బిజినెస్

మున్ముందు రూపాయి విలువ పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: భారత కరెన్సీ రూపాయి విలువ మున్ముందు మరింత పతనం అవుతుందని డ్యూషే బ్యాంక్ రిసెర్చ్ నివేదిక ఒకటి అంచనా వేసింది. డాలర్‌తో పోల్చితే వచ్చే నెలాఖరుకల్లా 70 రూపాయల స్థాయికి దిగజారవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది చివరికి ఇది 72.50 రూపాయల స్థాయికి క్షీణించవచ్చంది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ నెలలో డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయినది తెలిసిందే. ప్రస్తుతం రూపాయి విలువ 68.46 రూపాయల వద్ద ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అందులో డొనాల్డ్ ట్రంప్ విజయం, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణ, పాత పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలు రూపాయి మారకం విలువను ప్రభావితం చేశాయి. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ చర్యలు కూడా డాలర్‌ను బలోపేతం చేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) జిడిపిలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతం మాత్రమే పెరుగుతుందని డ్యూషే బ్యాంక్ రిసెర్చ్ అంచనా వేసింది.