బిజినెస్

చమురు ధరలు తెచ్చిన ఉత్సాహంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 30: అంతర్జాతీయ మార్కెట్‌లో పుంజుకున్న చమురు ధరలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 258.80 పాయింట్లు పెరిగి 26,652.81 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 82.35 పాయింట్లు అందుకుని 8,224.50 వద్ద నిలిచింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, పారిశ్రామిక, విద్యుత్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.01 శాతం నుంచి 0.86 శాతం వరకు పుంజుకున్నాయి. చైనా సూచీ మాత్రం ఒక శాతం పడిపోయింది. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు 0.34 శాతం నుంచి 0.54 శాతం వరకు లాభపడ్డాయి.

టెలికామ్ రంగంలోకి
భారీగా ఎఫ్‌డిఐ
న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశీయ టెలికామ్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-నవంబర్‌లో 10 బిలియన్ డాలర్లు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో కేవలం 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులే రాగా, ఈసారి 6-7 రెట్లు పెరిగాయి. ఈ మేరకు బుధవారం టెలికామ్ కార్యదర్శి జెఎస్ దీపక్ తెలిపారు. ఈసారితో పోల్చితే అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ విదేశీ పెట్టుబడులు తక్కువగానే నమోదయ్యాయి.

ఎస్‌బిఐలో బిఎమ్‌బి విలీనానికి సిసిఐ ఆమోదం
న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలో భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి) విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది. బిఎమ్‌బితోపాటు మరో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి ఆగస్టులో ఎస్‌బిఐ బోర్డు అంగీకరించినది తెలిసిందే. ఈ క్రమంలో ఎస్‌బిఐలో బిఎమ్‌బి విలీనానికి సిసిఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్‌బిఎమ్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ (ఎస్‌బిటి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్‌బిపి), స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బిబిజె)లు కూడా ఎస్‌బిఐలో విలీనానికి సిద్ధమవుతున్నాయి.

యుటిఐ ఇన్‌కమ్
ఆపర్చునిటీస్ ఫండ్ ఆకర్షణీయం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, నవంబర్ 30: యుటిఐ ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ ఫండ్‌ను ప్రారంభించినప్పటి నుంచి 9.60 శాతం రాబడిని అందించినట్లు యుటిఐ హెడ్ ఆఫ్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ అమన్‌దీప్ చోప్రా తెలిపారు. రెండు నుంచి నాలుగు సంవత్సరాల నడుమ మెచ్యూరిటీతో అధిక ఆదాయ పోర్ట్ఫులియో ఈ ఫండ్‌కు ఉందన్నారు. యాక్టివ్ పోర్ట్ఫులియో నిర్వహణ ద్వారా పరపతి, వడ్డీ మార్పుద్వారా మూల ధన వృద్ధి అవకాశాలతో రిటర్న్స్ బాగున్నాయన్నారు.