బిజినెస్

6 నెలలు.. 45 వేల టవర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలనాత్మక టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. 4జి సేవల విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు 45,000 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయనుంది. టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హాతో రిలయన్స్ జియో నిర్వహించిన సమావేశంలో తమ నెట్‌వర్క్ తదుపరి బలోపేతానికి 45,000 టవర్లను ఏర్పాటు చేస్తామని జియో తెలిపింది. నాలుగేళ్ల వ్యవధికిగాను లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్న జియో.. కొత్త టవర్లనూ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఓ అధికారి పిటిఐకి తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ నుంచి వెలువడలేదు. కాగా, ఇప్పటికే నెట్‌వర్క్ కోసం 1.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని, దేశవ్యాప్తంగా 18,000 పట్టణాలు, 2 లక్షల గ్రామాలను అనుసంధానిస్తూ 2.82 లక్షల బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని మంత్రికి జియో వివరించింది. వినియోగదారులకు నాణ్యమైన, అత్యుత్తమ సేవలను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని, అందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్న జియో.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థల నుంచి ఇంటర్‌కనెక్షన్ అందుబాటులో ఉండటం లేదని మరోసారి మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. తమ వినియోగదారుల కాల్స్, ఇతరత్రా సందేశాలకు దేశీయ టెలికామ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు కావాలనే అవాంతరాలను సృష్టిస్తున్నాయని జియో ఎప్పట్నుంచో ఆరోపిస్తున్నది తెలిసిందే. అదేమీ లేదని ఆయా సంస్థలు వాదిస్తున్నప్పటికీ ఈ వ్యవహారంపై స్పందించిన టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలపై 3,050 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ట్రాయ్ పిలుపునిచ్చిన సమావేశంలో నాలుగు సంస్థలు పాల్గొనగా, భారతీ ఎయిర్‌టెల్ ఎండి, సిఇఒ గోపాల్ విట్టల్, వొడాఫోన్ ఇండియా ఎండి, సిఇఒ సునీల్ సూద్, ఐడియా ఎండి, సిఇఒ హిమాన్షు కపానియా, రిలయన్స్ జియో డైరెక్టర్ మహేంద్ర నహత హాజరయ్యారు. ఈ సందర్భంగా పరస్పర సహకారంతో సమస్యను అధిగమించాలని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రితో జియో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకోగా, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ దిశగా ఆయా సంస్థలను సంప్రదిస్తామని చెప్పినట్లు సమాచారం. ఉచిత 4జి సేవలతో సంచలనం సృష్టించిన జియోకు.. కస్టమర్లు నానాటికీ పెరిగిపోతున్నది తెలిసిందే. ఇదే సమయంలో ఇతర అగ్రశ్రేణి సంస్థల ఆదాయానికీ గండి పడుతోంది.