బిజినెస్

స్టాక్ మార్కెట్లకు మిశ్రమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ స్వల్పంగా నష్టపోతే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా లాభపడింది. మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు పరిణామాలు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్‌పర్సన్ జనెట్ యెల్లెన్ గురువారం చేయనున్న ప్రకటనల మధ్య మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల నడుమ ఊగిసలాటకు గురయ్యారు. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 5.94 పాయింట్లు కోల్పోయి 26,298.69 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 3.15 పాయింట్లు పెరిగి 8,111.60 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు లాభాల్లోనే కదలాడాయి. సెనె్సక్స్ 317 పాయింట్లు, నిఫ్టీ 107 పాయింట్లు లాభపడ్డాయి. అయితే సమయం గడుస్తున్నకొద్దీ మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు కూడా పతనం దిశగా అడుగులు వేశాయి. ఇకపోతే టెక్నాలజీ, ఐటి, ఆటో, పవర్, యుటిలిటీస్ రంగాల షేర్ల విలువలు 1.78 శాతం నుంచి 0.24 శాతం మేర పుంజుకున్నాయి. కాగా, ఆసియా మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.35 శాతం నుంచి 1.10 శాతం వరకు పెరిగాయి. హాంకాంగ్, చైనా సూచీలు మాత్రం 0.06 శాతం, 0.19 శాతం చొప్పున నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ 0.19 శాతం నుంచి 0.31 శాతం వరకు క్షీణించాయి.

అంబుజా, ఎసిసిల్లో పెరిగిన లఫర్జ్ వాటా
న్యూఢిల్లీ, నవంబర్ 16: స్విట్జర్లాండ్‌కు చెందిన సిమెంట్ రంగ దిగ్గజం లఫర్జ్‌హోలిసిమ్.. అంబుజా సిమెంట్, ఎసిసిల్లో వాటాలను పెంచుకుంది. అంబుజా సిమెంట్‌లో 3.91 కోట్ల షేర్లను, ఎసిసిలో 78.70 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. వీటి విలువ 1,832 కోట్ల రూపాయలుగా ఉంది. లఫర్జ్‌హోలిసిమ్ అనుబంధ సంస్థ హోల్డరిండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ఈ మేరకు అంబుజా సిమెంట్, ఎసిసిల్లో వాటాలను అందిపుచ్చుకుందంటూ ఆ వివరాలను అంబుజా సిమెంట్, ఎసిసిలు బుధవారం తెలియజేశాయి.