బిజినెస్

మదుపరులకు ‘ట్రంప్’ ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. దాదాపు మూడు వారాల్లో ఎన్నడూలేనంతగా సూచీలు క్షీణించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కంటే డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుండటం అంతర్జాతీయ మార్కెట్లను ఒడిదుడుకులకు గురిచేసింది. ఈ క్రమంలోనే భారతీయ మార్కెట్లూ పడిపోయాయి. ఉదయం ఆరంభం నుంచి నష్టాల్లోనే కదలాడిన సూచీలు చివరిదాకా అదే దారిలో పయనించాయి.
దుందుడుకు స్వభావం, వివాదాస్పద వాఖ్యలు, సఖ్యత కొరవడిన వైఖరి కలిగిన ట్రంప్.. అగ్రరాజ్య అధిపతిగా ఎన్నికైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తప్పవన్నది మెజారిటీ మదుపరుల అభిప్రాయం. ఇప్పటికే పలు దేశాలపై ట్రంప్ వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందుకు నిదర్శనం. అవకాశం ఉన్నప్పుడల్లా అమెరికాను ఇతర దేశాలు దోచుకుంటున్నాయంటూ విరుచుకుపడుతున్న ట్రంప్‌పట్ల చాలా దేశాలు విముఖంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హిల్లరీని మించి ట్రంప్ ముందుకెళ్తుండటం ఆయా దేశాలనేకాదు.. స్టాక్ మార్కెట్లనూ ప్రభావితం చేస్తోంది. ఫలితంగానే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఈ ఒక్కరోజే 349.39 పాయింట్లు పతనమై 27,527.22 వద్ద స్థిరపడింది. అక్టోబర్ 13 నుంచి గమనిస్తే ఈ స్థాయిలో సెనె్సక్స్ నష్టపోయినదే లేదు. అలాగే అక్టోబర్ 17 నాటి ముగింపు స్థాయి (27,529.97)కి సెనె్సక్స్ దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 112.25 పాయింట్లు కోల్పోయి 8,600 స్థాయికి దిగువన 8,514 వద్ద నిలిచింది. ఈ ఏడాది జూలై 21 నుంచి చూస్తే నిఫ్టీకి ఇదే అత్యంత కనిష్ట స్థాయి.
ఇక బుధవారమే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష ఉండటం కూడా మదుపరులను అమ్మకాల ఒత్తిడికి లోనుచేసింది. కీలక వడ్డీరేట్లపై ఫెడ్ రిజర్వ్ ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఆయోమయంలో మదుపరులున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుందన్న సంకేతాలుండటంతో సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ కీలక వడ్డీరేట్లను పెంచాలని ఫెడ్ రిజర్వ్ భావిస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత లేకుండగా, పెంపు అంచనాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులు ఉపసంహరణకు గురవుతున్నాయి. దేశీయంగా చమురు, గ్యాస్, రియల్టీ, హెల్త్‌కేర్, పిఎస్‌యు, ఇన్‌ఫ్రా షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయంగా చూస్తే జపాన్, చైనా సూచీలు క్షీణించగా, హాంకాంగ్ సూచీ పెరిగింది. ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలూ పడిపోయాయి.