బిజినెస్

ఎయిర్‌టెల్ చేతికి ఎకోనెట్ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. నైజీరియాలోని తమ అనుబంధ సంస్థలో ఎకోనెట్ వైర్‌లెస్‌కున్న వాటాను కొనుగోలు చేసింది. ఎయిర్‌టెల్ నైజీరియాలో ఎకోనెట్ వైర్‌లెస్ లిమిటెడ్‌కు 4.2 శాతం వాటా ఉంది. ఈ మొత్తం వాటాను భారతీ ఎయిర్‌టెల్ ఇంటర్నేషనల్ (నెదర్లాండ్స్) బివి ద్వారా కొనుగోలు చేసినట్లు శనివారం భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ కొనుగోలుతో ఎయిర్‌టెల్ నైజీరియాలో తమ వాటా 83.25 శాతానికి పెరిగినట్లు ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ తెలియజేసింది.

రూ. 500 కోట్లు అందుకున్న ఇండియా బుల్స్
న్యూఢిల్లీ, నవంబర్ 26: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సిడి) ద్వారా ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ 500 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఓ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ బేసిస్‌పై ఈ డిబెంచర్లను జారీ చేసింది. ఒక్కో ఎన్‌సిడి ముఖ విలువ 10 లక్షల రూపాయలు. ఇలా 500 కోట్ల రూపాయలు విలువచేసే ఎన్‌సిడిలను జారీ చేసినట్లు శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఇండియా బుల్స్ తెలిపింది. రెండేళ్ల కాలపరిమితితో విడుదలైన ఈ బాండ్ల గడువు.. 2018 నవంబర్ 23న ముగుస్తుంది.

గల్ఫ్ దేశాల్లో
చంద్రబాబు పర్యటన
వచ్చే నెల 11 నుంచి మూడు రోజుల టూర్

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 26: నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆహ్వానించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలను శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్ర సలహాదారు డాక్టర్ వేమూరి రవికుమార్ కువైట్‌లో ఎపి ఎన్నార్టీ కోఆర్డినేటర్లతో టెలికాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో చంద్రబాబు దుబాయి, అబుదాబి, కువైట్‌లలో పర్యటించనున్నారు. ఈ మూడు నగరాల్లో కూడా చంద్రబాబు ఆయన వెంట రానున్న ఉన్నత స్థాయి అధికారిక బృందం గల్ఫ్, అరబ్ వ్యాపారవేత్తలతో సమావేశం జరపనుంది. తన పర్యటన సందర్భంగా అల్ మొఖ్తుం, అల్ నహ్యాన్, అల్ సభా రాజ కుటుంబీకుల ప్రతినిధులతో కూడా సమావేశం కావడానికి ముఖ్యమంత్రి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రుల సంక్షేమానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకోనున్న కొన్ని ముఖ్య ప్రకటనలు కూడా చేస్తారని భావిస్తున్నారు.
‘ప్రతిభ కనుమరుగవుతోంది’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 26: మంచి పేరున్న, వౌలిక సదుపాయాలు ఉన్న సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థులు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో తగిన ప్రతిభను కనబరచలేకపోతున్నారని, ఇది ఆందోళనకరమైన పరిణామమని అమెజాన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ జైదీప్ గంగూలీ అన్నారు. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం అవసరమని అన్నారు. దీని వల్ల ప్రతిభ ఉన్న అభ్యర్థులు తయారవుతారన్నారు. ట్యాలెంట్ స్ప్రింట్ అనే సంస్థ సూపర్ క్యాంపస్ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ వివిధ సాంకేతిక శాస్త్రాలను అధ్యయనం చేస్తున్న అభ్యర్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. సృజనాత్మకత లేకపోతే వృత్తిపరమైన నైపుణ్యంతో రాణించలేరన్నారు. పాత తరహా అధ్యయన విధానాలకు స్వస్తి చెప్పాలని, ఆధునిక టెక్నాలజీ, నిపుణుల సహకారంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన అభ్యర్థులను పరిశోధన, ఐటి రంగాలకు అందించాలన్నారు. పెగాసిస్టమ్స్ ఎండి సుమన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే మూడు సంవత్సరాల్లో పెగాసిస్టమ్స్ సర్టిఫైడ్ వృత్తి నిపుణులను 27 వేల మందిని అందించనున్నట్లు చెప్పారు. ఇందులో అన్ని వృత్తిపరమైన విద్యా సంస్థలకు భాగస్యామ్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్యాలెంట్ స్ప్రింట్ ఎండి డాక్టర్ శంతను పాల్, కాగ్నిజెంట్ వైస్ ప్రెసిడెంట్ హరిరాజా, చీఫ్ డిజిటల్ ఆఫీసర్ కె శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.