బిజినెస్

2 రోజుల్లోనే 10 వేలకుపైగా ఖాతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: కేవలం రెండు రోజుల్లోనే పది వేలకుపైగా కస్టమర్లు సేవింగ్స్ ఖాతాలను తెరిచారని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. గత వారం రాజస్థాన్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తెచ్చినది తెలిసిందే. ఈ క్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అధికంగా తమ ఖాతాలను తెరిచారని ఓ ప్రకటనలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ చెప్పింది. కాగా, సేవింగ్స్ ఖాతాల డిపాజిట్లకు అధిక వడ్డీరేటును ఇస్తున్నామని, ఖాతాదారులకు లక్ష రూపాయల వ్యక్తిగత బీమా సౌకర్యాన్నీ కల్పిస్తున్నామని పేర్కొంది.

ఇక ఓలా క్యాబ్‌లూ.. మొబైల్ ఎటిఎమ్‌లే

న్యూఢిల్లీ, నవంబర్ 27: పెట్రోల్ బంకుల తర్వాత ఇప్పుడిక కొన్ని ఓలా క్యాబ్‌ల్లోనూ డెబిట్ కార్డుల ద్వారా నగదును తీసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లతో భాగస్వామ్యాన్ని ఓలా ఏర్పరచుకుంది. కోల్‌కతా, హైదరాబాద్‌లలో ఓలా ట్యాక్సీల్లో ఓ బ్యాంక్ అధికారిని, పిఒఎస్ మెషీన్‌ను ఉంచనున్నారు. వీటిల్లో గరిష్ఠంగా 2,000 రూపాయల వరకు నగదును తీసుకోవచ్చు. పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో డిపాజిట్లు, కొత్త నోట్ల విత్‌డ్రాలతో బ్యాంకులు, పోస్ట్ఫాసులు, ఎటిఎమ్‌లలో విపరీతమైన రద్దీ పెరిగినది తెలిసిందే. దీంతో ఓలా క్యాబ్‌లూ మొబైల్ ఎటిఎమ్‌లుగా మారిపోయాయ.