బిజినెస్

స్వల్పంగా పెరిగిన సబ్సిడీ వంటగ్యాస్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 1: సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధరలు స్వల్పంగా పెరిగాయి. 14.2 కిలోల సిలిండర్ ధరను 2.05 రూపాయల చొప్పున మంగళవారం చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. గడచిన ఐదు నెలల్లో ఈ పెంపు ఆరోసారి అవగా, తాజా పెంపుతో ఢిల్లీలో సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ ధర 430.64 రూపాయలకు చేరింది. ఇంతకుముందు ఇది 428.59 రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే విమానయాన ఇంధనం (ఎటిఎఫ్) ధర కూడా పెరిగింది. కిలో లీటర్ ధర 3,434.25 రూపాయలు పెరిగి 50,260.63 రూపాయలకు చేరింది. అక్టోబర్ 1న కూడా 3.11 శాతం మేర ఎటిఎఫ్ ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెంచాయి. ప్రతి నెలా ఒకటో తేదీన సబ్సిడీ వంటగ్యాస్, ఎటిఎఫ్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సవరిస్తున్నాయ. కాగా, నాన్-సబ్సిడీ వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధరలు కూడా పెరిగాయి. 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరను 38.50 రూపాయలు పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు సోమవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర 529 రూపాయలకు చేరింది. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి. ప్రతి నెలా 15, 31 తేదీల్లో పెట్రోల్, డీజిల్, నాన్ సబ్సిడీ వంట గ్యాస్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా సవరిస్తున్నది తెలిసిందే. పెట్రోల్, డీజిల్ తరహాలోనే వంటగ్యాస్, కిరోసిన్ అమ్మకాలపైనా ప్రభుత్వం సబ్సిడీని ఎత్తివేయాలని నిర్ణయంచింది. ఈ క్రమంలోనే ఎల్‌పిజి, కిరోసిన్ ధరలను నెలనెలా స్వల్పంగా పెంచుతూ పోతోంది. ప్రతి నెలా సబ్సిడీ వంటగ్యాస్ ధరను 2 రూపాయల చొప్పున, లీటర్ కిరోసిన్ ధరను 25 పైసల చొప్పున పెంచుతోంది. మార్కెట్ ధరను చేరేదాకా ఇలా ధరలు పెరుగుతూనే ఉంటాయ. గతంలో డీజిల్ ధరను కూడా లీటర్‌కు 50 పైసల చొప్పున పెంచుతూ సబ్సిడీ నుంచి మినహాయంచినది తెలిసిందే. అంతకు ముందు పెట్రోల్ అమ్మకాలపైనా సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసింది.