బిజినెస్

విశాఖ పరిధిలో రూ. 3,350 కోట్ల సిండికేట్ బ్యాంక్ లావాదేవీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, నవంబర్ 2: విశాఖ రీజియన్ పరిధిలో ఉన్న అయిదు జిల్లాల్లో 59 సిండికేట్ బ్యాంక్ బ్రాంచీల ద్వారా 3,350 కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ ఎ సాంబిరెడ్డి తెలిపారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకుకు రీజియన్‌లో 59 శాఖలు ఉన్నాయని, అదనంగా మరో 8 బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశామన్నారు. అలాగే టెక్కలి, ఈస్ట్‌కోస్ట్, పార్వతీపురం, విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం, మురళీనగర్‌లో నూతన శాఖలు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లాలో మరో నాలుగు బ్రాంచీలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ఉందన్నారు. 59 బ్రాంచీల ద్వారా 1,940 కోట్ల రూపాయల రుణాలు అందించామని, 1,390 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించామన్నారు.
ఇందులో 1,240 కోట్ల రూపాయలను ప్రాధాన్యత రంగాలకు రుణాలుగా అందించామన్నా రు. 457 కోట్ల రూపాయలను వ్యవసాయ రుణాలుగా మంజూరు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్యాంకు సేవలు విస్తృత పరిచేందుకు కృషి చేస్తున్నామని, సిండికేట్ బ్యాం కు ద్వారా ఎస్సీ, బిసి కార్పొరేషన్లకు రుణాలు, వ్యవసాయ ఆధారిత రుణాలు ఎక్కువగా అందిస్తున్నామన్నారు. సమావేశంలో స్థాని క మేనేజర్ సత్య యశోద, చీఫ్ మేనేజర్లు మూర్తి, సాంబమూర్తి పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సాంబిరెడ్డి