బిజినెస్

మార్కెట్‌లో ‘జిఎస్‌టి’ కొనుగోళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న ఆశాభావంతో మదుపరులు పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరిచారు. అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కదలాడినప్పటికీ జిఎస్‌టిపై నెలకొన్న సానుకూల అంచనాలు దేశీయ మార్కెట్లను లాభపరిచాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 169.57 పాయింట్లు పెరిగి 26,128.20 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 58.90 పాయింట్లు లాభపడి 7,942.70 వద్ద స్థిరపడ్డాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ ఆరంభం నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను టీ పార్టీకి ఆహ్వానించారు. ఇది ప్రధానంగా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పిఎస్‌యు, ఐటి, మెటల్, రియల్టీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.