బిజినెస్

నిరంతర విద్యుత్ అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్ అంతరాయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన విద్యుత్ పరిస్ధితిపై అమరావతిలో సమీక్షించారు. దేశం మొత్తం మీద విద్యుత్ పంపిణీలో వాణిజ్య నష్టాలు లేని రాష్ట్రంగా ఆంధ్రా ఉండాలన్నారు. అంతర్జాతీయ విద్యుత్ ఉన్నతా ప్రమాణాలను అమలు చేయాలన్నారు. వినియోగదారులకు ఉచితంగా సేవలు అందించాలని సూచించారు. నిరుడుతో పోల్చితే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రెవెన్యూ డిమాండ్ 5.9 శాతం, విద్యుత్ అమ్మకాలు 5.9 శాతం పెరిగాయన్నారు. ఎల్‌టి అమ్మకాలు 5.5 శాతం, హెచ్‌టి అమ్మకాలు 6.5 శాతం ఎక్కువగా నమోదైనట్లు చెప్పారు. విద్యుత్ పంపిణీ నష్టాలు 10.32 శాతం నుంచి 9.98 శాతానికి తగ్గాయన్నారు. కాగా, పవన విద్యుత్ కెపాసిటీ 1,900 మెగావాట్లకు, పవన విద్యుదుత్పత్తి 2,232.48 ఎంయుకు, సౌర విద్యుత్ వ్యవస్థాపిత సామర్థ్యం 945.05 మెగావాట్లకు, సౌరవిద్యుత్ 681.6 ఎంయుకు పెరిగిందన్నారు. ఒక శాతం విద్యుత్ పంపిణీ నష్టాలను తగ్గిస్తే రూ. 270 కోట్లు ఆదా అవుతుందన్నారు. విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, ఫైనాన్స్ జెఎండి దినేష్ పరుచూరి, ఏపిఎస్‌పిడిసిఎల్ హెచ్‌వై దొర తదితరులు పాల్గొన్నారు.

‘మద్దతు ధరపై
ఏపి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 16: వరి పంటకు కేంద్రం మద్దతు ధరను పెంచకపోవడంపై టిడిపి వౌనంగా ఉండటంపట్ల వైకాపా రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ధాన్యానికి మద్దతు ధర పెంచాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఉత్తరాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గోధుమకు, ఆవాలుకు, కుసుమ పంటకు మద్దతు ధరలను పెంచారన్నారు. కనీసం ఇదే పెంపును వరి ధాన్యానికి ఎందుకు వర్తింప చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ధోరణి వల్ల వరిని పండించే ఆంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఆయన చంద్రబాబును కోరారు. ఉత్తరాది రాష్ట్రాలకు మనకంటే మెరుగ్గా మద్దతు ధరలు, బోనస్ ప్రకటించినందున, ధాన్యానికి, క్వింటాలుకు 300 బోనస్ ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.