బిజినెస్

‘మిషన్ మోడ్’లో డిజిటల్ బ్యాంకింగ్ వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ‘మిషన్ మోడ్’లో శరవేగంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం బ్యాంకులకు సూచించారు. పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం భౌతికంగా నగదు వినియోగాన్ని తగ్గించడమేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల అధినేతలతో గురువారం ఆయన న్యూఢిల్లీలో సమావేశమైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు విషయమై పార్లమెంట్‌లో జరుగుతన్న రభసను జైట్లీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ప్రజల అలవాట్లు మారుతున్నాయని, చెల్లింపుల కోసం వారు తరచుగా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారన్న వాస్తవాలను రాజకీయ నాయకులంతా అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు. నగదు రహిత లావాదేవీలకు భారతీయులు సరిగా అలవాటు పడలేదని కొంత మంది రాజకీయ నాయకులు చేస్తున్న వాదనలో ఏమాత్రం నిజం లేదని, ఈ వాదనకు భిన్నంగా నగదు రహిత లావాదేవీల్లో బ్యాంకులు ఇప్పటికే గణనీయ పురోగతి సాధించాయని చెప్పారు. దేశంలోని డిజిటల్ ఔట్‌లెట్ల వివరాలను జైట్లీ ఈ సందర్భంగా వివరిస్తూ, ప్రస్తుతం దాదాపు 14 లక్షల పిఓఎస్ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, ఇవి దేశీయంగా తయారైనవి కావని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవేనని, త్వరలోనే వీటి సంఖ్యను రెట్టింపు చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రస్తుతం బ్యాంకుల్లో ఖాతాలు కలిగివున్న వారికి డెబిట్, ప్రీపెయిడ్ కార్డులతో పాటు మొబైల్ యాప్‌లు, ఇ-వ్యాలెట్లు అందుబాటులో ఉన్నాయని, ఈ సదుపాయాలను ఉపయోగించుకునేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 80 కోట్ల కార్డులు చెలామణిలో ఉన్నాయని, వీటిలో దాదాపు 40 కోట్ల కార్డులను ప్రజలు ఇప్పటికే ఉపయోగించుకుంటున్నారని, ప్రజల ఆర్థిక అలవాట్లలో వేగవంతంగా మార్పు వస్తోందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనమని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

బ్యాంకర్లతో సమావేశమైన తర్వాత విలేఖరులతో మాట్లాడుతున్న జైట్లీ