బిజినెస్

పెట్టుబడుల ఉపసంహరణలో ఎఫ్‌పిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తున్నది తెలిసిందే. హిల్లరీ క్లింటన్‌పై డొనాల్డ్ ట్రంప్ ముందంజలో కనిపిస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడు లకు ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తు న్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టపోతుండగా, విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయ. అక్టోబర్‌లో 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్న విదేశీ పోర్ట్ఫోలి యో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ).. ఈ నెలా అదే దారిలో పయనిస్తున్నారు. జరిగిన నాలుగు రోజుల ట్రేడింగ్‌లో 2,000 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. నిజానికి సెప్టెంబర్‌లో పెట్టుబడులను తీసుకొచ్చిన మదుపరులు.. అక్టోబర్‌లో మాత్రం వెనక్కి తగ్గారు. ముఖ్యంగా రుణ మార్కెట్ల నుంచి భారీ స్థాయలో పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహ రించుకున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్ల తగ్గింపు దీనికి ప్రధాన కారణమని, బాండ్లకు డిమాండ్ తగ్గడంతో రుణ మార్కెట్లు పడిపోయాయని ఎస్‌ఎఎస్ ఆన్‌లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సిద్ధాంత్ జైన్ అన్నారు. దీంతో రుణ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 6,000 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. సెప్టెంబర్లో 9,789 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం గమనార్హం. స్టాక్ మార్కెట్ల నుంచి కూడా 4,306 కోట్ల రూపాయల పెట్టుబడులు వెనక్కిపోయా య. దీంతో అటు రుణ, ఇటు స్టాక్ మార్కెట్ల నుంచి అక్టోబర్‌లో 10,306 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయనట్లైంది. ఈ క్రమంలో నవంబర్ 1-4 మధ్య స్టాక్ మార్కెట్ల నుంచి 1,504 కోట్ల రూపాయలను గుంజేసుకున్న ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 496 కోట్ల రూపాయలను తిరిగి తీసుకున్నారు. నిజానికి అక్టోబర్‌కు ముందు భారతీయ మార్కెట్లలో పెట్టుబడులపట్ల విదేశీ మదుపరులు ఆసక్తి కనబరిచారు. సెప్టెంబర్‌లో స్టాక్ మార్కెట్లలోకి 10,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకురావడంతో రుణ, స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలు వచ్చినట్లైంది. గడచిన 11 నెలల్లో ఈ స్థాయలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. నిరుడు అక్టోబర్‌లో 22,350 కోట్ల రూపాయల పెట్టుబ డులు రాగా, మళ్లీ ఆ తర్వాత ఈ సెప్టెంబర్‌లోనే ఆ స్థాయలో పెట్టుబడులు వచ్చాయ. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటం వంటివి అటు స్టాక్ ఇటు రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ. అంతకుముందు రెండు నెలల్లోనూ విదేశీ పెట్టుబడులు భారతీయ మార్కెట్లలోకి భారీగానే వచ్చాయ. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 0.1 శాతానికి తగ్గడం, వాహన అమ్మకాలు కూడా ఆశాజనకంగా నమోదు కావడం వంటివి కలిసొచ్చాయ. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తమ వడ్డీరేట్లను పెంచకుండా ఉండటం కూడా లాభించింది. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబ డులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. అంతకు ముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ.
ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి- జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకు న్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 45,482 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు రాగా, రుణ మార్కెట్ల నుంచి 4,055 కోట్ల రూపాయలు వెనక్కిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 41,427 కోట్ల రూపాయలుగా నమోదైంది.

ఎఎస్‌కెల్లో చెక్ డిపాజిట్ మెషీన్లు
న్యూఢిల్లీ, నవంబర్ 6: ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి).. ఆయకార్ సేవా కేంద్రాల్లో (ఎఎస్‌కె) చెక్ డిపాజిట్ మెషీన్లను ఏర్పాటు చేయనుంది. పన్ను చెల్లింపుదారులకు మరింత చేరువ కావడంలో భాగంగా ఈ మేరకు సిబిడిటి నిర్ణయం తీసుకుంది. అలాగే తమ టాక్స్ లయబిలిటీని పన్ను చెల్లింపుదారులు ఖచ్ఛితంగా తెలుసుకునేందుకు ఓ వెబ్‌సైట్‌నూ ఆధునికీకరించింది. లక్ష రూపాయల వరకు టిడిఎస్ ఫైలింగ్‌లో తేడాలుంటే త్వరితగతిన దాన్ని రీఫండ్ చేసేందుకూ సిబిడిటి ఏర్పాటు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మరో 65 ఆయకార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చూస్తున్న సిబిడిటి.. టాక్స్ రిటర్న్ పేపర్స్ నెంబర్‌ను 5 వేల నుంచి 50 వేలకు పెంచాలని కూడా భావిస్తోంది.

ప్రభుత్వ జరిమానాపై ఆర్‌ఐఎల్ పోరు
న్యూఢిల్లీ, నవంబర్ 6: రిలయన్స్ ఇండస్ట్రీస్, కృష్ణా-గోదావరి (కేజి) బేసిన్‌లో దాని భాగస్వాములు.. ప్రభుత్వ జరిమానాపై ఆర్బిట్రేషన్‌లో చేరే యోచనలో ఉన్నారు. కెజి బేసిన్‌లో ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసికి చెందిన గ్యాస్‌ను రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు ఏడేళ్లు అక్రమంగా తవ్వి తీసుకున్నాయని షా కమిటీ నివేదికలో తేలింది తెలిసిందే. దీంతో 1.55 బిలియన్ డాలర్లను చెల్లించాలని రిలయన్స్‌తోపాటు దాని భాగస్వామ్య సంస్థలైన బ్రిటిష్ పెట్రోలియం, నికో రిసోర్సెస్ లిమిటెడ్‌లకు ప్రభుత్వం నోటీసులిచ్చింది. అయితే ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం తమకు లేదంటూ దీనిపై పోరుకు సన్నద్ధం అవుతున్నాయ సదరు సంస్థలు.