బిజినెస్

8 శాతం వృద్ధిని అందుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఈ ఆర్థిక సంవత్సరాని (2016-17)కి దేశ ఆర్థిక వృద్ధిరేటు 8 శాతంగా నమోదు కాగలదని కేంద్ర ఆర్థిక, కార్పోరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సు-2016కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేఘ్వాల్ ప్రసంగిస్తూ వ్యవసాయ రంగంలో 4 శాతానికిపైగా వృద్ధిరేటును అంచనా వేశారు. ఆసియా దేశాల్లో చైనా గత 20 సంవత్సరాలుగా 8 శాతం వృద్ధిరేటును అందుకుంటోందని, అయతే ఇప్పుడు అక్కడ కొంత క్షీణతను చూస్తున్నా మన్నారు. కానీ భారత్ నెమ్మదిగా తన వృద్ధిరేటును పెంచుకుంటోందని, నిరుడు 7 శాతం వద్దనున్న దేశ జిడిపి.. ఈసారి 8 శాతం దిశగా పరుగులు పెడుతోందన్నారు. తప్పక లక్ష్యాన్ని చేధిస్తుందన్నారు. బలమైన భారత దేశ నాయకత్వాన 21వ శతాబ్దం ఆసియాదే అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన కనబరిచారు. 21వ శతాబ్దం ఆసియాదేనని లోగడ పాశ్చాత్య దేశాలు, పలువురు ఆర్థిక రంగ నిపుణులు చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆఫ్రికా దేశాలు కూడా 6 లేదా 7 శాతానికి మించి జిడిపి వృద్ధి సాధించలేదని చెప్పారు. ప్రపంచానికి నాయకత్వం వహించగలిగే శక్తి, సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని అన్నారు. కాగా, కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత మంత్రులపైగానీ, ప్రభుత్వంపైగానీ ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని స్పష్టం చేశారు.