బిజినెస్

ఆక్వారంగానికి ‘వార్ధా’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 14: వార్ధా తుపాను ప్రభావం కారణంగా గత వారం రోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్యలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయ. దీంతో గత్యంతరం లేక యుద్ధ ప్రాతిపదికన రైతులు పట్టుబడి చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రొయ్యలు కొద్ది సంఖ్యలోనే చనిపోయనప్పటికీ.. బుధవారం మాత్రం భారీగా మృత్యువాత పడ్డాయ. ఫలితంగా పెంపకందారులు ఆందోళనలో పడ్డారు. 80 కౌంట్ నుండి 100కుపైగానే రొయ్యల పెరుగుదల ఉండటంతో ఆక్వా రైతులు భారీ నష్టాలను చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆక్సిజన్‌ను పెంచేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా ఏరియేటర్లను తిప్పుతున్నా ప్రయోజనం ఉండటం లేదని పెంపకందారులు వాపోతున్నారు. తుపాను తీరం దాటినా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రొయ్యలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 1.30 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. ఈ తాజా పరిణామంతో రొయ్యల చెరువులు పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం 40 కౌంట్ ధర 425 రూపాయలుగా ఉంటే, 80 కౌంట్‌కు దీనిలో సగం ధర కూడా రాదని రైతన్నలు రోదిస్తున్నారు. ఇంకా నెల రోజుల్లో రొయ్యలు 40 కౌంట్‌కు వచ్చేవని, ఇప్పటికే లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టామని, కళ్ళముందు రొయ్యలు మృత్యువాత పడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ పెంచేందుకు ఎన్ని మందులు చల్లినా ప్రయోజనం లేదంటున్నారు. ఏది ఏమైనా వార్ధా తుపాను తీరం దాటినా.. దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆక్వా రంగాన్ని నట్టేట ముంచుతున్నాయనడంలో సందేహం లేదు.

విద్యుత్ విధానాల్లో
దేశానికే ఆంధ్రా ఆదర్శం

ౄ రూ. 670 కోట్ల విద్యుత్ ఆదా
ౄ దక్షిణాది విద్యుత్ సంస్థల సమావేశంలో
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి
ౄ ఏపి ఇంధన సంరక్షణ సంఘం,
ఈస్ట్రన్ పవర్ డిస్కాంకు ఉత్తమ అవార్డులు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్/విశాఖపట్నం, డిసెంబర్ 14: విద్యుత్ సంస్కరణలు, బిల్లింగ్, విద్యుత్ పంపిణీ, నాణ్యమైన విద్యుత్, విద్యుత్ ఆదా తదితర విధానాల్లో దేశంలోని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. దేశం మొత్తం మీద అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన విద్యుత్ సంస్థలు, ఇంధన ఆదా చేసిన సంస్థలకు ఆయన బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. విద్యుత్ ఆదా పథకాల్లో ఇంధన సంరక్షణ సంఘం సిఇఒ ఏ చంద్రశేఖర రెడ్డికి, నాణ్యమైన విద్యుత్ సరఫరా, నిర్వహణలో విశాఖపట్నంలోని ఈస్ట్రన్ విద్యుత్ డిస్కాం సిఎండి ఎంఎం నాయక్‌కు మంత్రి గోయల్ అవార్డులను బహుకరించారు. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశంలో 22 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేసినట్లు చెప్పారు. ఆంధ్రాలో 670 కోట్ల రూపాయల విలువైన 550 మెగావాట్ల విద్యుత్‌ను పొదుపు చేశారని ప్రశంసించారు. ఆంధ్రాలో ఆర్థిక సామాజిక అభివృద్ధికి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ పొదుపునకు ప్రత్యేక ద్విముఖ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి 9 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణలను వేగవంతం చేసి మిగులు విద్యుత్ సాధించారని కొనియాడారు. సమర్థ విద్యుత్ వినియోగం అమరావతి నగరాభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. ఆంధ్ర రాజధాని అమరావతిలో విద్యుత్ పొదుపు సంరక్షణ విధానాలను అమలు చేసేందుకు వీలుగా ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ ద్వారా 9 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 15 లక్షల మంది రైతులకు అత్యంత ప్రయోజనం కలిగించే విధంగా ఫైవ్‌స్టార్ రేటెడ్, అత్యంత నాణ్యమైన వ్యవసాయ పంపు సెట్లను ఉచితంగా అందిస్తున్నారని ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ డిస్కాంగా ఈస్ట్రన్ పవర్ డిస్కాం మంచి విధానాలను అమలు చేసిందని మెచ్చుకున్నారు. ఇంధన సంరక్షణ సంఘం పొదుపు సంరక్షణ విధానాల అమలులో రెండవ స్థానంలో నిలిచిందని, అన్ని గ్రామాల్లో ఎల్‌ఇడి వీధి దీపాలను అమర్చే పథకాన్ని సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి ఠక్కర్, ఇందన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

మహీంద్ర ఎకోలేలో యువతకు పారిశ్రామిక శిక్షణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 14: పరిశ్రమ అవసరాలను తీర్చే మానవ వనరులను అందించేందుకు మహీంద్ర ఎకోలేలో యువతకు శిక్షణ ఇచ్చారు. ఇక్యూ వెర్సస్ ఐక్యూ పేరిట ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు సంస్థ ప్రతినిధి ప్రొఫెసర్ బిష్ణుపాల్ పేర్కొన్నారు. ఈ శిక్షణ వల్ల వికాసం పొందిన ఉద్యోగులు సంస్థకు వస్తారని, వారి ద్వారా సంస్థ ఉత్పాదక సామర్థ్యం పెరిగే వీలుందని పాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం ముంబయలో నిర్వహించామని చెప్పారు. ఇలాంటి శిక్షణలు యువతకు మరిన్ని అందించాల్సిన అవసరముందన్నారు.

అపరిమిత ఉచిత కాల్స్
ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌సెల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: దేశీయ టెలికామ్ రంగంలో చోటుచేసుకున్న ధరల యుద్ధం, ఉచిత ఆఫర్ల ప్రకటనల్లోకి ఇప్పుడు భారీ సంస్థలేగాక, చిన్న సంస్థలూ అడుగిడుతున్నాయి. తాజాగా ఎయిర్‌సెల్ అపరిమిత ఉచిత కాలింగ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోలకు పోటీగా ప్రీ-పెయిడ్ కస్టమర్ల కోసం రెండు సరికొత్త ప్లాన్లను పరిచయం చేసింది. ఆర్‌సి 14, ఆర్‌సి 249లను బుధవారం ఎయిర్‌సెల్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్స్ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ ఆఫర్ ఆర్‌సి 14 రూపాయలపై ఒకరోజు, ఆర్‌సి 249 రూపాయలపై 28 రోజులుంటుందని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, కోల్‌కత్తా, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర సర్కిళ్లలో 4జి ఫోన్లున్న కస్టమర్లకు అదనంగా 1.5 జిబి 3జి డేటాను కూడా ఇస్తోంది.