బిజినెస్

పాడి పరిశ్రమకు రాయితీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: నవ్యాంధ్రలో పాడి పరిశ్రమ ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పాడి పరిశ్రమను రైతులు, రైతు కూలీలు అనుబంధ వృత్తిగా కొనసాగిస్తున్నారు. దీన్ని గుర్తించిన చంద్రబాబు ప్రభుత్వం.. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రైతులకు పెద్ద ఎత్తున రాయతీలు అందిస్తోంది.
ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతోపాటు పాల ఉత్పత్తుల వినియోగం పెరిగింది. పాడి పశువుల పెంపకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం సునందిని పథకం అమలు చేస్తోంది. ఇది లేగ దూడల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది. పశుపోషణ విధానాల్లో శాస్ర్తియత పాటించడం, పశువుల ఉత్పాదకతను పెంచడం ద్వారా లాభాసాటిగా ఉండేలా పశుపోషకుల సంక్షేమార్థం ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టింది. గేదెలు, ఆవుల్లో కృత్రిమ, సాధారణ గర్భధారణలో పుట్టిన లేగదూడలు ఆరోగ్యంగా ఉండటానికి, త్వరగా పెరగడానికి ఈ పథకంలో పౌష్టికాహారంతో పాటు బీమా, మందులను పంపిణీ చేస్తారు. కృత్రిమ గర్భధారణ వల్ల, మేలుజాతి పశువులకు పుట్టిన 3-4 నెలల వయస్సు లేగదూడలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఒక్కో రైతుకు చెందిన 1-2 మేలు జాతి దూడలకు 4-5 నెలల వయస్సు నుంచి 2 సంవత్సరాల వరకు రాయితీతో దాణా అందిస్తారు. మందుల కిట్టు కూడా అందజేస్తారు. దీంతోపాటు దూడకు రైతుకు ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది. ప్రస్తుత 2016-17 సంవత్సరానికి 5,065 మేలు జాతి పెయ్య దూడలను సునందిని పథకం ద్వారా లబ్థి చేకూర్చడానికి 20 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. అందులో ఎస్సీ, ఎస్టీలకు 10 కోట్లు, మిగిలిన వాళ్లకు 10 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులు మాత్రమే లబ్థిపొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
50 శాతం రాయితీతో పశుదాణా
గ్రామీణ మహిళా రైతాంగానికి పాడి అభివృద్ధితో ఆర్థిక స్వావలంబన కలిగించడానికి స్వయం సహాయక బృందాల మహిళా రైతులకు రెండు పాడి పశువుల పెంపకానికిగాను స్ర్తినిధి ద్వారా వడ్డీలేని రుణం అందిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వం పశు సంవర్థక శాఖ ద్వారా 50 శాతం రాయతీతో పశుదాణాను ఎంపిక చేసిన లబ్థిదారులకు అందజేస్తుంది. రాయితీతో పశుగ్రాస విత్తనాలు, ఛాప్ కట్టర్‌లు కూడా పంపిణీ చేస్తోంది.
పాడి పశువులకు బీమా వర్తింపు
ఈ పథకం అమలులో ఒక్కో రైతుకు చెందిన పాడి పశువులకు బీమా చేస్తున్నారు. బీమా ప్రీమియంలో ప్రభుత్వ రాయితీ 50 శాతానికి అన్ని వర్గాలకు చెందిన రైతులు అర్హులు. బీమా చేసిన పాడి పశువు మరణిస్తే పూర్తి బీమా విలువ చెల్లిస్తారు. సంబంధిత రైతుకు కూడా బీమా వర్తిస్తుంది. బీమా చేసిన పాడి రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే లక్ష రూపాయలు నష్టపరిహారంగా చెల్లిస్తారు.
చౌకగా పశుగ్రాస విత్తనాలు
పాడి రైతులు, గొర్రెలు, మేకల పెంపకదారులు సంవత్సరం పొడవున పచ్చిమేత లభ్యత కోసం తమకున్న భూమిలో కొంత పశుగ్రాసం సాగు చేయాలి. అయతే సన్న, చిన్నకారు రైతులకు పశుగ్రాసం సాగును ప్రోత్సహించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం రాయితీతో మేలురకపు పశుగ్రాస విత్తనాలను అందజేస్తోంది.