బిజినెస్

ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్ సులభతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 27: ఎగుమతి విధానాలు, డాక్యుమెంటేషన్‌ను మరింత సులువు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని, విదేశీ వాణిజ్య విధానంలో గణనీయ మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఐఐఎఫ్‌టి (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్) డీన్ డాక్టర్ ఎకె సేన్ గుప్తా అన్నారు. ది డాలర్ బిజినెస్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య అవకాశాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశీయ ఎగుమతుల రంగంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల పాత్ర కీలకమన్నారు. ది డాలర్ బిజినెస్ ద్వారా దేశవ్యాప్తంగా వాణిజ్యవేత్తలకు సదస్సులను నిర్వహించి ఎగుమతి విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎగుమతులు, దిగుమతులపై నిబంధనలు, మార్గదర్శకాలు, లాజిస్టిక్స్ గురించి పారిశ్రామికవేత్తలు తెలుసుకోవాలన్నారు. సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవి లోగనాథన్ మాట్లాడుతూ విదేశీ వాణిజ్యంపై జిఎస్‌టి అనుకూల ప్రతికూలాంశాలు ఎగుమతుల పరిశ్రమకు సవాలుగా ఉన్నాయన్నారు.
పీటర్ ఇంగ్లాండ్ మిస్టర్ 2016గా
విష్ణురాజ్ ఎస్ మీనన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 27: ప్రపంచ ప్రఖ్యాత వస్త్ర సంస్థ పీటర్ ఇంగ్లాండ్ మిస్టర్ (2016)గా బెంగళూరుకు చెందిన విష్ణురాజ్ ఎస్ మీనన్ ఎన్నికైనట్లు ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ హెడ్ మనిషా సింగాల్ తెలిపారు. ముంబయిలో జరిగే కార్యక్రమంలో విజేత విష్ణురాజ్‌తోపాటు మొదటి, రెండవ రన్నర్స్‌గా నిలిచిన వీరేన్ బర్మాన్ (్ఢల్లీ), అట్లామష్ ఫరాజ్ (్ఢల్లీ)కి అవార్డులను అందజేయనున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పీటర్ ఇంగ్లాండ్‌కు 2 వేల బ్రాండ్ అవుట్‌లెట్లు, 6 వందల ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు ఉన్నాయన్నారు.