బిజినెస్

వ్యాపార నిర్వహణలో మెరుగవ్వని భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: వ్యాపారానికి అత్యుత్తమ దేశాల జాబితాను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఈ జాబితాలో భారత్‌కు 130వ స్థానం లభించగా, నిరుడు 131వ స్థానంలో ఉంది. దీంతో జాబితాపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వమేకాదు, దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ విషయంలో నిరాశకు గురైందని, నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు, విధానాలు దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేశాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పెద్ద దేశం కాబట్టి కొన్ని సంస్కరణల ప్రభావం నెమ్మదిగా ఉంటుందన్న ఆమె కారణం ఏదైనా తాజా ప్రపంచ బ్యాంక్ జాబితాలో భారత్ స్థానం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సిఇపి)లో ప్రగతిని సమీక్షించడానికి వచ్చే నెలారంభంలో భారత్‌సహా చైనా, జపాన్ తదితర 16 దేశాల వాణిజ్య మంత్రులు సమావేశం కానున్నారని సీతారామన్ తెలిపారు.
ఇదిలావుంటే క్షేత్రస్థాయిలో వచ్చిన మార్పులను ప్రపంచ బ్యాంక్ జాబితాలో భారత్ స్థానం ప్రతిబింబించడం లేదని పారిశ్రామిక సంఘాలు సిఐఐ, అసోచామ్ పెదవి విరిచాయి. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర కీలక సంస్కరణలు పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా, అగ్రస్థానంలో న్యూజిలాండ్ ఉండగా, తర్వాతి రెండు స్థానాల్లో సింగపూర్, డెన్మార్క్ ఉన్నాయి. చైనా ఐదో స్థానంలో, బ్రిటన్ 7, అమెరికా 8 స్థానాల్లో నిలిచాయ. మరోవైపు మైనారిటీ మదుపరుల రక్షణలో భారత్ 13వ స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ తాజా జాబితా స్పష్టం చేసింది.

నాణ్యత, పోటీతత్వంపై రాజీవద్దు

సిఐఐ తెలంగాణ చైర్మన్ నృపేందరరావు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 26: సిఐఐ తెలంగాణ విభాగం బుధవారం ఇక్కడ వస్తు ఉత్పత్తి, తయారీలో నాణ్యతపై పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ మొదటి బహుమతి, సినర్జీ క్వాలిటీ సర్కిల్ టీం రెండవ బహుమతి, విక్టరీ క్వాలిటీ సర్కిల్ టీం మూడవ బహుమతిని గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా సిఐఐ తెలంగాణ చైర్మన్ నృపేందర రావు మాట్లాడుతూ, తయారీ రంగలో నాణ్యత ఉంటేనే వినియోగదారులను ఆకట్టుకుంటామన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని సంస్థలు నాణ్యమైన సేవలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హైదరాబాద్ క్వాలిటీ విభాగం మాజీ డైరెక్టర్ బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోటీతత్వంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సంస్థలు పెంపొందించుకోవాలన్నారు.