బిజినెస్

సామాన్యులు స్వాగతిస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 26: నల్లధనాన్ని వెలికి తీసి దేశంలోని పేద ప్రజలకు మేలు చేయాలన్న సత్సంకల్పంతో పెద్ద నోట్లు రద్దుచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారని, అయితే విపక్షాలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆయన కుమార్తెకు వివాహం జరగడంతో నూతన వధూవరులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల, తిరుపతిలో విలేఖరులతో ముచ్చటించారు. స్వచ్ఛ్భారత్ పథకం కింద ఎంపికైన తిరుమలలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులు టిటిడికి అందనున్నాయన్నారు. టిటిడి కూడా శ్రీవారి భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయన తిరుపతి బ్లిస్ హోటల్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమవేశంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దుచేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా కొన్ని కష్టాలు ఎదురవుతున్నా ప్రజలు మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. యుపిఎ ప్రభుత్వం పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నల్లధనంపై మట్లాడిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. అలాంటిది మోదీ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం వారి అవివేకానికి అద్దం పడుతోంద న్నారు. వామపక్షాలు కూడా నోట్ల రద్దుపై రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని రాద్ధాంతం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ముఖ్యంగా సిపిఐ పార్టీలో జాతీయ స్థాయి కార్యదర్శిగా ఉన్న నారాయణ.. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాకు తగినట్లు లేవన్నారు. ప్రాంతీయ పార్టీలకు కూడా అకారణంగా నోట్ల రద్దుపై విమర్శలు చేయడం తగదన్నారు. నోట్ల రద్దుతో ప్రధాని నరేంద్రమోదీ ప్రజల మనసులు గెలుచుకున్నారని, ఈ క్రమంలో 2019లో ఆయనే ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ప్రజలు డెబిట్ కార్డులు, ప్రీ పెయిడ్ కార్డులే కాకుండా ఇ-వాలెట్లు, మొబైల్ యాప్‌లో కూడా నగదు రహిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకురావడానికి కూడా పలు దేశాలతో చట్టబద్దమైన ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికే మలేషియాతో ఒప్పందం కుదరిందని, మన దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచంలోని అన్నిదేశాలు చూస్తున్నాయని, ఈ క్రమంలో నల్లధనం ఉన్న దేశాలకు కూడా మోదీ సహకరిస్తారని అన్నారు. విపక్షాలు మోదీ చేసే మంచి పనులకు సహకరించాలని, అవసరమైతే పార్లమెంటులో సలహాలు, సూచనలు ఇవ్వచ్చని, లేనిపక్షంలో వారు ప్రజలకు దూరం కావడం ఖాయమన్నారు. ప్రింట్ మీడియాకు వేజ్‌బోర్డులో అవకాశం కల్పించామని, అయితే వాటి అమలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించి కూడా పార్లమెంటులో ఒక కొత్తచట్టాన్ని తీసుకురావాలన్నది తన యోచనన్నారు. త్వరలో ఎలక్ట్రానిక్ మీడియాప్రతినిధులకు కనీస వేతన చట్టం అమలులోకి తెచ్చేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్ కింద ఖాతాదారునికి సమాచార నిమిత్తం వ్యక్తిగత వివరాలు గురించి ఎస్‌ఎంఎస్ వారి వారి సెల్ ఫోనుకు తెలియజేస్తామన్నారు.