బిజినెస్

ఇకపై తెలుగులోనూ బిబిసి సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బిబిసి) వరల్డ్ వైడ్ సేవలు ఇక తెలుగు భాషలోనూ లభించనున్నాయి. బిబిసి వరల్డ్ వైడ్ సర్వీసెస్ దాదాపు 80 సంవత్సరాల తర్వాత అతిపెద్ద విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా మరో 11 భాషల్లో సేవలు అందించనుందని బిబిసి డైరెక్టర్ జనరల్ టోని హాల్ చెప్పారు. భారతీయ భాషల్లో తెలుగు, గుజరాతి, మరాఠీ, పంజాబీ ఉండగా, ఆఫ్రికన్ భాషల్లో అఫాన్ ఒరామా, అమ్హారిక్, ఇగ్బో, కొరియన్, పిడ్గిన్, తిగ్రిన్యా, యెరుబా ఉన్నట్టు బిబిసి ప్రకటించింది. యుకె తర్వాత అతిపెద్ద బ్యూరోను భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. ఈ విస్తరణ ద్వారా దాదాపు 157 మందిని కొత్తగా రిక్రూట్ చేసుకోనున్నారు. తాజా విస్తరణతో బిబిసి.. ఇంగ్లీషు సహా 40 భాషల్లో సేవలు అందించనుంది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల ప్రజలకు చేరువ కావాలనేదే తమ ఆశయమని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం బిబిసి హిందీ, బెంగాలీ, తమిళ భాషల్లో రేడియో సేవలు, మొబైల్ సేవలు, వీడియో సేవలు అందిస్తోంది.