బిజినెస్

రిటైల్ ఎల్‌పిజిలోకి రిలయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్).. ఎల్‌పిజి (వంటగ్యాస్) రిటైల్ రంగంలోకి ప్రవేశించింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి వ్యవస్థను కలిగి ఉన్న ఆర్‌ఐఎల్.. 4 కిలోల ఎల్‌పిజి సిలిండర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అయితే పైలట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత 4 జిల్లాల్లోనే ఈ 4 కిలోల ఎల్‌పిజి సిలిండర్ల సరఫరాను ప్రారంభించింది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక ఫలితాల సందర్భంగా నిర్వహించిన ఓ సమావేశంలో రిలయన్స్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎల్‌పిజి వినియోగం 10 శాతం పెరిగిన నేపథ్యంలో రిలయన్స్‌తోపాటు ఎస్సార్ ఆయిల్ కూడా ఎల్‌పిజిపై దృష్టి సారించాయి. ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) సంస్థలే ఎల్‌పిజి రిటైల్ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. 5 కిలోలు, 14.2 కిలోలతో గృహవసరాలకు వంటగ్యాస్‌ను సరఫరా చేస్తున్న ఈ సంస్థలు.. 19 కిలోలతో వాణిజ్య అవసరాలకూ అందిస్తున్నాయి. వీటిలో సబ్సిడీ ధరకు ఏడాదికి 14.2 కిలోల సిలిండర్లు 12, 5 కిలోల సిలిండర్లను 34 ఇస్తున్నాయి. ఈ పరిమితి దాటితే మార్కెట్ ధరను వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్‌రంగ సంస్థలున్నా సిలిండర్లను మార్కెట్ ధరకే అమ్ముతున్నాయి. అయితే 10 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్నవారికి వంటగ్యాస్ సబ్సిడీ వర్తించదన్న ప్రభుత్వ నిర్ణయం, సబ్సిడీ సిలిండర్ ధర, సబ్సిడీయేతర సిలిండర్ ధరకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో ప్రైవేట్‌రంగ సంస్థలు కూడా ఎల్‌పిజి మార్కెట్‌లోకి ప్రవేశించాలని చూస్తున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్ ధర 427 రూపాయలుగా ఉంటే, సబ్సిడీయేతర సిలిండర్ ధర 490 రూపాయలుగా ఉంది. గతంలో ఈ తేడా 400-500 రూపాయలుగా ఉండటం గమనార్హం. తమ ప్లాంట్లలో ఉత్పత్తి చేసిన ఎల్‌పిజిలో 1.2 లక్షల టన్నుల వరకు ప్రైవేట్ వంటగ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు అమ్ముకోవచ్చని నిరుడు రిలయన్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే 4 కిలోల వంటగ్యాస్ సిలిండర్లతో రిలయన్స్ రంగంలోకి దిగింది.

‘రూ. 5.63 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయ్’

ఇండోర్, అక్టోబర్ 23: రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ మదుపరుల సదస్సులో వివిధ రంగాలకు సంబంధించి 5.63 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను అందుకున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం తెలిపారు. ప్రపంచంలోనే వ్యాపారానికి అత్యంత అనువైనదిగా మధ్యప్రదేశ్‌ను చేస్తామని ఆయన వాగ్దానం చేశారు. మదుపరులకు అన్నివిధాలా సహకరిస్తామని, ప్రభుత్వం నుంచి కావాల్సిన మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. శనివారం మొదలైన ఈ సదస్సులో 2,600లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు చౌహాన్ పేర్కొన్నారు.