బిజినెస్

- పెద్ద నోట్ల రద్దు - పోస్ట్ఫాసుల్లో రూ. 33 వేల కోట్ల డిపాజిట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశవ్యాప్తంగా పోస్ట్ఫాసుల్లో 32,631 కోట్ల రూపాయల డిపాజిట్లు జరిగాయి. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినది తెలిసిందే. ఈ నెల 8వ తేదీ రాత్రి ఈ నిర్ణయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించగా, డిసెంబర్ 30 వరకు రద్దయిన నోట్లను బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని సూచించారు. వాటికి బదులుగా కొత్తగా వచ్చిన 500, 2,000 రూపాయల నోట్లను, ఇతర పాత నోట్లు (100, 50, 20, 10) తీసుకోవచ్చని చెప్పారు. ఈ క్రమంలో దేశంలోని సుమారు 1.55 లక్షల పోస్ట్ఫాసుల్లో నవంబర్ 10 నుంచి 24 మధ్య 32,631 కోట్ల రూపాయల విలువైన 43.48 కోట్ల 500, 1,000 రూపాయల నోట్లు డిపాజిట్ అయ్యాయని తపాలా శాఖ కార్యదర్శి బివి సుధాకర్ పిటిఐకి తెలిపారు. అలాగే ఇదే సమయంలో దాదాపు 3,680 కోట్ల రూపాయల విలువైన 578 లక్షల నోట్ల మార్పిడి చేశామని చెప్పారు. ఈ నోట్లలో కొత్త 2,000 రూపాయల నోట్లతోపాటు పాత 100 నోట్లూ ఉన్నాయి. నవంబర్ 9న బ్యాంకులన్నీ మూతపడగా, 10 నుంచి డిపాజిట్ల ప్రక్రియ మొదలైంది. కాగా, డిపాజిట్లు జరిగిన 1.55 లక్షల పోస్ట్ఫాసుల్లో 1.30 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోనివి 25 వేల పోస్ట్ఫాసులు మాత్రమే. నిజానికి గ్రామీణ ప్రజలకు బ్యాంకుల కంటే అధికంగా పోస్ట్ఫాసులే అందుబాటులో ఉంటాయి కాబట్టే పోస్ట్ఫాసుల్లోనూ రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం ఇచ్చింది. అందుకు తగ్గట్లే గ్రామీణ ప్రాంత పోస్ట్ఫాసుల్లో పెద్ద మొత్తంలోనే నోట్ల డిపాజిట్లు జరిగాయి.