బిజినెస్

‘సంవత్ 2072’కు లాభాల కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ‘సంవత్ 2072’ సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్నాయి. నిరుడు దీపావళి నుంచి మొదలైన ఏడాది కాలంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 2,198.25 పాయింట్లు ఎగిసింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 854.65 పాయింట్లు ఎగబాకింది. ‘సంవత్ 2071’లో మదుపరులు అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోవడంతో సెనె్సక్స్ 1,043.97 పాయింట్లు పతనమై 25,743.26 వద్ద ముగిస్తే, నిఫ్టీ 212.55 పాయింట్లు దిగజారి 7,783.35 వద్ద నిలిచింది. అయితే ‘సంవత్ 2072’లో మాత్రం మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేశారు. ఫలితంగానే సెనె్సక్స్ 8.53 శాతం, నిఫ్టీ 10.98 శాతం పెరిగాయి. ఇకపోతే ప్రస్తుత ‘సంవత్ 2072’ సంవత్సరంలో చివరి రోజైన శుక్రవారం జరిగిన ట్రేడింగ్ విషయానికొస్తే స్టాక్ మార్కెట్లు లాభాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి. సెనె్సక్స్ 25.61 పాయింట్లు పెరిగి 27,941.51 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 22.75 పాయింట్లు అందుకుని 8,638 వద్ద నిలిచింది. ‘సైరస్ మిస్ర్తి ఉద్వాసన వ్యవహారం’ నేపథ్యంలో గత మూడు రోజులుగా నష్టాల్లో కదలాడుతున్న టాటా గ్రూప్ షేర్లు.. మళ్లీ మదుపరులను ఆకట్టుకున్నాయి. దీంతో సూచీలు లాభాలను సంతరించుకోగలిగాయి. కాగా, ‘సంవత్ 2071’ చివరి రోజున సెనె్సక్స్ 378.14 పాయింట్లు, నిఫ్టీ 131.85 పాయింట్లు క్షీణించాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా చూస్తే సెనె్సక్స్ 135.67 పాయింట్లు, నిఫ్టీ 55.05 పాయింట్లు పడిపోయాయి. టాటా సన్స్ సంక్షోభం ప్రధాన కారణమని మార్కెట్ విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా చూసినట్లైతే ఆసియా మార్కెట్లలో జపాన్ మినహా మిగతా సూచీలు నష్టపోయాయి. హాంకాంగ్, చైనా, సింగపూర్ సూచీలు 0.26 శాతం నుంచి 0.77 శాతం పడిపోయాయి. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, జర్మనీ సూచీలు నష్టపోతే, ఫ్రాన్స్ సూచీ లాభపడింది.
రేపు మూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ఆదివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లలో ‘మూరత్ ట్రేడింగ్’ జరగనుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య గంటపాటు ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించనున్నారు. స్టాక్ మార్కెట్లలో యేటా దీపావళి రోజున ‘మూరత్ ట్రేడింగ్’ జరగడం ఆనవాయితీ.
సోమవారం మార్కెట్లకు సెలవు
‘దీపావళి బలిప్రతిపద’ను పురస్కరించుకుని సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. తిరిగి మంగళవారం ట్రేడింగ్ కార్యకలాపాలు సాధారణంగా జరుగుతాయని బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ వర్గాలు వెల్లడించాయి. దీపావళి పర్వదినం మరుసటి రోజును ‘బలిప్రతిపద’గా స్టాక్ మార్కెట్లు పాటిస్తాయి.

లాభాల్లోకి టాటా గ్రూప్ షేర్లు

టాటా గ్రూప్ షేర్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని ఆకస్మికంగా తొలగించిన దగ్గర్నుంచి టాటా గ్రూప్ షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి నష్టాలకే పరిమితమైన వివిధ టాటా గ్రూప్ సంస్థలు 6 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. టాటా మోటార్స్ షేర్ విలువ 2.68 శాతం, టాటా స్టీల్ 1.85 శాతం, టాటా మెటాలిక్స్ 5.86 శాతం, టాటా ఎగ్జి 4.20 శాతం, టాటా టెలీసర్వీసెస్ 3.93 శాతం, టాటా కాఫీ 2.02 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 1.35 శాతం, టాటా ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ 1.32 శాతం, టాటా గ్లోబల్ బేవరేజెస్ 1.20 శాతం, టాటా కెమికల్స్ షేర్ విలువ 0.87 శాతం చొప్పున పుంజుకున్నాయి. అయితే టాటా పవర్ షేర్ విలువ మాత్రం 1.38 శాతం, టిసిఎస్ షేర్ విలువ 0.58 శాతం మేర నష్టపోయాయి. మిస్ర్తికి ఉద్వాసన నేపథ్యంలో గత మూడు రోజుల్లో టాటా గ్రూప్ షేర్ల నష్టాలు 26 వేల కోట్ల రూపాయలకుపైగా ఉండటం గమనార్హం.