బిజినెస్

తగ్గిన విప్రో లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు/న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ విప్రో లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో నిరుడుతో పోల్చితే 7.6 శాతం పడిపోయి 2,070.4 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు శుక్రవారం సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి జతిన్ దలాల్ ఓ ప్రకటనలో చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో సంస్థ లాభం 2,241 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఆదాయం మాత్రం 10.5 శాతం పెరిగి ఈసారి 13,897 కోట్ల రూపాయలుగా ఉంది. క్రిందటిసారి 12,567 కోట్ల రూపాయలుగానే నమోదైంది. కాగా, ప్రస్తుత త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్‌లో సంస్థ ఆదాయం 1,916 మిలియన్ డాలర్ల నుంచి 1,955 మిలియన్ డాలర్ల మధ్య నమోదు కాగలదని విప్రో ఈ సందర్భంగా అంచనా వేసింది. నిజానికి ఈ జూలై-సెప్టెంబర్‌లో సంస్థ ఆదాయం 1,931 మిలియన్ డాలర్ల నుంచి 1,950 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని విప్రో అంచనా వేయగా, 1,916 మిలియన్ డాలర్లకే అది పరిమితమైంది. అయితే తక్కువ పనిదినాలు, సిబ్బంది సెలవులు, ఐటి సేవలకు డిమాండ్ లేకపోవడం వంటివి సంస్థ ఆదాయాన్ని దెబ్బతీశాయని సంస్థ అభిప్రాయపడింది.
ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్
ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్‌లో 23.2 శాతం పెరిగి 684.31 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) సంస్థ లాభం 555.54 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఆదాయం ఈసారి 2,874.95 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,245.72 కోట్ల రూపాయలుగా ఉంది.

జాతీయ రోమింగ్‌పై వొడాఫోన్ ఉచిత ఇన్‌కమింగ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఉచిత ఫోన్ కాల్ ఆఫర్‌కు పోటీగా ఈ దీపావళి (అక్టోబర్ 30) నుంచి జాతీయ రోమింగ్‌పై తమ కస్టమర్లందరికీ ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌ను ప్రకటించింది వొడాఫోన్ ఇండియా. దేశంలో తమ స్వస్థలాలను వీడి ప్రయాణించేవారికి మరో ఆలోచన లేకుండా జాతీయ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, ప్రస్తుతం జరుగుతున్న 200 మిలియన్ కస్టమర్ సెలబ్రేషన్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను ఇస్తున్నామని వొడాఫోన్ ఇండియా కమర్షియల్ డైరెక్టర్ సందీప్ కటారియా ఓ ప్రకటనలో తెలిపారు.