీసుకువెళ్లాలి. కాచి చల్లార్చిన నీటిని చల్లగా అయ్యేటట్లు చేసుకుని తాగాలి. స్పైసీ ఐటెమ్స్, ఫ్రైడ్‌రైస్, రోడ్డు పక్కన దుకాణాలలో దొరికే చౌకబారు తినుబండారాల నుంచి పిల్లలను దూరంగా ఉంచటం తల్లిదండ్రులకు ఎంతో మంచిదని పిల్లల వైద్య నిపుణులు నెమినాథన్ అంటున్నారు. తాజా పళ్లను, కూరగాయలను, సూప్స్, ఫ్రెష్ జ్యూస్‌లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పెట్టాలి. ఏ కాలంలోనైనా పరిశుభ్రత ఎంతో మంచిందంటారు. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిశుభ్రతే ప్రధాన కారణమని చెబుతున్నారు. రోడ్డు పక్కన ఉండే తినుబండరాలలోనూ, అలాగే చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని తీసుకోవటం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయని, చికెన్‌ఫాక్స్ వ్యాపించే అవకాశం లేకపోలేదు. అన్నింటికంటే ముఖ్యంగా సాధ్యమైనంత వరకు ఎండవేళల్లో బయట తిరగకపోవటమే మంచిది.

వైద్యులు ఇస్తున్న సలహాలు

-పిల్లలతో బయటకు వెళ్లేటపుడు తప్పనిసరిగా ఎక్కువగా నీరు తీసుకోవాలి. చెమట వల్ల సోడియం శాతం శరీరంలో ఎక్కువగా ఖర్చవుతోంది. కాబట్టి సోడియంను శరీరానికి అందించాలంటే పుచ్చకాయ, యాపిల్, దోసకాయ తదితర పండ్లరసాలను తీసుకుంటే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ వేసవికాలంలో పుచ్చకాయ మంచి ఆహారం. తలకు క్యాప్ ధరిస్తే మంచిది. సన్‌గ్లాసెస్, వాహనదారులైతే హెల్మెట్ పెట్టుకుంటే వేసవి నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

- హర్షిత