బిజినెస్

ఎయిర్‌టెల్ విదేశీ రోమింగ్ ప్యాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం, ప్రైవేట్‌రంగ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ బుధవారం ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్‌తో విదేశీ రోమింగ్ పథకాలను ప్రారంభించింది. 1,199 రూపాయల ప్రారంభ ధరతో మొదలయ్యే 10 రోజుల అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్‌తో మొబైల్ ఇంటర్నెట్ ధరలు 99 శాతం వరకు తగ్గుతుండటం గమనార్హం. మెగాబైట్ 3 రూపాయలకే లభించనుంది. అంతకుముందు దీని ధర 650 రూపాయలు. సింగపూర్, థాయిలాండ్ ప్రయాణికుల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంలో అపరిమిత ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, 2జిబి డేటా, భారత్‌కు 250 నిమిషాల ఉచిత కాలింగ్, రోజు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు వినియోగదారులకు లభిస్తాయని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా, ఇవే ఆఫర్లతో అమెరికా, కెనడా, బ్రిటన్, యుఎఇ ప్రయాణికుల కోసం కూడా ఎయిర్‌టెల్ 2,999 రూపాయలతో అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. నిర్ణీత 2జిబి డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఒక మెగాబైట్ డేటాకు 3 రూపాయలను చార్జ్ చేస్తామని సంస్థ తెలిపింది.

మార్కెట్‌కు ఎన్‌పిఎ సెగ

సెనె్సక్స్ 255 పాయింట్లు పతనం

ముంబయి, అక్టోబర్ 26: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై- సెప్టెంబర్)గాను యాక్సిస్ బ్యాంక్ లాభం మొండి బకాయిల (ఎన్‌పిఎ) కారణంగా పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభానికీ నిరర్థక ఆస్తుల సెగ తాకడం మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేసింది. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 254.91 పాయింట్లు పడిపోయి 27,836.51 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 76.05 పాయింట్లు దిగజారి 8,615.25 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ షేర్లతోపాటు మెటల్, ఇన్‌ఫ్రా, హెల్త్‌కేర్ షేర్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా సూచీలు నష్టపోగా, జపాన్ సూచీ మాత్రం పెరిగింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు నష్టాల్లో కదలాడాయి.