బిజినెస్

వంద ‘మహా’లక్ష్మి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: ‘వంద నోట్లు కాకుండా, వెయ్యి, ఐదు వందల నోట్లు ఉంటే ఇవ్వండి సార్’.. నిన్నమొన్నటి వరకు బ్యాంకుల్లో, క్యాష్ కౌంటర్లలో వినిపించే ఈ మాటలు ఇక నుంచి మనకు వినిపించవు. లక్ష అయినా ఎన్ని లక్షలైనా వంద, యాబై నోట్ల కట్టలు ఉంటే ఇవ్వండి అని ఇక నుంచి వినిపించనున్నాయి మరి. దేశంలో రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి చేసిన ప్రకటన ఇక నుంచి డబ్బు లావాదేవీలలో ప్రకంపనలు సృష్టించనున్నాయి. పాత నోట్లు రద్దు అయి కొత్త నోట్లు చెలామణిలోకి వచ్చేదాకా వంద నోటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఇక బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా డబ్బుల కోసం సంచులతో వెళ్లాల్సిందే.