బిజినెస్

పాత నోట్లను అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: పాత 500, 1,000 రూపాయల నోట్లను మొబైల్ ఫోన్ల కొనుగోలుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసిఎ) విజ్ఞప్తి చేసింది. ఈ నోట్ల రద్దు నిర్ణయంతో మొబైల్ ఫోన్ల అమ్మకాలు 50 శాతం పడిపోయాయని తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఈ మేరకు ఐసిఎ ఓ లేఖను రాసింది. పాత పెద్ద నోట్ల రద్దుతో మొబైల్ పరిశ్రమ అమ్మకాలు దాదాపు 350-400 కోట్ల రూపాయలు తగ్గాయని చెప్పింది. నోట్ల రద్దుతో నగదు కొరత ఏర్పడిందని, పంట కాలం కావడంతో కూలీలు, విత్తనాలు, ఎరువులకే ఉన్న నగదును ఎక్కువగా వాడటం జరుగుతోందని ఐసిఎ జాతీయ అధ్యక్షుడు పంకజ్ మొహింద్రు అన్నారు. కాబట్టి సహజంగానే మొబైల్స్ కొనుగోళ్లు క్షీణించాయని లేఖలో పేర్కొన్నారు. నోట్ల రద్దుతో ఐడిసి అంచనా ప్రకారం ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 24.6 శాతం, స్మార్ట్ఫోన్ల విక్రయాలు 17.5 శాతం చొప్పున తగ్గనున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే. ప్రధాన మంత్రి మోదీ ఈ నిర్ణయాన్ని ప్రకటించగా, కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తీసుకొచ్చారు. ఇక డిసెంబర్ 30 వరకు పాత నోట్లను ప్రజలంతా బ్యాంకులు, పోస్ట్ఫాసు కేంద్రాల్లో డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లను పొందవచ్చని చెప్పగా, డిమాండ్‌కు తగ్గ కొత్త నోట్ల చెలామణి లేకపోవడంతో వ్యాపార లావాదేవీలు మందగించాయి. ముఖ్యంగా 500 నోటు విడుదల కాకపోవడం చిల్లర సమస్యకు దారి తీసింది. పాత నోట్లతో పోల్చితే కొత్త నోట్ల పరిమాణం వేరుగా ఉండటంతో ఎటిఎమ్‌లు వాటిని పంపిణీ చేయలేకపోతున్నాయి. కేవలం 100 రూపాయల పంపిణీకే అవి పరిమితమవగా, అవి కూడా అస్సలు చాలకుండా ఉన్నాయి. ఇక బ్యాంకుల్లో ఇచ్చే 2,000 రూపాయల నోటుకు చిల్లర దొరకడం కష్టంగా మారింది. ఫలితంగా అందరూ 100 రూపాయల నోట్ల కోసం బ్యాంకులు, ఎటి ఎమ్‌ల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుండగా, కొనేవారే కరువయ్యారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మొబైల్ పరిశ్రమే కాదు.. ఆటో, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ తదితర అన్ని రంగాలు కుదేలయ్యాయి.
చర్యలు చేపట్టండి
పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ఉత్పాదకత, వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ పరిశ్రమ కోరింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణనూ పెంచాలని, కార్పొరేట్ పన్నును 18 శాతానికి తగ్గించాలని కూడా సూచించాయి. పారిశ్రామిక సంఘాలు, ఎగుమతిదారులతో ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జైట్లీ చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే పైవిధంగా పరిశ్రమ స్పందించింది. మరోవైపు వృద్ధి బలోపేతానికే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని జైట్లీ స్పష్టం చేశారు. సామాజిక రంగానికి ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు పెరుగుతాయని చెప్పారు.