బిజినెస్

జిడిపి వృద్ధి 7.3 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 7.3 శాతానికి పెరిగింది. ఏప్రిల్-జూన్‌లో ఇది 7.1 శాతానికే పరిమితమవగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో 7.6 శాతంగా నమోదైంది. ఈ మేరకు బుధవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) తెలిపింది. ఆర్థిక వృద్ధిరేటులో నిరుడు చైనాను అధిగమించిన భారత్.. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వృద్ధి కలిగిన దేశంగా దూసుకెళ్తోంది. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జిడిపి పరుగులకు బ్రేకులు పడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నవంబర్ 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. ఈ నిర్ణయంతో వ్యాపార లావాదేవీలు బాగా దెబ్బతిన్నది తెలిసిందే. పారిశ్రామికోత్పత్తి పడిపోయింది. కొత్త నోట్ల సరఫరా డిమాండ్‌కు తగ్గట్లుగా లేకపోవడం, 500 నోట్ల పంపిణీ ఆలస్యం కావడంతో 2,000 రూపాయల నోటుకు చిల్లర కష్టాలు వచ్చిపడ్డాయి. 100 నోట్లు కావాల్సినన్ని లేకపోవడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు కుంటుపడగా, కీలక రంగాలన్నీ కుదేలయ్యాయి. దీంతో అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతోపాటు జనవరి-మార్చి త్రైమాసికంలోనూ భారత జిడిపి గణాంకాలు క్షీణించవచ్చని ముఖ్య గణాంకవేత్త టిసిఎ అనంత్ అన్నారు. ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఈ జూలై-సెప్టెంబర్ వ్యవధిలో పుంజుకున్న వ్యవసాయోత్పత్తితోనే జిడిపి గణాంకాలు పెరిగాయి.