బిజినెస్

ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, నవంబర్ 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో సింగరేణి ఎదురీదుతోంది. అక్టోబర్‌తో ముగిసిన గడచిన ఏడు మాసాల్లో 3 కోట్ల 46 లక్షల 37,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగాను 3 కోట్ల 8 లక్షల 83,694 టన్నులు సాధించి 89 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. కొత్తగూడెం ఏరియా మినహా మిగిలిన 10 ఏరియాలు బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో వెనుకంజలో ఉన్నాయి. ఏరియాల వారీగా చూస్తే కొత్తగూడెం ఏరియా 46 లక్షల 28,100 టన్నులకుగాను 46 లక్షల 68,985 టన్నులు సాధించి 101 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. తర్వాత రామగుండం-3 ఏరియా 34 లక్షల 50 వేల టన్నులకు 34 లక్షల 20,661 టన్నులు సాధించి 99 శాతం, బెల్లంపల్లి ఏరియా 34 లక్షల 60 వేల టన్నులకు 32 లక్షల 23,151 టన్నులు సాధించి 93 శాతం, భూపాలపల్లి ఏరియా 18 లక్షల 92,900 టన్నులకు 17 లక్షల 33,454 టన్నులు సాధించి 92 శాతం, శ్రీరాంపూర్ ఏరియా 27 లక్షల 36,400 టన్నులకు 24 లక్షల 76,487 టన్నులు సాధించి 91 శాతం, రామగుండం-1 ఏరియా 33 లక్షల 75,100 టన్నులకుగాను 30 లక్షల 53,220 టన్నులు సాధించి 90 శాతం, మణుగూరు ఏరియా 51 లక్షల 20 వేల టన్నులకుగాను 45 లక్షల 12,779 టన్నులు సాధించి 88 శాతం, రామగుండం-2 ఏరియా 36 లక్షల 42,700 టన్నులకు 31 లక్షల 95,771 టన్నులతో 88 శాతం ఉత్పాదక రేట్లను నమోదు చేసుకున్నాయి. అదేవిధంగా ఇల్లెందు ఏరియా 26 లక్షల 71,500 టన్నులకుగాను 21లక్షల 3,204 టన్నులు సాధించి 79 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 15 లక్షల 89,500 టన్నులకు 12 లక్షల 26,362 టన్నులు సాధించి 77 శాతం, మందమర్రి ఏరియా 20 లక్షల 71,300 టన్నులకు 12 లక్షల 69,620 టన్నులు సాధించి 61 శాతం ఉత్పాదక రేట్లను నమోదు చేసుకున్నాయి. మొత్తంగా భూగర్భ గనుల ఉత్పత్తి లక్ష్యం 71 లక్షల 33,700 టన్నులకుగాను 55 లక్షల 1,057 టన్నులు సాధించి 77 శాతం ఉత్పాదక రేటు, ఓపెన్‌కాస్ట్ గనులు 2 కోట్ల 75 లక్షల 3,800 టన్నుల లక్ష్యానికి 2 కోట్ల 53 లక్షల 82,637 టన్నులు సాధించి 92 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకున్నాయి. భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టు గనులు కలిపి సరాసరి 89 శాతం ఉత్పాదక రేటును మాత్రమే నమోదు చేయడం గమనార్హం. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించే ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో అక్టోబర్ నెల ముగిసేనాటికి గడచిన ఏడు మాసాల్లో 89 శాతం మాత్రమే ఉత్పాదక రేటును సింగరేణి సంస్థ సాధించగలిగింది. దీంతో రాబోయే ఐదు నెలల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. డిసెంబర్ మాసాంతానికి జరిగే బొగ్గు ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రోత్సాహకాలను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా ఉత్పత్తి కూడా ఈ ఏప్రిల్-అక్టోబర్‌లో పడిపోయంది. 307 మిలియన్ టన్నులకుగానూ 273.57 మిలియన్ టన్నులకే పరిమితమైంది. ఈ మేరకు మంగళ వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది.

హెచ్‌పిసిఎల్‌లోకి
ఇద్దరు కొత్త డైరెక్టర్లు

విశాఖపట్నం, నవంబర్ 1: ప్రభుత్వరంగ చమురు సంస్థ హెచ్‌పిసిఎల్‌లోకి ఇద్దరు కొత్త డైరెక్టర్లు వచ్చారు. ఆల్ ఇండియా హెచ్‌పి రిఫైనరీస్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఎస్ జయకృష్ణన్, రిఫైనరీస్ డైరెక్టర్‌గా వినోద్ షెనోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన వైకె గవాలి నుంచి జయకృష్ణన్ బాధ్యతలు తీసుకోగా, దీనికి ముందు జయకృష్ణన్ హెచ్‌పిసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్స్)గా పనిచేశారు. 1981లో ఈ సంస్థలో చేరిన జయకృష్ణన్ వివిధ హోదాల్లో ఉన్నారు. ఇక ఇప్పటి వరకూ రిఫైనరీస్ డైరెక్టర్‌గా పనిచేసిన బికె నామ్‌దేవ్ నుంచి వినోద్ షెనాయ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి ముంబైలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన షెనోయ్ 1985లో హెచ్‌పిసిఎల్‌లో చేరారు. షెనోయ్ కూడా ఈ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు.